నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. మీ రాత త్వరలోనే మారబోతోందంటూ..

నెట్‌ఫ్లిక్స్ లోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు హలో బచ్చో (Hello Bachhon). ఇదే ఓటీటీలో వచ్చిన హిట్ సిరీస్ కోటా ఫ్యాక్టరీ మేకర్స్ నుంచే ఇది కూడా రానుంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ మంగళవారం (ఫిబ్రవరి 17) రిలీజైంది.

Published on: Feb 17, 2026, 14:34:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో బయోపిక్ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్ 'ఫిజిక్స్ వాలా' (Physics Wallah) వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'హలో బచ్చో' (Hello Bachchon). ఇది మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా సిరీస్ మరో టీజర్ రిలీజ్ చేశారు. కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచే ఈ కొత్త సిరీస్ రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. మీ రాత త్వరలోనే మారబోతోందంటూ..
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. మీ రాత త్వరలోనే మారబోతోందంటూ..

హలో బచ్చో టీజర్

హలో బచ్చో వెబ్ సిరీస్ ను తీసుకురానున్నట్లు కొన్నాళ్ల కింద ఫస్ట్ లుక్ తో వెల్లడించిది. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 17) ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేసింది. మన రాత మార్చుకోవడానికి ఓ పెన్ను, ఓ బుక్కు అయితే అవసరమే కదా అనే డైలాగుతో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత డాక్టర్ కావాలని కలలు కనే కొందరు అణగారిన వర్గాల పిల్లల చుట్టూ ఈ టీజర్ తిరిగింది.

చివర్లో హలో బచ్చో అంటూ తన మార్క్ పిలుపుతో అలఖ్ పాండే పాత్రధారి ఎంట్రీ ఇస్తాడు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హలో బచ్చో.. త్వరలోనే మీ రాత మారబోతోంది అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ టీజర్ ను ట్వీట్ చేసింది.

ఫిజిక్స్ వాలా.. అలఖ్ పాండే రియల్ స్టోరీ

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన 'ఫిజిక్స్ వాలా' ఫౌండర్ అలఖ్ పాండే నిజ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. అలహాబాద్‌కు చెందిన ఒక సాధారణ ఫిజిక్స్ టీచర్.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కొని, విద్యార్థుల కలలను ఎలా సాకారం చేశాడనేది ఈ కథాంశం. చదువు అనేది కేవలం డబ్బున్న వారికే కాదు, ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన ప్రాథమిక హక్కు అని, అది వ్యాపారం కాకూడదని నమ్మే ఒక టీచర్ ప్రయాణం ఇది.

ఇందులో అలఖ్ పాండే పాత్రలో నటుడు వినీత్ కుమార్ సింగ్ కనిపించాడు. సామాన్యుల జీవితాలకు దగ్గరగా ఉండే కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన టీవీఎఫ్ (The Viral Fever) ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. అభిషేక్ యాదవ్ సృష్టించిన ఈ సిరీస్‌కు ప్రతిష్ మెహతా దర్శకత్వం వహించాడు. గిరిజా ఓక్ గాడ్బోలే, విక్రమ్ కొచ్చర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More