Dhurandhar 2: ధురంధర్ 2 క్లైమాక్స్‌పై నెటిజన్ల అసహనం- రణ్‌వీర్, సారా జంటకు ఆ గతి పట్టాల్సిందేనా- నెటిజన్స్ ఎండింగ్ ఇలా!
Debate On Dhurandhar 2 Climax Ranveer Sara: ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా, క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లు విడిపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. జస్కీరాత్ సింగ్, యాలీనా జంట కోసం నెటిజన్లు ఊహిస్తున్న ప్రత్యామ్నాయ ముగింపులు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన గూఢచారి ప్రపంచం 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. రణ్‌వీర్ సింగ్ (జస్కీరాత్ సింగ్ రంగీ/హమ్జా అలీ మజారీ), సారా అర్జున్ (యాలీనా జమాలి) మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది.

అయితే, ధురంధర్ 2 క్లైమాక్స్‌లో ఈ జంట విడిపోవడాన్ని ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై రెడ్డిట్ (Reddit) వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
హెచ్చరిక: ఈ కథనంలో సినిమా ముగింపునకు సంబంధించిన వివరాలు (Spoilers) ఉన్నాయి.
కథలో అసలేం జరిగింది?
మొదటి భాగంలో పాకిస్థాన్‌లో గూఢచారిగా ఉన్న జస్కీరాత్ సింగ్, అక్కడి రాజకీయ నాయకుడు జమీల్ జమాలి (రాకేష్ బేడీ) కుమార్తె యాలీనాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రెండో భాగంలో వీరికి ఒక కుమారుడు కూడా పుడతాడు. అయితే, తన భర్త అసలు గుర్తింపు తెలిసి యాలీనా గుండె పగిలిపోతుంది.
"నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు?" అని ఆమె ప్రశ్నిస్తున్నప్పుడు, పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడం ఎంత ముఖ్యమో జస్కీరాత్ వివరిస్తాడు. సినిమా చివరలో జమీల్ జమాలి కూడా భారత గూఢచారి అని తేలుతుంది. కానీ, తన భార్యాపిల్లలను మర్చిపోయి కొత్త జీవితంలోకి వెళ్లాలని జస్కీరాత్‌ను జమీల్ జమాలి కోరడంతో ఈ జంట విడిపోతుంది.
నెటిజన్ల ఆవేదన: "యాలీనాను భారత్‌కు తీసుకురావచ్చుగా?"
సినిమా ఆరంభంలో తన పాత జీవితాన్ని వదిలేస్తూ తల్లిదండ్రుల ఫోటోలను తగలబెట్టిన జస్కీరాత్, క్లైమాక్స్‌లో తన భార్యాపిల్లల ఫోటోను కూడా అలాగే తగలబెట్టి 'శౌర్య భరద్వాజ్' అనే కొత్త గుర్తింపుతో వెళ్లిపోతాడు. ఈ సీన్ చూసిన ఒక నెటిజన్ స్పందిస్తూ.. "యాలీనాను జస్కీరాత్ తనతో పాటు భారత్‌కు ఎందుకు తీసుకెళ్లకూడదు? ఆమెను అలా వదిలేయడం ఒక పెద్ద మానసిక క్షోభ (Trauma)" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరొక నెటిజన్ భిన్నంగా స్పందిస్తూ.. "ఆమె భారత్‌కు రాకపోయినా, వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టు కెనడాకు వెళ్లిపోవచ్చు కదా? కేవలం ప్రేక్షకులను ఏడిపించడం కోసమే దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషాద ముగింపు ఇచ్చారు. నిజ జీవితంలో ఏజెంట్లకు ఫ్యామిలీతో కలిసి కొత్త జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కదా" అని విశ్లేషించారు.
ప్రాక్టికల్ చిక్కులు కూడా ఉన్నాయి..
అయితే, పాకిస్థాన్‌లో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న జమీల్ జమాలి కుమార్తె అకస్మాత్తుగా మాయమైతే అక్కడి నిఘా వర్గాలు ఊరుకోవు కదా అని కొందరు వాదిస్తున్నారు. "జమీల్ సాబ్.. మీ అమ్మాయి, మనవడు ఏమయ్యారు? అని పోలీసులు అడిగితే ఏం సమాధానం చెబుతారు? దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడతాయి కదా" అని ఒక నెటిజన్ లాజిక్ తీశారు.
కానీ, యాలీనాకు తన భర్త మోసం చేశాడని తెలిసిన తర్వాత, ఆమె ఇంకా అతనితో ఉండాలని అనుకుంటుందా? లేదా? అనే కోణంలో ఎవరూ చర్చించకపోవడం గమనార్హం. ఇలా ధురంధర్ 2 క్లైమాక్స్‌పై వాదనలు ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ధురంధర్ 2 పది రోజుల కలెక్షన్స్
ధురంధర్ 2' కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఎమోషనల్ క్లైమాక్స్ వల్లే సినిమాకు ఇంతటి క్రేజ్ వచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


