...
...
Next Story

ఏంటీ ఆ అమ్మాయిలు రియల్ కాదా? ఏఐ భామలా? 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ రీ యూనియన్ వీడియోపై కామెంట్స్

లోకనాయుకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్న వార్త సినీ లోకాన్ని ఊపేస్తోంది. అయితే, నెల్సన్ దర్శకత్వంలో విడుదలైన ఈ కాంబో ప్రొమోలో కనిపించిన మోడల్స్ అసలైన వారు కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Published on: Feb 22, 2026 01:01 PM IST
Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు, కమల్ హాసన్, రజనీకాంత్.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వెండితెరపై కలిసి కనిపించనున్నారు. శనివారం (ఫిబ్రవరి 21) నాడు 'రెడ్ జెయింట్ మూవీస్' విడుదల చేసిన ఈ అఫీషియల్ ప్రొమో సినీ అభిమానులకు ఐ-ఫీస్ట్‌లా అనిపించింది. కానీ, ఈ ఆనందం మధ్యలో ఒక ఆసక్తికరమైన వివాదం తెరపైకి వచ్చింది. అదే.. ఈ వీడియోలో 'AI' (కృత్రిమ మేధ) వాడకం.

ఆ ప్రొమోలో ఏముంది?

ఏంటీ ఆ అమ్మాయిలు రియల్ కాదా? ఏఐ భామలా? 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ రీ యూనియన్ వీడియోపై కామెంట్స్
ఏంటీ ఆ అమ్మాయిలు రియల్ కాదా? ఏఐ భామలా? 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ రీ యూనియన్ వీడియోపై కామెంట్స్

దర్శకుడు నెల్సన్ రూపొందించిన ఈ ప్రొమోలో కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ షూటింగ్‌కు సిద్ధమవుతూ కనిపిస్తారు. వీరిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక నెల్సన్ తల పట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు స్టార్స్ తమ డ్రెస్సింగ్ రూమ్‌ల నుంచి బయటకు వచ్చి ఎదురెదురు పడతారు.

గ్యారేజ్ గుండా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కుతుంటే, అక్కడ అనిరుధ్, నెల్సన్ వీరి కోసం వేచి ఉంటారు. రాజీవ్ మీనన్ కెమెరా పనితనం ఈ సీన్‌ను ఎంతో గ్రాండ్‌గా చూపించింది. అయితే, ఈ నడక సాగుతున్నప్పుడు గ్యారేజ్‌లో కారు కడుగుతూ, రజనీ, కమల్ వైపు చూస్తూ ఉండే కొందరు గ్లామర్ బ్యూటీలు ఇప్పుడు చర్చకు కారణమయ్యారు.

నిజంగానే AI వాడారా?

ప్రొమో విడుదలైన కొద్దిసేపటికే, అందులోని కొందరు మోడల్స్ ఫోటోలను నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇదంతా AI సృష్టి" అంటూ కొందరు వాదించగా, 'Grok' (X ప్లాట్‌ఫామ్ లోని AI బాట్) కూడా దీనిని ధృవీకరించడం విశేషం.

"ఈ గ్యారేజ్ సీన్స్‌లోని అందమైన అమ్మాయిలను ఏఐ ద్వారా రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. మిడ్‌జర్నీ (Midjourney) లేదా ఫ్లక్స్ (Flux) వంటి టూల్స్ వాడితే వచ్చే హైపర్-రియలిస్టిక్ వివరాలు, పాలిష్డ్ స్టైల్ ఇందులో స్పష్టంగా ఉన్నాయి" అని గ్రోక్ సమాధానమిచ్చింది.

వివాదాలు పక్కన పెడితే, రజనీకాంత్, కమల్ హాసన్ కలయిక మాత్రం చారిత్రకమే. 1970లలో 'అపూర్వ రాగంగళ్', '16 వయతినిలే', 'నినైతాలే ఇనిక్కుమ్' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరు చివరిసారిగా 1985లో అమితాబ్ బచ్చన్ హిందీ చిత్రం 'గిరఫ్తార్'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 40 ఏళ్లకు డైరెక్టర్ నెల్సన్ సినిమాతో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు స్నేహితులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి రికార్డులు తిరగరాయడానికి సిద్ధమయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe