పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కన్నడ మూవీ ‘కేడీ ది డెవిల్’ నుంచి వచ్చిన కొత్త సాంగ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందీలో ‘సర్కే చునార్ తేరి సర్కే’ అని సాగుతున్న ఈ పాటలో లిరిక్స్, స్టెప్పులపై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. పాటలో బూతులు ఉన్నాయని, డ్యాన్స్ అసభ్యకరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.
సర్కే చునార్ తేరి సర్కే సాంగ్

కేడీ ది డెవిల్ మూవీలో నుంచి రిలీజైన సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ కాంట్రవర్సీకి దారితీసింది. ఇందులో నోరా ఫతేహి వల్గర్ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో సంజయ్ దత్ కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ ఈ పాట పాడింది.
పైట జారుస్తూ
సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ లో నోరా ఫతేహి పైట జారుస్తూ డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదేం డ్యాన్స్, ఇంత నీచమా? అంటూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. యూట్యూబ్ లో సాంగ్ వీడియో కింద కామెంట్లలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
లిరిక్స్
పాట లిరిక్స్ లో బూతులే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. పాటలోని ఫస్ట్ లైన్ శృంగారాన్ని వర్ణిస్తుందని, అమ్మాయి జననేంద్రియాల గురించి చెప్తున్నట్లు ఉందని ఫైర్ అవుతున్నారు. ఈ పాటను మంగ్లీ పాడగా, రఖీబ్ ఆలమ్ సాహిత్యం అందించారు, అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్.
"అశ్లీలత అగ్రస్థానంలో ఉంది", "లిరిక్స్ చాలా చౌకగా, అసభ్యంగా ఉన్నాయి", "ఇదేమిటి? ఇది 2026. ఇప్పటికీ ఇలాంటి పాటలు, డ్యాన్స్ లు?’’ అని నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తీవ్రంగా మండిపడుతున్నారు. పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగులో బెటర్
{{/usCountry}}"అశ్లీలత అగ్రస్థానంలో ఉంది", "లిరిక్స్ చాలా చౌకగా, అసభ్యంగా ఉన్నాయి", "ఇదేమిటి? ఇది 2026. ఇప్పటికీ ఇలాంటి పాటలు, డ్యాన్స్ లు?’’ అని నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తీవ్రంగా మండిపడుతున్నారు. పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగులో బెటర్
{{/usCountry}}కేడీ ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ తెలుగులోనూ రిలీజ్ అయింది. ‘జరిపేయ్ నాతో పండగ జరిపేయ్’ అంటూ తెలుగు సాంగ్ సాగుతుంది. దీన్ని చంద్రబోస్ బెటర్ గా రాశారు. దీంతో కన్నడ అభిమానులు చంద్రబోస్ కు థ్యాంక్స్ చెప్తున్నారు. కన్నడలో, హిందీలో సాంగ్ బూతులతో నిండిపోయిందని, తెలుగులో చక్కగా రాసిన చంద్రబోస్ కు ధన్యవాదాలు అని కామెంట్లు పెడుతున్నారు.
కేడీ ది డెవిల్ గురించి
కేడీ: ది డెవిల్ అనేది 2026లో విడుదల కానున్న కన్నడ భాషా యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనికి ప్రీమ్ దర్శకత్వం వహించాడు. ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రీష్మా నానయ్య తదితరులు నటించారు. 1970ల నేపథ్యంలో సాగే అండర్ వరల్డ్ కథ ఇది. ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది.