...
...
Next Story

Ramayana Trolls: జటాయువుకు చేతులుంటాయా? సీతమ్మ ఫైట్ చేయడమేంటీ? రామాయణం సినిమాపై ట్రోల్స్.. కానీ ఆ సీక్వెన్సే హైలైట్!

Ramayana Trolls: సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసిన భారీ సినిమా ‘రామాయణం పార్ట్ 1’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో విజువల్స్ అదిరిపోయాయని మెజారిటీ నెటిజన్లు అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం జటాయువుకు రెండు చేతులు ఉండటం ఏంటీ? సీతమ్మ ఎప్పుడైనా ఫైట్ చేశారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Published on: Nov 5, 2026, 12:40:39 IST
Advertisement

Ramayana Trolls: ఇండియన్ సినిమా హిస్టరీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం పార్ట్ 1’ ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్ అన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయని అంటున్నారు.

జటాయువుకు చేతులు ఏంటి బాసూ?

జటాయువుకు చేతులుంటాయా? సీతమ్మ ఫైట్ చేయడమేంటీ? రామాయణం సినిమాపై ట్రోల్స్.. కానీ ఆ సీక్వెన్సే హైలైట్!
జటాయువుకు చేతులుంటాయా? సీతమ్మ ఫైట్ చేయడమేంటీ? రామాయణం సినిమాపై ట్రోల్స్.. కానీ ఆ సీక్వెన్సే హైలైట్!

ఒకవైపు రామాయణం సినిమా విజువల్స్ పై ప్రశంసల వర్షం కురుస్తుండగానే, మరోవైపు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా జటాయువు పాత్ర డిజైన్ పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ బెటర్

"పక్షికి చేతులు ఉండటం ఎప్పుడైనా చూశారా? దర్శకుడు తన ఇమాజినేషన్ కు మరీ ఇంత స్వేచ్ఛ ఇవ్వాలా?" అంటూ ఎక్స్ (ట్విట్టర్), ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ పేలుతున్నాయి. ‘‘ఇలాంటివి చూసినప్పుడే మా ఆదిపురుష్ బెటర్ అనిపిస్తుంది. అయినా జటాయుకు రెండు చేతులు, రెండు రెక్కలు ఏంటీ? వా’’ అని సెటైరికల్ గా ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

నిజం ఏంటీ?

కానీ రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలు నరికేయడంతో కింద పడతాడు. ఆ తర్వాత సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడనే సమాచారాన్ని, దిక్కును రాముడికి చెప్పి జటాయువు ప్రాణాలు విడుస్తాడు. దీని ప్రకారం జటాయువుకు రెక్కలు, కాళ్లు మాత్రమే ఉంటాయి. అయితే గరుడ, జటాయువు, సంపతి వంటి పక్షులను దేవుళ్లగా కొలుస్తారు. కొన్ని ఫొటోలు, విగ్రహాల్లో వీళ్లకు చేతులు కూడా ఉన్నట్లు ఉంటుంది.

సీతమ్మ ఫైట్ చేయడమా?

ఈ ట్రోల్స్ కేవలం జటాయువుకే పరిమితం కాలేదు. సినిమాలో సీతాదేవి పాత్ర యాక్షన్ సీన్స్ (ఫైట్స్) చేయడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. "సీతమ్మ వారు ఎంతో శాంత స్వరూపిణి, ఆమె ఎప్పుడైనా యుద్ధం చేసినట్లు ఏ రామాయణంలోనైనా ఉందా?" అంటూ పురాణ పండితులు, సాధారణ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కమర్షియల్ హంగుల కోసం ఇతిహాసాలను మార్చకూడదని హితవు పలుకుతున్నారు.

పుష్పక విమానం డిజైన్

ఇకపోతే రావణాసురుడి పుష్పక విమానం డిజైన్ పై కూడా విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. "ఆ విమానం డిజైన్ చూస్తే అసలు గాలిలో ఎలా ఎగురుతుందో అర్థం కావడం లేదు, ఏరోడైనమిక్స్ లాజిక్స్ అన్నీ గాలికి వదిలేశారు" అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

అదే హైలైట్

రామాయణం సినిమాలో జటాయువుకు చేతులు ఉండటంపై ట్రోల్స్ వస్తున్నాయి. కానీ మూవీలో రావణ, జటాయువు యుద్ధం సీక్వెన్స్ హైలైట్ గా నిలిచిందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. తాము కొన్ని టికెట్ కు ఇదొక్క సీక్వెన్స్ చాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks