రాజా సాబ్‌లో కొత్త సీన్లు.. ఓల్డ్ లుక్‌లో ప్ర‌భాస్‌.. ఆ ఎపిసోడ్ అదిరిపోతుంద‌న్న డైరెక్ట‌ర్‌.. స‌ర్వ‌ర్ డౌన్‌తో ప్రాబ్లం

రాజా సాబ్ మూవీ ఫస్ట్ డే చూసి డిసప్పాయింట్ అయ్యారా? ముఖ్యంగా ఓల్డ్ లుక్ లో ప్రభాస్ ఫైట్ సీన్ లేదని నిరాశ చెందారా? అయితే మీ లాంటి ఫ్యాన్స్ కోసం మేకర్స్ రాజా సాబ్ లో కొన్ని సీన్లు యాడ్ చేశారు. సినిమాలో ఈ కొత్త సీక్వెన్స్ అదిరిపోతుందని డైరెక్టర్ మారుతి చెప్పాడు. 

Published on: Jan 10, 2026, 17:09:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా సాబ్' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ముఖ్యంగా, ట్రైలర్‌లో చూపించిన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాలో లేకపోవడంపై అభిమానులు, విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మూవీ టీమ్ కొత్త సీన్లను రాజా సాబ్ చిత్రంలో యాడ్ చేసింది. ప్రభాస్ ఓల్డ్ లుక్ లో ఉన్న సీక్వెన్స్ అదిరిపోతుందని డైరెక్టర్ మారుతి చెప్పాడు.

రాజా సాబ్ లో ప్రభాస్
రాజా సాబ్ లో ప్రభాస్

రాజా సాబ్ లో సీన్లు

శనివారం (జనవరి 10) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ సినిమా గురించి మాట్లాడుతూ, ప్రభాస్ పాత లుక్‌లో కనిపించే కొన్ని కొత్త సన్నివేశాలను రాజా సాబ్ లో చేర్చినట్లు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ కోసం ఫ్యాన్స్ వెతికారని డైరెక్టర్ మారుతి అన్నాడు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు యాడ్ చేశామని, అదిరిపోతుందని తెలిపాడు.

ప్రభాస్ లుక్ కోసం

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "ప్రభాస్ అభిమానులు సినిమాతో నిరాశ చెందలేదు, కానీ సంతృప్తి కూడా చెందలేదు. ఎందుకంటే ట్రైలర్‌లో మేము అతన్ని ఒక పాత గెటప్‌లో, ఒక వైఖరితో, స్వాగ్‌తో చూపించాము. ఆ లుక్‌ను వెతికే క్రమంలో అభిమానుల మెదడు నేను చూపిస్తున్న కథను ప్రాసెస్ చేయలేకపోయింది" అని తెలిపాడు.

అద్భుతంగా

ప్రభాస్ పాత లుక్‌లోని సన్నివేశాల గురించి చాలా మంది తనను అడిగారని దర్శకుడు మారుతి పేర్కొన్నాడు. "అది దృష్టిలో ఉంచుకుని, ఈ సాయంత్రం నేను సినిమా రెండవ భాగాన్ని మరింత పదునుగా చేయడానికి కూర్చున్నా. ఈరోజు సాయంత్రం 6 గంటల షో నుంచి సినిమాలో కొత్త సీన్లు యాడ్ అవుతాయి. 8-9 నిమిషాల ఈ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటివరకు ఏ సినిమా కూడా పైకప్పుపై జరిగే పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించలేదు. ప్రభాస్ దాని కోసం చాలా కష్టపడ్డాడు" అని మారుతి తెలిపాడు.

సర్వర్ డౌన్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణంగా ఈ సీన్లను మొదట సినిమాలో చూపించలేకపోయామని అన్నాడు. "సినిమాలో ప్రభాస్ తన పాత అవతార్‌లో కనిపించే 4 నిమిషాల కంటెంట్ మిస్ అయింది. ఒక వారం క్రితం, దురదృష్టకర సంఘటన సర్వర్ డౌన్ అవ్వడం వల్ల మాకు ఈ అవుట్‌పుట్ వచ్చింది. ఇప్పుడు మేము దానిని పూర్తి చేసి థియేటర్లకు పంపించాము" విశ్వ ప్రసాద్ అని తెలిపాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More