ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు సరికొత్తగా హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోకి న్యూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకదంతాయ సిరి. తల్లాడ సాయికృష్ణ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా "మ్యాజిక్ మూవ్‌మెంట్స్". మీరు అనుకున్నది కాదు అనేది క్యాప్షన్.
సమర్పకులుగా డైరెక్టర్

ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఏకదంతాయ సిరి. మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాకు డైరెక్టర్ కె దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
న్యూ హీరోయిన్ కామెంట్స్
అయితే, ఇటీవల మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మూవీ టైటిల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
గ్లామర్ షో అనుకుంటారు
హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ.. "చిన్న సినిమాలోకి హీరోయిన్స్‌ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ, సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు" అని అన్నారు.
ఇలా కూడా చేయొచ్చా
"మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాను డైరెక్టర్ ఇంత ఫాస్ట్‌గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్‌గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మూవీ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాం" అని తెలిపింది హీరోయిన్ ఏకదంతాయ సిరి.
మంచి సస్పెన్స్ థ్రిల్లర్
చిత్ర సమర్పకులు దశరథ్ మాట్లాడుతూ.. "తల్లాడ సాయికృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సినిమా ప్రయత్నాల్లోనే ఉంటాడు. ఒకరోజు సాయి ఈ కథ నాకు వినిపించాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని అన్నారు.
నా వంతు సపోర్ట్
"సాయికృష్ణకు మ్యాజిక్ మూవ్‌మెంట్స్ (మీరు అనుకున్నది కాదు) సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. సినిమా అంటే ఇష్టం ఉన్న సాయికృష్ణకు నా వంతు సపోర్ట్ అందించాలనే చిత్ర సమర్పణకు ముందుకొచ్చాను. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని డైరెక్టర్ దశరథ్ తెలిపారు.
హీరో హీరోయిన్‌తోపాటు
{{/usCountry}}"సాయికృష్ణకు మ్యాజిక్ మూవ్‌మెంట్స్ (మీరు అనుకున్నది కాదు) సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. సినిమా అంటే ఇష్టం ఉన్న సాయికృష్ణకు నా వంతు సపోర్ట్ అందించాలనే చిత్ర సమర్పణకు ముందుకొచ్చాను. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని డైరెక్టర్ దశరథ్ తెలిపారు.
హీరో హీరోయిన్‌తోపాటు
{{/usCountry}}ఇదిలా ఉంటే, మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాలో తల్లాడ సాయి కృష్ణ, ఏకదంతాయ సిరితోపాటు శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్, కిషోర్ దాస్, అకెళ్ల, వాసు ఇంటూరి, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, వెంకట్ దుగ్గిరెడ్డి, వినోద్ నువ్వుల, అమ్మినేని స్వప్న, తల్లాడ వెంకన్న ఇతర పాత్రలు పోషించారు.
మ్యాజిక్ మూవ్‌మెంట్స్ నటీనటులు
వీరితోపాటుగానే చంద్ర సుబ్బగారి, అను, భాను, మురళీ, సునీల్,, చంద్ర, తారక్ దూగాన, పృథ్వీ, నిక్కీ చౌదరి, రాంకీ, జీఎస్‌కే సాయి, ఇంద్ర కుమార్, దత్తు, ప్రశాంత్, రవిరెడ్డి, బంగ్లా వెంకట్, ప్రసాద్, కొత్త వెంకటేశ్వర్లు, గౌరీ తదితరులు నటించారు.