చిన్న సినిమాలో హీరోయిన్ అంటే గ్లామర్ షో చేయిస్తారనుకుంటారు, కానీ.. న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి కామెంట్స్

తెలుగు ఇండస్ట్రీలోకి న్యూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకదంతాయ సిరి. తల్లాడ సాయికృష్ణ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాతో హీరోయిన్‌గా సిరి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నిర్వహించిన మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో ఏకదంతాయ సిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Updated on: Dec 14, 2025, 15:10:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు సరికొత్తగా హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోకి న్యూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకదంతాయ సిరి. తల్లాడ సాయికృష్ణ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా "మ్యాజిక్ మూవ్‌మెంట్స్". మీరు అనుకున్నది కాదు అనేది క్యాప్షన్.

చిన్న సినిమాలో హీరోయిన్ అంటే గ్లామర్ షో చేయిస్తారనుకుంటారు, కానీ.. న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి కామెంట్స్
చిన్న సినిమాలో హీరోయిన్ అంటే గ్లామర్ షో చేయిస్తారనుకుంటారు, కానీ.. న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి కామెంట్స్

సమర్పకులుగా డైరెక్టర్

ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఏకదంతాయ సిరి. మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాకు డైరెక్టర్ కె దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

న్యూ హీరోయిన్ కామెంట్స్

అయితే, ఇటీవల మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మూవీ టైటిల్ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

గ్లామర్ షో అనుకుంటారు

హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ.. "చిన్న సినిమాలోకి హీరోయిన్స్‌ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ, సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు" అని అన్నారు.

ఇలా కూడా చేయొచ్చా

"మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాను డైరెక్టర్ ఇంత ఫాస్ట్‌గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్‌గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మూవీ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాం" అని తెలిపింది హీరోయిన్ ఏకదంతాయ సిరి.

మంచి సస్పెన్స్ థ్రిల్లర్

చిత్ర సమర్పకులు దశరథ్ మాట్లాడుతూ.. "తల్లాడ సాయికృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సినిమా ప్రయత్నాల్లోనే ఉంటాడు. ఒకరోజు సాయి ఈ కథ నాకు వినిపించాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని అన్నారు.

నా వంతు సపోర్ట్

"సాయికృష్ణకు మ్యాజిక్ మూవ్‌మెంట్స్ (మీరు అనుకున్నది కాదు) సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. సినిమా అంటే ఇష్టం ఉన్న సాయికృష్ణకు నా వంతు సపోర్ట్ అందించాలనే చిత్ర సమర్పణకు ముందుకొచ్చాను. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని డైరెక్టర్ దశరథ్ తెలిపారు.

హీరో హీరోయిన్‌తోపాటు

ఇదిలా ఉంటే, మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాలో తల్లాడ సాయి కృష్ణ, ఏకదంతాయ సిరితోపాటు శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్, కిషోర్ దాస్, అకెళ్ల, వాసు ఇంటూరి, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, వెంకట్ దుగ్గిరెడ్డి, వినోద్ నువ్వుల, అమ్మినేని స్వప్న, తల్లాడ వెంకన్న ఇతర పాత్రలు పోషించారు.

మ్యాజిక్ మూవ్‌మెంట్స్ నటీనటులు

వీరితోపాటుగానే చంద్ర సుబ్బగారి, అను, భాను, మురళీ, సునీల్,, చంద్ర, తారక్ దూగాన, పృథ్వీ, నిక్కీ చౌదరి, రాంకీ, జీఎస్‌కే సాయి, ఇంద్ర కుమార్, దత్తు, ప్రశాంత్, రవిరెడ్డి, బంగ్లా వెంకట్, ప్రసాద్, కొత్త వెంకటేశ్వర్లు, గౌరీ తదితరులు నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More