...
...
Next Story

టీ20 నుంచి ఇవాళ రిటైర్‌మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్సన్.. నాకు, టీమ్‌కు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ వీడ్కోలు

న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇవాళ ఆదివారం టీ20లకు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్ టీమ్‌కు, కొత్తవారికి, తనకు ఇదే కరెక్ట్ టైమ్ అతను భావించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) విడుదల చేసిన ప్రకటనలో కేన్స్ విలియమ్సన్ చెప్పి కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

Published on: Nov 2, 2025, 08:13:58 IST
Advertisement

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదివారం టీ20 నుండి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అది అభిమానులకు షాకింగ్‌గా మారింది. అయితే, కేన్ విలియమ్సన్ పురుషుల టీ20 మ్యాచుల్లో 33 సగటుతో 2,575 పరుగులు చేశారు. దీంతో కివీస్ తరఫున రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేన్ విలియమ్సన్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.

కేన్స్ విలియమ్సన్ అత్యధిక స్కోర్

టీ20 నుంచి ఇవాళ రిటైర్‌మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్సన్.. నాకు, టీమ్‌కు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ వీడ్కోలు (REUTERS)
టీ20 నుంచి ఇవాళ రిటైర్‌మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్సన్.. నాకు, టీమ్‌కు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ వీడ్కోలు (REUTERS)

ఈ రన్స్‌లలో 18, 50 సిక్స్‌లు ఉండగా.. అత్యధిక స్కోర్‌గా 95 పరుగులు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన కేన్స్ విలయమ్సన్ డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టెస్టుల వైట్ బాల్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు.

75 సార్లు జట్టుకు నాయకత్వం

ఇకపోతే 2011లో టీ20ల్లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల కెప్టెన్ కేన్స్ 75 సార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో బ్లాక్ క్యాప్స్ టీమ్ 2016, 2022లో టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే, 2021 ఎడిషన్‌లో ఫైనల్‌‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడింది న్యూజిలాండ్.

కేన్స్ విలియమ్సన్ రియాక్షన్

వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు ముందు టీ20లకు రిటైర్ కావాలని తన నిర్ణయాన్ని చెప్పాడు కేన్స్ విలియమ్సన్. తాను పదవి నుంచి వైదొలగడానికి, ఇతరులను బాధ్యతలు చేపట్టడానికి అనుమతించే సమయం సరైనదిగా తాను భావిస్తున్నట్లు కేన్స్ విలియమ్సన్ చెప్పాడు.

ఇదే సరైన సమయం

"ఇంతకాలం ఇలా నేను భాగం కావడాన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఈ ప్రయాణంలోని జ్ఞాపకాలు, అనుభవాలకు నేను చాలా కృతజ్ఞుడను. నాకు, నా జట్టుకు ఇది సరైన సమయం. ఇది వచ్చే టీ20 వరల్డ్ కప్ పోటీలో తలపడేందుకు జట్టుకు స్పష్టతనిస్తుంది" అని న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కేన్స్ విలియమ్సన్ తెలిపాడు.

అతను బ్రిలియెంట్ కెప్టెన్

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe