...
...
Next Story

Nidhhi Agerwal: మొసలితో నిధి అగర్వాల్ వాకింగ్.. ఏనుగుతో స్విమ్మింగ్.. సముద్రంలో తిమింగళంతో.. ఫొటోలు వైరల్

Nidhhi Agerwal: యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ పెద్ద పెద్ద అడ్వెంచర్లు చేస్తోంది. మొసలితో వాకింగ్ కు వెళ్లింది. ఏనుగుతో పూల్ లో ఆటలాడింది. సముద్రంలో తిమింగళంతో కనిపించింది. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ పిక్స్ వెనుక ఉన్న నిజమేంటో ఇక్కడ చూసేయండి.

Published on: May 8, 2026, 10:58:38 IST
Advertisement

Nidhhi Agerwal: హాట్ బ్యూటీ,టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ధైర్యం ఎక్కువే. లేకపోతే మొసలిని పట్టుకుని వాకింగ్ కు వెళ్లడం ఏంటీ? స్విమ్మింగ్ పూల్ లో ఏనుగుతో ఆటలాడటం ఏంటీ? సముద్రంలో తిమింగళంతో కనిపించడం ఏంటీ? ఇలా అడ్వెంచర్ ఫొటోలతో నిధి అగర్వాల్ పేరు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అయితే దీని వెనుక ఓ సీక్రెట్ ఉంది.

నిధి అగర్వాల్ ఫొటోలు

నిధి అగర్వాల్ (facebook/niddhi agerwal)
నిధి అగర్వాల్ (facebook/niddhi agerwal)

హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ తో ఫొటోలు క్రియేట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. తన గ్లామరస్ పిక్స్ కు అడ్వెంచర్ ను యాడ్ చేస్తోంది.

ఏఐ సాయంతో

ఏఐని వాడి తన ఫొటోలను క్రియేట్ చేస్తోంది నిధి అగర్వాల్. మొసలిని పట్టుకుని వాకింగ్ కు వెళ్లినట్లు, స్విమ్మింగ్ పూల్ లో ఏనుగుతో ఆటలాడినట్లు, సముద్రంలో వెనకాల పెద్ద తిమింగళం వస్తుంటే ధైర్యంగా ముందుకు సాగినట్లు.. ఇలా డిఫరెంట్ ఫొటోలను ఏఐతో నిధి క్రియేట్ చేసింది. ఈ పిక్స్ ను తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేసింది.

వైరల్ గా

నిధి అగర్వాల్ పోస్టు చేసిన ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. ఏఐ ఫొటో ట్రెండ్ ను ఈ భామ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి. నిధి పాపకు ఎంత ధైర్యమో అంటూ నెటిజన్లు ఫన్నీగా రిప్లేలు ఇస్తున్నారు. మొత్తానికి ఏఐ ఫొటో ట్రెండ్ తో నిధి అగర్వాల్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

పెద్ద సినిమాలు చేసినా

రెబల్ స్టార్ ప్రభాస్ తో హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’లో ఈ హాట్ బ్యూటీ నిధి నటించింది. ఈ మూవీ తనకు బ్రేక్ ఇస్తుందని నిధి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. కానీ చివరకు రాజాసాబ్ తో మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks