సందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్‌తో మ‌ల్టీస్టార‌ర్‌.. నిధి అగ‌ర్వాల్ కోరిక మామూలుగా లేదు

రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పెద్ద కోరికలే ఉన్నాయి. తెలుగులో పవన్ కల్యాణ్, ప్రభాస్ తో మల్టీ స్టారర్, అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయాలని చెప్పింది ఈ బ్యూటీ. ఇవాళ సాయంత్రం ట్విటర్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానమిస్తూ నిధి ఇలా చెప్పింది. 

Published on: Dec 28, 2025, 19:42:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజా సాబ్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన ముగ్గురు హీరోయిన్లలో ఆమె ఒకరు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎక్స్ (ట్విటర్)లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ (x)
నిధి అగర్వాల్ (x)

ప్రభాస్, పవన్ తో మల్టీస్టారర్

నిధి అగర్వాల్ చివరగా పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లులో కనిపించింది. ఇప్పుడు ప్రభాస్ తో రాజా సాబ్ చేసింది. రాజా సాబ్ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎక్స్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది నిధి. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ప్రభాస్, పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ లో నటించాలని ఉందని పెద్ద కోరికే బయటపెట్టింది.

సందీప్ వంగా డైరెక్షన్ లో

ఎక్స్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నిధి అగర్వాల్ సమాధానమిచ్చింది. ఓ అభిమాని ఏమో.. ‘‘తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ కాంబినేషన్ ఏది? అందులో మీరు కూడా నటించాలని అనుకుంటున్నారా’’ అని అడిగాడు. దీనికి నిధి రిప్లే ఇస్తూ.. ‘‘పీకే సర్, ప్రభాస్ సర్, నేను, ఎస్ఆర్వీ (సందీప్ రెడ్డి వంగా)’’ అని పేర్కొంది.

బ్రేక్ ఫాస్ట్ డేట్

బ్రేక్ ఫాస్ట్ డేట్ కు వెళ్దామా? అని నిధి అగర్వాల్ అడిగింది. బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ కోసం పూర్ణ టిఫిన్ సెంటర్ కు ఎప్పుడు వెళ్తారు? అని నిధిని ఓ ఫ్యాన్ అడిగాడు. ‘‘రేపు? బ్రేక్ ఫాస్ట్ డేట్’’ అని నిధి రిప్లే ఇచ్చింది. అలాగే స్వీట్ గెశ్చర్ గా ఫ్యాన్ ను డిన్నర్ కు తీసుకెళ్తే ఎలా ఉంటుందని మరో అభిమాని అడిగితే, ఎప్పుడు వెళ్దామనుకుంటున్నారు? ప్లాన్ చేయండని నిధి చెప్పింది.

సలార్ అంటే ఇష్టం

ప్రభాస్ సినిమాల్లో సలార్ అంటే ఇష్టమని నిధి అగర్వాల్ పేర్కొంది. ‘‘ప్రభాస్ ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్ అంటే బాగా ఇష్టం?’’ అని ఓ అభిమాని అడిగితే.. ‘సలార్’ అని నిధి తెలిపింది. అలాగే ప్రభాస్ ను ‘ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని నిధి పేర్కొంది. పవన్, ప్రభాస్ ఇద్దరూ తమ ఫ్యాన్స్ ను అమితంగా ప్రేమిస్తారని నిధి చెప్పింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More