హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అతడు తన వాదనను సమర్థించుకుంటూ.. నిధి అగర్వాల్ బట్టల వల్లే జనం రెచ్చిపోయారని, సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీగా సేఫ్ అయిందని వ్యాఖ్యానించాడు. దీనిపై నిధి అగర్వాల్ స్పందిస్తూ.. "బాధితులను నిందించడం మ్యానిపులేషన్ (పక్కదారి పట్టించడం) అవుతుంది" అని గట్టిగా బదులిచ్చింది.
శివాజీకి నిధి కౌంటర్ ఇలా..

హీరోయిన్ల బట్టల గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇంకా రచ్చ అవుతూనే ఉన్నాయి. తాను చెప్పింది కరెక్టే అంటూ అతడు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలకు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా చురకలు అంటించింది.
డిసెంబర్ 17న 'ది రాజా సాబ్' ఈవెంట్ కోసం లులు మాల్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆమె వేసుకున్న బట్టల వల్లే అలా జరిగిందని శివాజీ పదే పదే అనడంపై నిధి స్పందించింది.
ఆమె ఆ రోజు ఈవెంట్‌లో దిగిన తన ఫోటోను షేర్ చేస్తూ.. "ఒక బాధితురాలిని నిందించడం అనేది మ్యానిపులేషన్ అవుతుంది" అని రాసుకొచ్చింది. ఎవరి పేరు చెప్పకపోయినా.. ఇది శివాజీకి ఇచ్చిన కౌంటరే అని అందరికీ అర్థమైంది.
"ఆమె రెచ్చగొట్టింది.. మగవాళ్ళు అంతే"
మగవాళ్లు పద్ధతిగా ఉండాలని ఎందుకు చెప్పరు అని విలేకరులు ప్రశ్నించగా శివాజీ వింత సమాధానం ఇచ్చాడు.
"మగవాళ్ళకు చెప్తే ఎవరు వింటారు? వాళ్లు ఫోటోలు దిగడానికో, మాట్లాడటానికో వస్తారు. ఆ రోజు నిధి బట్టలు గనక జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మనం అడిగితే ఎవరైనా ఆ వీడియోలు డిలీట్ చేస్తారా?" అని ప్రశ్నించాడు.
"సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీ.."
{{/usCountry}}"మగవాళ్ళకు చెప్తే ఎవరు వింటారు? వాళ్లు ఫోటోలు దిగడానికో, మాట్లాడటానికో వస్తారు. ఆ రోజు నిధి బట్టలు గనక జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మనం అడిగితే ఎవరైనా ఆ వీడియోలు డిలీట్ చేస్తారా?" అని ప్రశ్నించాడు.
"సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీ.."
{{/usCountry}}సమంత చీర కట్టుకుని వెళ్లినా ఆమెను కూడా జనం ఇబ్బంది పెట్టారు కదా అని అడగగా.. "సమంతకు అదొక అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె అదృష్టవశాత్తూ చీరలో ఉంది కాబట్టి సేఫ్ అయ్యింది. ఈ కాలం జెన్-Z పిల్లలకు ఏం తెలియదు.. ఆర్టిస్టులను తాకాలని చూస్తుంటారు. పాతకాలంలో శ్రీదేవిని కూడా తెనాలిలో షూటింగ్ అప్పుడు ఎవరో టచ్ చేశారు. ఇక్కడ నేను నిధిని గానీ, సమంతను గానీ బ్లేమ్ చేయడం లేదు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నా" అని అన్నాడు.
"సాయి పల్లవిని ఎవరైనా టచ్ చేశారా?"
మహిళలు ఏ బట్టలు వేసుకున్నా వేధింపులు జరుగుతున్నాయి కదా అని విలేకరులు నిలదీయగా.. శివాజీ టాపిక్ మార్చేశాడు.
"సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు.. సాయి పల్లవి, అనుష్క, సౌందర్య, భూమిక, లయ, మీరా జాస్మిన్ లాంటి వాళ్ళను ఎవరైనా టచ్ చేశారా? వాళ్ళు పద్ధతిగా డ్రెస్ చేసుకుంటారు కాబట్టి ఆ సమస్య రాలేదు. మీరు రెచ్చగొట్టకండి.. అలా చేస్తే మగవాళ్ళకు టచ్ చేయాలని అనిపిస్తుంది. వాళ్లకు ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి.. కానీ నేను ఉన్న వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నా" అని శివాజీ చెప్పుకొచ్చాడు.