...
...
Next Story

Niharika Konidela: నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. నిహారిక కొణిదెల కామెంట్స్

Niharika Konidela Comments On Distributors: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల కామెంట్స్ చేశారు.

Published on: Apr 11, 2026, 10:42:43 IST
Advertisement

Niharika Konidela About Distributors: మెగా డాటర్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ మూవీ రాకాస. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా హారర్ ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది.

ముఖ్య అతిథులుగా బ్రహ్మాజీ, మైత్రి రవి

నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. నిహారిక కొణిదెల కామెంట్స్
నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. నిహారిక కొణిదెల కామెంట్స్

మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస గత వారం విడుదలై అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

ఈ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "‘రాకాస’ని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్‌కి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ, అది అసాధ్యం. మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని అన్నారు.

ఇండస్ట్రీలో పెద్ద గైడెన్స్

"మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ‘ఉప్పెన’ టైంలో మైత్రి రవి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు ఈ ఇండస్ట్రీలో పెద్ద గైడెన్స్ ఇస్తారు. స్ట్రైక్ టైంలో సపోర్ట్ చేసిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు థాంక్స్" అని నిహారిక కొణిదెల చెప్పారు.

"పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బిగ్గెస్ట్ పిల్లర్‌గా రమేష్ గారు మాకు అండగా నిలిచారు. మా మూవీకి మీడియా నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో నేటి నుంచి ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. అందరూ ‘రాకాస’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని కోరారు నిహారిక కొణిదెల.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. "మా ‘రాకాస’ మూవీని డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి జనాల వరకు రీచ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నా డ్రీమ్‌ని, నా కథను ఇంత వరకు తీసుకు వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నా టీంకు థాంక్స్" అని చెప్పారు.

రెండో వారంలోనూ ఎక్కువ స్క్రీన్లలో

వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. "‘రాకాస’ రెండో వారంలోనూ ఎక్కువ స్క్రీన్లలో ఆడుతోంది. ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. ‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత మళ్లీ మాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, టీంకు థాంక్స్" అని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe