చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Niharika Konidela Apsara Song: నిహారిక కొణిదెల నిర్మాతగా పాకెట్ రాకెట్స్.. అప్సర అంటూ ఇల్యూషన్ సాంగ్ రిలీజ్!
Pocket Rockets Apsara Illusion Song Release: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘పాకెట్ రాకెట్స్’ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. త్రినాథ్ వర్మ, నిర్మల్, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ‘అప్సర’ అంటూ సాగే ఇల్యూషన్ సాంగ్‌ను విడుదల చేశారు.
Pocket Rockets Apsara Illusion Song Release: ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి ఘనవిజయం తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.

పాకెట్ రాకెట్స్ రిలీజ్ డేట్
రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 11న విడుదల కానుంది. పాకెట్ రాకెట్స్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి అంచనాలను పెంచింది.
ఇల్యూషన్ సాంగ్ రిలీజ్
తాజాగా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘అప్సర’ అంటూ సాగే మోస్ట్ ఇల్యూషన్ సాంగ్‌ను విడుదల చేశారు. యువ సంగీత దర్శకుడు గ్యానీ అందించిన విభిన్నమైన బాణీ, ఆయన గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఆకట్టుకుంటున్న లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
రమేష్ కుమార్ రాసిన సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉండగా, జేడీ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్పులు పాటకు కొత్త అందాన్ని తెచ్చాయి. లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని, వారి ప్రేమ ప్రయాణాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.
హీరోయిన్‌గా శ్రియా కొంతం
విజువల్స్ పరంగానూ ఈ పాట ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త్రినాథ్ వర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిర్మల్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఆసక్తి రేకెత్తిస్తున్న తారాగణం
కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల ఈసారి గ్యాంబ్లింగ్ చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ అంశాలకు వినోదాన్ని జోడించి ఈ కథను ఎంచుకున్నారు. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఆయనతో పాటు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు వంటి అనుభవజ్ఞులైన నటులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు.
డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు
పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న పాకెట్ రాకెట్స్ చిత్రానికి సాంకేతిక నిపుణుల బృందం చక్కటి సహకారం అందించింది. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. విష్ణు వర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, రాజేష్ లంకా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
అప్సర పాటకు స్పందన
రమేష్ మన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ‘అప్సర’ పాటకు వస్తున్న స్పందనతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ‘పాకెట్ రాకెట్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

E-Paper
