Niharika NM On Quitting Content Creation: డిజిటల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) ఇప్పుడు వెండితెరపై వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. దక్షిణాది సినిమాల ద్వారా నటిగా మారిన ఈ ఇంటర్నెట్ స్టార్, త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
ప్యారడైజ్ విలన్‌తో

నాని ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయల్‌తో కలిసి నిహారిక నటించిన హిందీ చిత్రం 'భాయ్ తేరా స్టార్ హై' (Bhai Tera Star Hai) జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల తమిళంలో ఆమె నటించిన 'ఇదయమ్ మురళి' చిత్రం మంచి విజయాన్ని సాధించగా, వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్న నిహారిక తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
భారీ సంపాదనను పక్కనపెట్టి నటన వైపు..
సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, నెలకు లక్షల్లో వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకుని నటన వైపు రావడం సామాన్యమైన విషయం కాదు. దాదాపు మూడేళ్ల కిందటే కంటెంట్ క్రియేషన్‌ను ఆపేసినట్లు నిహారిక ఎన్ఎమ్ చెప్పారు.
"ఇంటర్నెట్‌లో అప్పటికే విజయం సాధించి, మంచి రాబడినిచ్చే కెరీర్‌ను వదిలేసి కొత్త దారి ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే నాలోని నటిని పెంపొందించుకోవడానికి, పెద్ద కథల్లో భాగం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను" అని నిహారిక పేర్కొన్నారు.
అమెరికాలోని చాప్‌మన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎమ్‌ఎఫ్‌ఏ పూర్తి చేసిన నిహారిక, చిన్నప్పటి నుంచీ నాటక రంగంలో అనుభవం ఉన్న ఆర్టిస్ట్. సోషల్ మీడియాలో చేసిన ఫన్నీ వీడియోలు కూడా ఒక రకమైన కథా చెప్పడమేనని నిహారిక అభిప్రాయపడ్డారు.
'భాయ్ తేరా స్టార్ హై'తో బాలీవుడ్ ఎంట్రీ
దర్శకుడు వివేక్ అగర్వాల్ తెరకెక్కించిన 'భాయ్ తేరా స్టార్ హై' చిత్రంలో నిహారిక 'రష్మి' అనే ఉత్సాహవంతమైన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో డ్యాన్సర్, నటుడు రాఘవ్ జుయల్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ఆమె తెలిపారు.
{{/usCountry}}దర్శకుడు వివేక్ అగర్వాల్ తెరకెక్కించిన 'భాయ్ తేరా స్టార్ హై' చిత్రంలో నిహారిక 'రష్మి' అనే ఉత్సాహవంతమైన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో డ్యాన్సర్, నటుడు రాఘవ్ జుయల్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ఆమె తెలిపారు.
{{/usCountry}}"సెట్‌లో రాఘవ్‌తో ఒక సీన్ కోసం ఇద్దరం కలిసి స్పాట్‌లో ఇంప్రవైజ్ చేశాం. అది స్క్రీన్‌పై చాలా బాగా వచ్చింది. ఒక మంచి కో-యాక్టర్ తోడుంటే సీన్ ఏ స్థాయికి వెళ్తుందో అప్పుడే నాకు అర్థమైంది" అని నిహారిక ఎన్ఎమ్ గుర్తుచేసుకున్నారు.
వర్ణవివక్ష దాటుకుని వచ్చిన గుర్తింపు
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ సొంత కష్టంతో పైకి వచ్చినవారేనని, ఆ తపన సినిమాలో ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో ముదురు రంగు (Dusky) ఉన్న మహిళలకు ప్రధాన పాత్రలు లభించడం కష్టంగా ఉండేది అని ఆ పాత రోజులను నిహారిక గుర్తు చేసుకున్నారు.
"చిన్నప్పుడు మహేశ్ బాబు సినిమాలు చూస్తూ నేనూ అలాంటి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. కానీ నా రంగు, రూపాన్ని బట్టి నాలాంటి వాళ్లు లీడ్ రోల్స్ చేయలేరని అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రకాల రూపాలు, రంగులు ఉన్న మహిళలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మార్పు రావడం నిజంగా సంతోషకరం" అని నిహారిక ఆనందం వ్యక్తం చేశారు.
డిజిటల్ క్రియేటర్ నుంచి హీరోయిన్‌గా
హోమ్‌లీ లుక్‌తో పక్కింటి అమ్మాయిలా కనిపించడం వల్ల దక్షిణాది ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని నిహారిక చెప్పారు. కామెడీ జోనర్ తనకెంతో ఇష్టమని, రాబోయే రోజుల్లో తమిళంలో కొన్ని డార్క్ థ్రిల్లర్ ప్రాజెక్టులలో విలక్షణమైన పాత్రలు చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. డిజిటల్ క్రియేటర్ నుంచి వెండితెర హీరోయిన్‌గా మారే క్రమంలో నిహారిక చూపిస్తున్న చొరవ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.