Nikhil Siddhartha Swayambhu 2500 VFX Shots: 'కార్తికేయ 2' విజయంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఇప్పుడు సరికొత్త చారిత్రక సాహసానికి సిద్ధమవుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'.
రిలీజ్‌కు రెడీగా స్వయంభు

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. స్వయంభు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు శరవేగంగా సన్నాహాలు చేసుకుంటోంది.
175 రోజుల ప్రయాణం.. 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్!
స్వయంభు సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో చాటిచెప్పేలా మేకర్స్ ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఏకంగా 175 రోజుల పాటు ఈ చిత్రం కోసం విరామం లేకుండా చిత్రీకరణ సాగించారు. వెండితెరపై అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించే క్రమంలో 2,500కు పైగా వీఎఫ్‌ఎక్స్ (VFX) షాట్స్‌ను ఉపయోగిస్తున్నారు.
యుద్ధవీరుడిగా నిఖిల్ సిద్ధార్థ్
తాజాగా విడుదల చేసిన స్వయంభు బిహైండ్ ది సీన్స్ (BTS) చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నిఖిల్ యుద్దవీరుడి రూపంలో (ఇంటెన్స్ వారియర్ అవతార్) యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నారు.
దిగ్గజ టెక్నీషియన్లతో విజువల్ ట్రీట్
"అద్భుతమైన ఫైనల్ అవుట్‌పుట్ కోసం కొంత సమయం తీసుకున్నాం, ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి" అని చిత్ర బృందం నమ్మకంతో వెల్లడించింది. ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక బృందం సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
రవి బస్రూర్ సంగీతం
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
సెట్స్‌పై చారిత్రక ప్రపంచం
{{/usCountry}}'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
సెట్స్‌పై చారిత్రక ప్రపంచం
{{/usCountry}}ఎం. ప్రభాహరన్, రవీందర్ నేతృత్వంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆనాటి చారిత్రక ప్రపంచాన్ని సెట్స్‌పై పునర్నిర్మించింది. నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా అలరించనున్నారు.
త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
ఇప్పటికే విడుదలైన స్వయంభు టీజర్, ‘రా రా ధీవర’ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్రకున్న లార్జర్ దాన్ లైఫ్ స్వభావాన్ని ఈ పాట చక్కగా ఆవిష్కరించింది. ప్రమోషన్ల వేగాన్ని పెంచి త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1: స్వయంభు సినిమాలో హీరో ఎవరు?
A1: ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా యుద్దవీరుడి పాత్రలో నటిస్తున్నారు.
Q2: స్వయంభు చిత్ర దర్శకుడు ఎవరు?
A2: ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.
Q3: ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రాముఖ్యత ఏంటి?
A3: సినిమాలో ప్రేక్షకులకు బ్రహ్మాండమైన విజువల్ అనుభూతిని అందించడానికి 2,500కు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తున్నారు.
Q4: స్వయంభు చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఎవరు?
A4: 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.