నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ దగ్గరికి వచ్చి ఏం యాక్టింగ్ చేశావ్ బావ అని పొగుడుతుంది. నువ్ మాత్రం నిజంగానే అన్నావ్‌గా. మనసులో ఇంత పెట్టుకున్నావా. ద్వేషంతో తాళి కట్టానని అన్నావ్ అని విరాట్ అలుగుతాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తొక్క తీసేదాన్ని తొక్కలో గొడవలు ఎందుకు పెట్టుకుంటానని చంద్రకళ అంటుంది.
శాలిని నమ్మే వ్యక్తి కాదు

అంతా ఓకేకానీ శాలిని అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదు అని విరాట్ అంటాడు. నువ్వు చేసిన ఓవరాక్షన్‌కు నమ్మకపోవచ్చు. ఇంకోసారి ట్రై చేయాలి. క్రాంతి మాత్రం కచ్చితంగా నమ్మే ఉంటాడు. కానీ, అది మార్చడానికి శాలిని ట్రై చేస్తుందని చంద్రకళ అంటుంది. తర్వాత క్రాంతి వచ్చినట్లు చంద్రకళ అంటే విరాట్ మళ్లీ నటిస్తాడు. అదంతా వట్టిదే అని చెప్పడంతో చంద్రకళను లాగుతాడు విరాట్.
ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. మరోవైపు కామాక్షి ఏడుస్తుంది. టిఫిన్ తినమని శ్రుతి వచ్చి అంటుంది. నిన్ను మోసం చేయడం కాదు నేనే మోసపోయాను అని ఏడుస్తూ అంటుంది శ్రుతి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా విరాట్, చంద్రల మధ్య గొడవ అవుతుందని కామాక్షి అంటే.. అయ్యో అమ్మా వాళ్లకు గొడవ అయిందే నా పెళ్లితో అని శ్రుతి అంటుంది.
శ్రుతిని ఓదారుస్తుంది కామాక్షి. ఆ తల్లికొడుకులక బుద్ధి చెప్పాలని అంటుంది కామాక్షి. మరోవైపు రఘురాంకు గుద్దుకుంటాడు జాలిరాజ్. నువ్వు శ్రుతి బాయ్‌ఫ్రెండ్‌వి కదా అని రాజ్‌ను ఎడా పెడా కొడతాడు రఘురాం. నేను శ్రుతిని పెళ్లి చేసుకున్నా సర్ అని రాజ్ అంటే.. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని ఇంకా గట్టిగా కొడతాడు. ఇంతలో శ్యామల వచ్చి జరిగింది చెబుతుంది.
పెళ్లి కానీ అమ్మాయిలు
శ్యామల పెళ్లిపై పంచ్ వేసి రఘురాం వెళ్లిపోతాడు. ఇంతలో జాలి రాజ్ ఫ్రెండ్ బాబ్జీ చేపలు అమ్ముకునేందుకు వస్తాడు. ఆ ఇంటికి అల్లుడు అని చెబుతాడు రాజ్. ఇంకెవరైన పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా. నేను కూడా సెట్ చేసుకుంటా అని బాబ్జీ అంటే శ్యామలను చూపిస్తాడు రాజ్. సెటైర్లు వేయకన్నా అని బాబ్జీ వెళ్లిపోతాడు. అదంతా చూసిన శ్యామల నా గురించి ఏం చెప్పావురా అని రాజ్‌ను అడుగుతుంది.
{{/usCountry}}శ్యామల పెళ్లిపై పంచ్ వేసి రఘురాం వెళ్లిపోతాడు. ఇంతలో జాలి రాజ్ ఫ్రెండ్ బాబ్జీ చేపలు అమ్ముకునేందుకు వస్తాడు. ఆ ఇంటికి అల్లుడు అని చెబుతాడు రాజ్. ఇంకెవరైన పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా. నేను కూడా సెట్ చేసుకుంటా అని బాబ్జీ అంటే శ్యామలను చూపిస్తాడు రాజ్. సెటైర్లు వేయకన్నా అని బాబ్జీ వెళ్లిపోతాడు. అదంతా చూసిన శ్యామల నా గురించి ఏం చెప్పావురా అని రాజ్‌ను అడుగుతుంది.
{{/usCountry}}దాంతో శ్యామల గురించి గొప్పగా పొగుడుతాడు రాజ్. విరాట్ చేసినదాని గురించి శాలిని ఆలోచిస్తుంటే క్రాంతి వచ్చి వెనుక నుంచి వాటేసుకుంటాడు. వదిన విషయంలో అన్నయ్య మారాడు. ప్రశాంతంగా ఉందంటాడు. మనసులో ఉన్నది ఒక్కొక్కటిగా ఎలా బయటపడుతుందో చూశావుగా. అన్ని బయటపడే టైమ్ వస్తుందని క్రాంతి అంటాడు.
నాకు మాత్రం మీ అన్నయ్య మీద అనుమానంగా ఉంది. కావాలని డ్రామా చేస్తూ నిన్ను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారనిపిస్తుంది అని శాలిని అంటుంది. అన్నయ్య ఏదైనా డైరెక్ట్ చేస్తాడు గానీ చాటు మాటు వ్యవహారాలు చేయడు. కావాలంటే అదంతా నేను తెలుసుకుంటాను అని క్రాంతి అంటాడు. మరోవైపు విరాట్ అలిగి ఉంటే ముద్దొస్తున్నారని చంద్ర అంటుంది.
క్రాంతి ముందు రొమాంటిక్ డ్రామా
అయితే ముద్దు పెట్టు అని విరాట్ అంటాడు. విరాట్‌కు చంద్రకళ ముద్దుపెట్టబోతూ క్రాంతిని చూసి ఆగి అరుస్తుంది. క్రాంతి వచ్చినట్లు సైగ చేస్తుంది. దాంతో విరాట్ గొడవ పడినట్లు నటిస్తాడు. ఇద్దరు వాదించుకుంటారు. తర్వాత కాసేపటికి రొమాంటిక్‌గా వాదించుకుంటారు. తలుపులు మూస్తాను ఏం చేస్తావో చూస్తాను అని చంద్రకళ వచ్చి మూస్తుంది.
దాంతో క్రాంతి వెళ్లిపోతాడు. ఏం చేస్తావో చేయి అని చంద్రకళ వెనక్కి తిరిగేసరికి విరాట్ ఉంటాడు. క్రాంతి వెళ్లిపోయాడని చెబుతుంది. మరోవైపు శ్రుతితో ఫస్ట్ నైట్ జరిపించాలని జలరాజ్ తల్లి అంటుంది. ఎలాంటివారో తెలియనివాళ్లతో ఫస్ట్ నైట్ ఎలా జరిపిస్తామని క్రాంతి అంటాడు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.