...
...
Next Story

నిన్ను కోరి ఫిబ్రవరి 16 ఎపిసోడ్: శాలినిని న‌మ్మ‌ని క్రాంతి.. తాచుపామువి అంటూ ఫైర్‌.. చంద్ర‌క‌ళ‌ను క్ష‌మించ‌మ‌న్న శ్యామల

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ లో శోభనం కోసం విరాట్ ఆరాటపడుతుంటాడు. క్షమించమని చంద్రకళను శ్యామల కోరుతుంది. చంద్ర ఎమోషనల్ అవుతుంది. శాలిని మార్పును క్రాంతి నమ్మడు. తాచుపామువి అంటూ ఫైర్ అవుతాడు. ఇంట్లో వాలెంటైన్స్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు.

Published on: Feb 16, 2026, 07:53:11 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ లో.. చక్కెర తిన్నప్పటి కంటే పాయసం తిన్నప్పుడు కలిగే ఫీల్ వేరు కదా. మరి చక్కెర తింటానంటావేంటీ? ఈ ఒక రోజు ఆగు. రేపు టైమ్ తీసుకుని ప్రిపేర్ అవుదామని శోభనం గురించి విరాట్ తో చంద్రకళ చెప్తుంది.

క్షమించమన్న శ్యామల

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్రకళను క్షమించమని శ్యామల కోరుతుంది. ఎదుటివాళ్లు తప్పు చేసినప్పుడు నిలదీయడమే కాదు. మన తప్పు ఉందని తెలిసినప్పుడు క్షమాపణ ఆడగడమే పెద్దరికం అనిపించుకుంటుంది. నువ్వు ఆ వరదరాజులు కూతురు అని తెలిసిన తర్వాత ఈ ఇంటి నాశనం కోరి వచ్చావని అనుకున్నా. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని శాలిని నిందలన్నీ నీపై వేసింది. నేను ఎన్నో అనరాని మాటలు అన్నాను. అవి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని శ్యామల ఎమోషనల్ అవుతుంది.

ప్రేమ పంచారు

పిన్ని అని శ్యామలను చంద్రకళ హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు మీ ప్రేమ గుర్తుంటుంది కానీ మీరు అన్న మాటలు కాదని చాలాసార్లు చెప్పా. మీ మనసేంటో నాకు తెలుసు పిన్ని. అమ్మలా మారి ప్రేమ పంచారని చంద్రకళ చెప్తుంది. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది నీకు. నువ్వు ఇంటికి కోడలుగా రావడం ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం అని శ్యామల అంటుంది.

తాచుపామువి

శాలిని కాఫీ తీసుకొచ్చి ఇస్తే క్రాంతి ఫైర్ అవుతాడు. ఇందులో ఏం కలిపావు? ఇప్పుడు తెగించవని ఎవరికి తెలుసు? నీ బాధ నిజమని నమ్ముతావని అనుకున్నావా? నువ్వు ఒళ్లంతా విషం నింపుకున్న తాచుపామువి. నీలాంటి దాన్ని ప్రేమించి నా జీవితంలోకి తెచ్చి పెట్టుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలని క్రాంతి కోప్పడతాడు. ఇకపై తప్పు చేయను. ఒక్కసారి క్షమించమని శాలిని అడుగుతుంది.

మరోవైపు ప్రేయసికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని జగదీశ్వరికి రఘురాం గులాబీలు ఇస్తాడు. ప్రేమకు వయసేంటీ? ఐ లవ్యూ జగదీశ్వరి. కాలేజీ రోజుల్లో నువ్వు లంగావోణీ వేసుకుని పట్టీలు వేసుకుని వస్తుంటే అని రఘురాం చెప్తాడు. ఇంట్లోని మూడు జంటలు కలిసి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ కటింగ్ ప్లాన్ చేశానని రఘురాం అంటాడు.

జగదీశ్వరి చేతికి చంద్ర తాళం చెవి ఇస్తుంది. ఇన్ని రోజులు టెన్షన్ లో ఉన్నారని నేను చూసుకున్నా. ఇప్పుడు మీరు చూసుకోండని చంద్ర అంటుంది. ఇంటి పెద్ద కోడలిగా ఆ బాధ్యతలు నీవేనని జగదీశ్వరి చెప్తుంది. శాలిని కూడా అదే కరెక్ట్ అని అంటుంది. వాలంటైన్స్ సెలబ్రేషన్స్ కు శ్యామల, కామాక్షి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe