నిన్ను కోరి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: శాలిని పాపం పండింది.. తండ్రిని చంపాలనుకుందని తెలిసి క్రాంతి షాక్.. సూసైడ్ అటెంప్ట్

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో శాలిని గురించి నిజాలన్నీ క్రాంతికి తెలుస్తాయి. ఆ విషయం శాలినికి డాక్టర్ కాల్ చేసి చెప్తాడు. విరాట్, చంద్ర కంగారు పడతారు. క్రాంతిని వెతకడానికి వెళ్తారు. క్రాంతి సూసైడ్ చేసుకుందామని ఓ బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. 

Published on: Feb 12, 2026, 07:49:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో.. డాక్టర్ దగ్గరకు వెళ్లి శాలిని కొన్ని ఇన్సిడెంట్లు మర్చిపోవడం కోసం ట్యాబ్లెట్స్ వాడిందా? నిజం చెప్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? అని క్రాంతి అడుగుతాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిజాలు చెప్పిన డాక్టర్

శాలిని అడిగిందని ఆ ట్యాబ్లెట్స్ తెప్పించా. మీ నాన్న గతం మర్చిపోవాలని ఎవరికీ తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆయన కోలుకుంటే చంద్రకళ నిర్దోషి అని చెప్తారని, అప్పుడు చంద్ర ఇంట్లోనే ఉండి తన పగ నెరవేర్చుకోకుండా అడ్డుపడుతుందని అలా చేసింది. మీ నాన్నలో కదలిక వచ్చినప్పుడు ఆయనను తల మీద కొట్టింది శాలినినే. ఆయనకు ట్రీట్మెంట్ అందకుండా చూసిందని డాక్టర్ చెప్పడంతో క్రాంతి షాక్ అవుతాడు.

క్రాంతి బాధ

రఘురాం కోలుకుంటే శాలిని తప్పులు బయటపడతాయని మెడిసిన్ మార్చిందని డాక్టర్ చెప్తాడు. శాలిని ఇన్ని తప్పులు చేసిందా? తన తప్పులకు చంద్ర వదినను నిందించానా? అని క్రాంతి బాధపడతాడు. మరోవైపు విరాట్, చంద్ర ఇంటికి వస్తారు. కానీ ఇంకా క్రాంతి ఇంటికి రాకపోవడంతో విరాట్, చంద్ర కంగారు పడతారు. జరిగినవి అన్ని తలుచుకుని క్రాంతి నడుచుకుంటూ వెళ్తాడు.

శాలిని టెన్షన్

అప్పుడే డాక్టర్ శాలినికి ఫోన్ చేసి క్రాంతికి నిజం చెప్పేశానని చెప్తాడు. దీంతో శాలినికి చెమటలు పడతాయి. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు నన్ను కాపాడేది చంద్ర, బావ మాత్రమే అని వెళ్లి విరాట్ కాళ్ల మీద పడుతుంది శాలిని. నాది రియలైజేషన్. నా వల్ల మీరు ఎన్ని నిందలు మోశారో తెలుసు. క్రాంతి దగ్గర మంచితనం నటిస్తూ వచ్చా. ఇప్పుడు క్రాంతికి నిజం తెలిసిందని శాలిని డ్రామా ఆడుతుంది.

విరాట్ కంగారు

క్రాంతికి నిజం తెలిసేలా చేసిందే మేము అని విరాట్ చెప్పడంతో శాలిని షాక్ అవుతుంది. అయ్యో క్రాంతికి అబార్షన్ విషయమే కాదు ఇంకా చాలా విషయాలు తెలిశాయి. పగ తీర్చుకోవడం కోసం ప్రయత్నించడం, చంద్ర అడ్డు తొలగించుకోవాలనుకోవడం, మామయ్యను తల మీద కొట్టడం ఇలా అన్ని విషయాలు క్రాంతికి తెలిశాయని శాలిని చెప్తుంది.

సూసైడ్ అటెంప్ట్

క్రాంతికి ఏమైందో అని చంద్ర, విరాట్ టెన్షన్ పడతారు. క్రాంతిని వెతికేందుకు వీళ్లు వెళ్తారు. అప్పుడే శ్రుతి వచ్చి చంద్రతో వెటకారంగా మాట్లాడుతుంది. అర్జెంట్ పని ఉందని క్రాంతి కోసం వెతికేందుకు చంద్ర, విరాట్ వెళ్తారు. చంద్ర వీడియో కాల్ ను క్రాంతి లిఫ్ట్ చేస్తాడు. నా కోసం రావొద్దు వదిన, నేను బతికి ఉండటమే వేస్ట్. నన్ను మర్చిపోండి అని కాల్ కట్ చేస్తాడు క్రాంతి.

అక్కడే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోదామని క్రాంతి అనుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More