నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫోన్ చేసిన వెంటనే ఫైల్ పంపించకుండా మమ్మల్ని అంటే ఎలా అని క్రాంతిపైనే రివర్స్ అవుతుంది మంత్రి పీఏ. అదే విషయం శాలినికి చెబుతాడు క్రాంతి. అన్నయ్యకు పీఏ కాల్ చేసి ఫైల్ పంపించమన్నారట. కానీ, అన్నయ్య నాకు చెప్పనేలేదు అని క్రాంతి అంటాడు.
అన్నయ్య మీద డిపెండ్ కావొద్దు

మన పని మీద వేరేవాళ్లకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటది. అందుకే మీ అన్నయ్య మీద డిపెండ్ కావొద్దనంటున్నా అని ఎక్కిస్తుంది శాలిని. ఇంత పెద్ద విషయం అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదో ఇప్పుడే అడుగుతా అని క్రాంతి అంటాడు. ఈ మంట చాలు సంతోషం ఆవిరి అవ్వడానికి అని శాలిని అనుకుంటుంది.
విరాట్‌ను అంతా పొగుడుతారు. క్రాంతి కూడా కంగ్రాట్స్ చెబుతాడు. దాంతో శాలిని షాక్ అవుతుంది. సొంత తమ్ముడికి ఇచ్చిన మాటను ఈజీగా మర్చిపోతావ్ అని క్రాంతి అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఆ బాంబే కాంట్రాక్ట్ మనకు రాదని క్రాంతి అంటాడు. ఏమైందని అడిగితే టెండర్ వేయాలిగా. దానికి ల్యాండ్, అందుకు పర్మిషన్ ఉండాలిగా అని క్రాంతి అంటాడు.
పర్మిషన్‌కు ఫైల్ పంపించమని ఆయన చెప్పారుగా అని చంద్రకళ అంటుంది. ఎప్పుడు అని క్రాంతి అంటే.. కలగని ఉంటారని శాలిని అంటుంది. అదేంటీ శాలిని. నిన్న రాత్రే నీకు చెప్పమని చెప్పానుగా అని విరాట్ అంటాడు. నాకు ఎప్పుడు చెప్పారు. నన్ను అసలు కలవనలేదుగా అని శాలిని అంటుంది.
నా మీద నిందలు వేయకండి
నిన్న రాత్రి క్రాంతి గురించి అడిగితే 2 గంటల దాకా రాడని అన్నావ్. నీకు చెప్పమని చెప్పానుగా అని విరాట్ అంటాడు. మీరు అనవసరంగా నా మీద నిందలు వేయకండని శాలిని అంటుంది. అర్థమైంది శాలిని మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావ్ అనుకున్న విరాట్ క్రాంతికి సింపుల్‌గా సారీ చెబుతాడు. నేనే మర్చిపోయి ఉంటాను అని అంటాడు.
{{/usCountry}}నిన్న రాత్రి క్రాంతి గురించి అడిగితే 2 గంటల దాకా రాడని అన్నావ్. నీకు చెప్పమని చెప్పానుగా అని విరాట్ అంటాడు. మీరు అనవసరంగా నా మీద నిందలు వేయకండని శాలిని అంటుంది. అర్థమైంది శాలిని మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావ్ అనుకున్న విరాట్ క్రాంతికి సింపుల్‌గా సారీ చెబుతాడు. నేనే మర్చిపోయి ఉంటాను అని అంటాడు.
{{/usCountry}}దాంతో శాలిని షాక్ అవుతుంది. అలా శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ల్యాండ్ మినిస్టర్ బంధువుకు వెళ్లిపోయిందట. అన్నయ్యల నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాల్సింది అని వెళ్లిపోతాడు క్రాంతి. విరాట్ ఫీల్ అవుతాడు. అంతా వెళ్లిపోతారు. శాలిని ప్లాన్‌ను భలే తిప్పికొట్టావ్ బావ అని చంద్రకళ మెచ్చుకుంటుంది.
మరోవైపు పది గంటలకు నిద్ర లేచిన శ్రుతి ఇంట్లో ఎవరు లేరని చూస్తుంది. బయట నుంచి తాళం వేసి ఉంటుంది. శ్రుతిని ఇంట్లో బంధించి రాజ్, తన తల్లి వెళ్లిపోతారు. కానీ, నేను వదులుతానా అనుకున్న శ్రుతి రాజ్‌కు కాల్ చేస్తుంది. రాజ్ భయపడితే తల్లి లిఫ్ట్ చేస్తుంది. గళ్లా పెట్టే మాది వంట నీది. ఉంటే ఉండు లేకుంటే వెళ్లు అని అత్త అంటుంది.
బ్యాడ్ టైమ్ స్టార్ట్
రాజ్ ప్రేమగా మాట్లాడి కూల్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని శ్రుతి అనుకుంటాడు. మరోవైపు విరాట్, క్రాంతి విషయం గురించి చర్చించుకుంటారు శ్యామల, కామాక్షి. శాలిని కావాలనే క్రాంతికి చెప్పట్లేదనుకుంటా అని గతంలో చేసింది శ్యామలకు చెబుతుంది కామాక్షి. ఆ మాటలు శాలిని వింటుంది.
శ్యామల నమ్మదు. ఎక్కడికో వెళ్లిపోతావ్ అని వెళ్లిపోతుంది. కామాక్షిని వచ్చి శాలిని నిలదీస్తుంది. పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నావా. నా గురించి ఏమనిపించిన మనసులోనే అనుకో. లేకుంటే సిమెంట్ లారీ గుర్తుంది అనుకుంటా అని కామాక్షికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శాలిని.
మరోవైపు చంద్రకళతో శాలిని గురించి విరాట్ మాట్లాడుతాడు. గొడవ జరిగితే తనే గెలిచినట్లు అవుతుంది. శాలిని ఇలా చేస్తుందనుకోలేదు అని విరాట్ అంటాడు. తర్వాత హాస్పిటల్‌లో తేజు కిందపడితే శాలిని పట్టుకుంటుంది. అమ్మనాన్న గురించి శాలిని అడుగుతుంది.
శాలినికి తెలిసిన నిజం
దాంతో చంద్రకళను, అర్జున్‌ను తన అమ్మనాన్న అని తేజు చెబుతుంది. అది చూసి శాలిని షాక్ అవుతుంది. తేజు అమ్మ నాన్న చంద్రకళ, అర్జున్ ఏంటని అవాక్కవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.