నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో రఘురాం, ప్రకాష్ చెస్ ఆడతారు. చెస్ ఆడటం రాకపోవడంతో మాటలతో మ్యానేజ్ చేద్దామని ప్రకాష్ అనుకుంటాడు. ఇంటి దొంగను పట్టడం అన్నింటికంటే కష్టమైన పని అని ప్రకాష్ అంటాడు. వాళ్లే డేంజర్ అని క్రాంతి, అలాంటి వాళ్లను నామరూపాలు లేకుండా చేయాలని విరాట్ చెప్తారు.
అన్నీ గుర్తొస్తాయి

మనిషి మర్చిపోవడం జరగదు. ప్రతి మెమోరీ బ్రైన్ లో ఉంటుందని ప్రకాష్ అంటాడు. నాకు అన్ని గుర్తొస్తాయి. కానీ చెప్పకుండా ఏదో ఆపుతుంది. కేవలం నన్ను కొట్టిన వాళ్లు గుర్తుకు రాకుండా ఉండటం ఏంటీ? అని రఘురాం అంటాడు. వీళ్లను డైవర్ట్ చేయాలని చెస్ బోర్డుపై మంచినీళ్లు పడేలా చేస్తుంది శాలిని.
చంద్ర, విరాట్ రొమాన్స్
ఇక గదిలోకి వెళ్లిన చంద్రకళను వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు విరాట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం చేస్తుంది డ్రామానే అయినా నాన్నలో ఉత్సాహం కనిపిస్తోందని విరాట్ అంటాడు. దీనికి కారణం నువ్వు, క్రాంతి గొడవ పడకుండా ఉండటమే. మనం రివర్స్ డ్రామా మొదలుపెట్టినప్పటి నుంచి అంతా సర్దుకుందని చంద్రకళ అంటుంది.
శాలినికి షాక్
ఇంట్లో శాలిని లాంటి నెగెటివ్ పర్సన్ ఉంటే గొడవలు అవుతాయి. అదే నీలాంటి పాజిటివ్ పర్సన్ ఉంటే ప్రశాంతంగా ఉంటుందని విరాట్ చెప్తాడు. శాలిని గేమ్స్ అన్నింటికీ చెక్ పెట్టడం ఖాయమని చంద్ర చెప్తుంది. మరోవైపు శాలిని నువ్వు డాక్టర్ పై డౌట్ పడ్డావు కదా. కానీ తన ట్రీట్మెంట్ తో నాన్నలో మార్పు తీసుకొచ్చాడు. ఒక్క రోజులో ఇంత ఇప్రూమెంట్ ఉంటే, మూడు రోజుల్లో మొత్తం గుర్తొస్తుంది. అప్పుడు నేరం చేసింది ఎవరనేది తెలుస్తుందని క్రాంతి అనడంతో శాలిని షాక్ అవుతుంది.
ప్రకాష్ కోసం జున్ను
మీరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మామయ్యలో మార్పు వచ్చింది. శాలిని అలా కాకుండా చేస్తుంది. మిమ్మల్ని పంపించాలని అనుకుంటుందని అర్జున్ కు చంద్ర చెప్తుంది. శాలినిని నేను చూసుకుంటానని అర్జున్ అంటాడు. అప్పుడే శ్యామల వస్తుంది. దీంతో విరాట్, చంద్ర కోప్పడుతూ డ్రామా ఆడతారు. ప్రకాష్ కోసం శ్యామల జున్ను తీసుకొస్తుంది. నాకు జున్ను ఇష్టమని మీకు ఎలా తెలుసు? అంటూ లాగించేస్తాడు ప్రకాష్.
డాక్టర్ ప్లాన్
{{/usCountry}}మీరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మామయ్యలో మార్పు వచ్చింది. శాలిని అలా కాకుండా చేస్తుంది. మిమ్మల్ని పంపించాలని అనుకుంటుందని అర్జున్ కు చంద్ర చెప్తుంది. శాలినిని నేను చూసుకుంటానని అర్జున్ అంటాడు. అప్పుడే శ్యామల వస్తుంది. దీంతో విరాట్, చంద్ర కోప్పడుతూ డ్రామా ఆడతారు. ప్రకాష్ కోసం శ్యామల జున్ను తీసుకొస్తుంది. నాకు జున్ను ఇష్టమని మీకు ఎలా తెలుసు? అంటూ లాగించేస్తాడు ప్రకాష్.
డాక్టర్ ప్లాన్
{{/usCountry}}డాక్టర్ ను పంపించేయాలని శాలిని ఆలోచిస్తుంది. అప్పుడే అందరూ వస్తారు. రఘురాంను లాన్ లో వెయిట్ చేయమంటాడు ప్రకాష్. సంఘటనకు ముందు, తర్వాత జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయని జగదీశ్వరితో ప్రకాష్ అంటాడు. ఆయన్ని ఆ టైమ్ జోన్ లోకి తీసుకెళ్లాలని ప్రకాష్ అంటాడు. అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఆయనపై దాడి చేసింది ఎవరు? అనేది మర్చిపోయారని శ్యామల అంటుంది.
ముందు చిన్న విషయాలు గుర్తు చేద్దామని ప్రకాష్ అంటాడు. విరాట్ చిన్నప్పుడు జ్వరంతో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం. ఆ విషయం ఆయనకు గుర్తు లేదని జగదీశ్వరి అంటుంది. ఆ విషయం గుర్తుకు వచ్చేలా చేద్దామని ప్రకాష్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.