నిన్ను కోరి జనవరి 16 ఎపిసోడ్: దోసకాయ జ్యూస్‌తో శాలిని ప్లాన్- డాక్టర్‌కు ఫుడ్ పాయిజన్- శాలినిపై అందరికీ డౌట్
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ లో శాలినిని ట్రాప్ చేయాలని అర్జున్, విరాట్, చంద్ర ప్లాన్ వేస్తారు. మరోవైపు డాక్టర్ ను పంపించాలని శాలిని దోసకాయ జ్యూస్ తో కుట్ర పన్నుతుంది. అది తాగిన అర్జున్ కు ఫుడ్ పాయిజన్ అవుతుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ లో దోసకాయ తింటే నాకు ప్రాబ్లెం అవుతుంది. చెమటలు పట్టేస్తాయి. రాషెస్ వస్తాయి. బ్రీత్ అందదు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతా. అందుకే దోసకాయ జోలికి వెళ్లను. శ్యామల గారు ముందే చెప్పారు కాబట్టి సరిపోయింది. ముందు శాలినిని ట్రాప్ చేయాలని విరాట్, చంద్రతో అర్జున్ చెప్తాడు.

శాలిని ప్లాన్
శాలినిని నమ్మించాలంటే ముందు ఆమె దారిలోకి వెళ్లాలి. ఆమె మనిషి అని మీపై నమ్మకం కలగాలి. అప్పుడే నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుస్తుందని చంద్రకళ అంటుంది. నేను వెంటనే యాక్షన్ లోకి దిగిపోతానని అర్జున్ అంటాడు. ఫుడ్ పాయిజన్ జరిగితే ఆ డాక్టర్ పేషెంట్ లా తయారవుతాడు. దోసకాయ జ్యూస్ తాగితే డాక్టర్ కు ఎలర్జీ వస్తుందని శాలిని జ్యూస్ రెడీ చేస్తుంది.
శ్యామలను పంపించి
అప్పుడే శ్యామల వచ్చి డాక్టర్ కోసం నువ్వెందుకు చేస్తున్నావ్? ఆయన కోసం ఏం చేయాలన్నా నేనే చేస్తానని అంటుంది. ఎందుకు డాక్టర్ మీద అంత కాన్సర్న్ చూపిస్తున్నారు? మీ ఫస్ట్ లవ్ మళ్లీ చిగురించిందా? అని డైవర్ట్ చేసి దోసకాయ ముక్కలను గమనించకుండా చేస్తుంది శాలిని. మీ ముఖం వాడిపోయింది. రెస్ట్ తీసుకుంటే మళ్లీ గ్లో వస్తుందని శ్యామలను పంపిస్తుంది శాలిని.
జ్యూస్ తాగిన అర్జున్
జ్యూస్ రెడీ చేసి అర్జున్ దగ్గరకు తీసుకెళ్తుంది శాలిని. ఈ దోసకాయ జ్యూస్ తాగించి డాక్టర్ ను ట్రాక్ నుంచి తప్పిస్తానని శాలిని అనుకుంటుంది. ఇది ఆపిల్ జ్యూస్. మీరు తాగకపోతే నా హస్పండ్ నన్ను తిడతానని శాలిని అంటుంది. నా వల్ల మీరెందుకు మాటలు పడటమని జ్యూస్ తాగుతాడు అర్జున్. కళ్లు తిరగడంతో తూలుతూ రూమ్ లోకి వెళ్లి కింద పడిపోతాడు అర్జున్.
ఫుడ్ పాయిజన్
విరాట్, చంద్ర వచ్చి రూమ్ లో చూస్తారు. అప్పటికే అర్జున్ కు రాషెస్ వస్తాయి. కిందపడిపోతాడు. ఎంత లేపినా లేవడు. ఇది శాలిని ప్లాన్ అయి ఉంటుంది బావ. హాస్పిటల్ లోకి తీసుకెళ్తే ప్రకాష్ కాదు అర్జున్ అని తెలిసిపోతుందని చంద్ర అంటుంది. అప్పుడే క్రాంతి వస్తాడు. అందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఫ్యామిలీ డాక్టర్ కు క్రాంతి కాల్ చేసి రమ్మంటాడు.
డాక్టర్ పేషెంట్ అయ్యాడు. ఈయన్ని పంపించడమే బెటర్. భారంగా మారితే ఇబ్బంది పడాల్సి వస్తుందని శాలిని అంటుంది. నాన్న పూర్తిగా కోలుకోవాలంటే డాక్టర్ ఇక్కడే ఉండాలని విరాట్ అంటాడు. రఘురాం కూడా ఇదే మాట చెప్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. ఫుడ్ పాయిజన్ అయినట్లు అనిపిస్తుంది. ఇంజక్షన్ చేస్తే నార్మల్ కండీషన్ కు వస్తాడని డాక్టర్ చెప్తాడు.
శాలినిపై డౌట్
మీరెవ్వరూ వద్దు. డాక్టర్ ను నేను చూసుకుంటానని శ్యామల అంటుంది. అప్పుడే అర్జున్ లేచి కూర్చుంటాడు. సడెన్ గా కళ్లు తిరిగి పడిపోయానని అర్జున్ చెప్తాడు. ఏమైందని అడిగితే శాలిని వైపు చూస్తాడు అర్జున్. శాలిని కంగారు పడటంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


