...
...
Next Story

నిన్ను కోరి జనవరి 23 ఎపిసోడ్: తుప్పు పట్టిన శ్యామల పప్పు ప్రేమ- ప్రేమ జాంబీలా విరాట్-చంద్రకళ నడుముకు విరాట్ దిష్టి చుక్క

నిన్ను కోరి సీరియల్ జనవరి 23 ఎపిసోడ్‌లో ఏం జరిగిన మీరిద్దరు విడిపోకూడదు అని విరాట్, క్రాంతి దగ్గర మాట తీసుకుంటాడు రఘురాం. చంద్రకళ దగ్గరికి వెళ్లిన శ్యామల ఛాలెంజ్ చేస్తుంది. భోగి పండుగ రోజు చీరలో చంద్రకళ అందానికి ఫిదా అయిన విరాట్ భార్య నడుముకు దిష్టి చుక్క పెడతాడు. దాంతో చంద్ర మురిసిపోతుంది.

Published on: Jan 23, 2026, 08:39:03 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి టార్చర్ పెట్టిన ప్రేమే చూపిస్తే అని జాలిరాజ్ అంటాడు. అసలు నీకు పౌరుషం లేదా అని కోపంగా వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు రఘురాం రమ్మనడంతో క్రాంతి, విరాట్ వస్తారు. నాగున్న సమస్య కంటే అసలు సమస్య మీరిద్దరు అని రఘురాం అంటాడు.

నా కట్టే కాలేవరకు

నిన్ను కోరి సీరియల్ జనవరి 23 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 23 ఎపిసోడ్‌

శాలిని నిలదీయడం, శ్రుతి విషయంలో చంద్రను అనడం గురించి నిలదీస్తాడు రఘురాం. శాలిని, చంద్రల మధ్య ఉన్న గ్యాప్ పోగొట్టాల్సింది మీరే. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలని, నా కట్టే కాలేవరకు తోడికోడళ్ల గొడవలు ఉండకూడదురా. ఏం జరిగిన ఇద్దరం కలిసే ఉంటామని మాట ఇవ్వండిరా అని రఘురాం అంటాడు.

దాంతో విరాట్, క్రాంతి మాట ఇస్తారు. రేపే భోగి. ఈ సంక్రాంతి అదిరిపోవాలి అని రఘురాం అంటాడు. తర్వాత యూఎస్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని డాక్టర్ ప్రకాష్ వెళ్తాడు. నేను చెప్పినట్లు జాగ్రత్తగా ఉండండి అని ప్రకాష్ వెళ్లిపోతాడు. దాంతో కుమిలిపోతుంది శ్యామల. నువ్వేవరో చెప్పవే అని కామాక్షి అంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్లిన శ్యామల బీరకాయ పప్పు తీసుకొచ్చి ఇస్తుంది.

తుప్పు పట్టిన పప్పు ప్రేమ

మీరు శ్యామలను గుర్తు పట్టలేదు. మీరు చిన్నప్పుడు ఆరాధించిన భీమవరం శ్యామల తనే అని కామాక్షి చెబుతుంది. హో ఆ ప్రకాష్ అనుకుందా ఈవిడ అని మనసులో అనుకుంటాడు అర్జున్. నేను మీరనుకుంటున్నట్లు భీమవరం సరస్వతి స్కూల్‌లో చదివిన ప్రకాష్ కాదు. విజయనగరం స్కూల్‌లో చదివాను అని ప్రకాష్ చెబుతాడు.

ఒక్కసారి క్రాంతిలో అనుమానం మొదలైతే నీ పతనం స్టార్ట్ అవుతుందని చంద్ర అంటుంది. మీ భార్యాభర్తలు నాటకం ఆడి క్రాంతిని మార్చాలనుకుంటే నేను ద్వేషం పెంచుతూనే ఉంటా అని వెళ్లిపోతుంది శాలిని. వెళ్లి క్రాంతితో మాట్లాడుతుంది. నీలో ఏది దాచకుండా నాకు చెప్పు. లోలోపల బాధపడకు. ఇంకెప్పుడు ట్యాబ్లెట్స్ వాడకు అని క్రాంతి అంటాడు.

సరే అని శాలిని అంటుంది. ఈ పండుగ అయ్యేలోపు మీ అన్నదమ్ముల మధ్య మళ్లీ దూరం పెంచేస్తాను అని శాలిని అనుకుంటుంది. మరోవైపు శాలినికి ఏమాత్రం భయంలేదని చంద్ర అంటుంది. క్రాంతిలో సెన్సిటివిటీని తగ్గించాలి. శాలిని ప్రేమ, ద్వేషం నుంచి క్రాంతిని దూరం పెట్టాలి అని విరాట్ అంటాడు. తర్వాత విరాట్ రొమాంటిక్‌గా మాట్లాడుతాడు.

ప్రేమ జాంబీని

కావాలనే డైవర్ట్ చేసేలా చంద్ర మాట్లాడుతుంది. ఇలా క్యూట్‌గా తెలియనట్లు కావాలని మాట్లాడితే కొరుక్కుని తింటానని విరాట్ అంటాడు. నువ్వేమైనా జాంబీవా అని చంద్ర అంటే.. అవును ప్రేమ జాంబీని అని విరాట్ అంటాడు. విరాట్‌ను అద్దంలో మొహం చూసుకోమ్మని సెటైర్లు వేస్తుంది చంద్రకళ.

మరుసటి రోజు భోగి రోజున చీరలో చంద్ర అందానికి విరాట్ ఫిదా అవుతాడు. చంద్రకళ నడుముకు దిష్టి చుక్క పెడతాడు విరాట్. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks