...
...
Next Story

నిన్ను కోరి జనవరి 28 ఎపిసోడ్: ఆఫీస్ అని అర్జున్ ఇంటికి చంద్ర‌-తేజు ఫుల్ హ్యాపీ-బాధ‌లో విరాట్‌- అక్కడే ఉండిపోయిన చంద్ర

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో రఘురాం ఇంట్లో పూజ చేస్తారు. చంద్ర ఆఫీస్ కు వెళ్తానని చెప్పి అర్జున్ ఇంటికి వెళ్తుంది. తేజు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ విరాట్ మాత్రం బాధపడతాడు. తేజు అడగడంతో చంద్ర అక్కడే ఉండిపోతుంది.

Published on: Jan 28, 2026, 07:16:55 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో పాప బాధను చూడలేక అమ్మలా దగ్గరయ్యా. ప్లీజ్ బావ నేను వెళ్లకపోతే పాప ఆరోగ్యం పాడవుతుందని విరాట్ ను అడుగుతుంది చంద్రకళ. ఇప్పుడైతే వెళ్లు కానీ ఎప్పుడు పడితే అప్పుడు రాలేనని అర్జున్ కు చెప్పమని విరాట్ అంటాడు.

ఫ్యామిలీ పూజ

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

రఘురాం ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు రఘురాం, జగదీశ్వరి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అర్జెంట్ పని ఉంది, ఆఫీస్ కు వెళ్తాను అత్తయ్య అని చెప్తుంది చంద్రకళ. ఈ రోజు స్టాక్ వర్క్ చూసుకోవాల్సింది తానేనని చంద్ర చెప్తుంది. రఘురాం చంద్రను వెళ్లమంటాడు.

తేజు హ్యాపీ

అమ్మ కోసం తేజు వెయిట్ చేస్తుంటుంది. చంద్ర రాగానే అమ్మా అని హగ్ చేసుకుంటుంది. తేజు నీ డ్రెస్ చాలా బాగుందని చంద్ర చెప్తుంది. ఈ డ్రెస్ నువ్వే కుట్టించావు కదమ్మా అని తేజు అంటుంది. నువ్వు వేసుకుంటే ఇంకా బాగుందని కవర్ చేస్తుంది చంద్ర. ఇండియాకు వచ్చాక నువ్వు నా పక్కనే ఉంటావనుకున్నా. కానీ ఆఫీస్ కు వెళ్లిపోతున్నావ్. జాబ్ మానేసి నాన్న కంపెనీలోనే వర్క్ చేయొచ్చు కదా అని తేజు అడుగుతుంది. ఆ జాబ్ మానేయలేనని చంద్ర చెప్తుంది.

విరాట్ బాధ

తేజుతో కలిసి అర్జున్, చంద్ర కైట్ ఎగరేస్తారు. తేజు చాలా హ్యాపీగా ఉంటుంది. మరోవైపు రఘురాం ఫ్యామిలీ అంతా కలిసి తంబోలా ఆడతారు. ప్రైజ్ మనీ మరీ రూ.వెయ్యి ఏంటీ అని రాజ్ అడుగుతారు. మరి ఆస్తులు రాసి ఇవ్వమంటావా? అని శ్యామల అనగానే అందరూ నవ్వేస్తారు. చంద్ర లేకపోవడంతో విరాట్ బాధపడతాడు. ఏమైందని జగదీశ్వరి అడుగుతుంది. వాళ్లావిడ లేదు కదా అని బాధ పడుతున్నట్లు ఉన్నాడని కామాక్షి అంటుంది.

తేజుకు అన్నం తినిపిస్తుంది చంద్ర. ఆఫీస్ కు వెళ్లాలని అంటే తేజు వద్దంటుంది. అమ్మా ప్లీజ్ ఈ ఒక్క రోజు నా కోసం పర్మిషన్ అడుగు. నాన్న నువ్వు ఈ రోజు బయటకు వెళ్లి ఐస్ క్రీం తిందామని చెప్పావు కదా అని తేజు అడుగుతుంది. సరే అని చంద్ర ఉండిపోతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks