నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 29 ఎపిసోడ్ లో తేజు, అర్జున్ తో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి చంద్రకళ వెళ్తుంది. థ్యాంక్స్ అమ్మా, నువ్వు వచ్చినందుకే నాన్న ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. నాన్న నువ్వు వచ్చింది అమ్మ మీద ప్రేమతో అని తేజు అంటుంది. అప్పుడే అర్జున్, చంద్రను శాలిని చూస్తుంది. శాలినిని అర్జున్ చూస్తాడు.
చంద్ర టెన్షన్

శాలిని ముందు తేజు నన్ను అమ్మ అని పిలిచిందంటే కొంపలు అంటుకుంటాయని చంద్రకళ టెన్షన్ పడుతుంది. తేజును పక్కకు తీసుకెళ్లమని డాక్టర్ కు సైగ చేస్తాడు అర్జున్. పండగ పూట ఇంట్లో ఉండకుండా ఐస్ క్రీమ్ తింటూ ఈయనతో టైమ్ పాస్ చేస్తున్నావా? అని శాలిని అంటుంది. ఇప్పుడు ఇది ఇంట్లో చెప్పి చంద్రను బ్యాడ్ చేయాలనా నీ ప్లాన్ అని అర్జున్ అంటాడు.
శాలిని వార్నింగ్
నీ టాలెంట్ నాకెందుకు తెలియదు? మీ మామయ్యను తలమీద కొట్టిన దగ్గరి నుంచి సైక్రియార్టిస్ట్ ను కలిసిన వరకు అంతా తెలుసని అర్జున్ అంటాడు. ఇంట్లో ఏం చెప్పుకుంటావో చెప్పుకో కానీ మా బిజినెస్ డిస్కషన్స్ లో మాత్రం వేలు పెట్టకు అని చంద్ర అంటుంది. బిజినెస్ కోసం సమవుజ్జీని వెతుక్కోవాలి. ఈ చంద్రతో ఏం కాదు. మీ నోటికి తాళం వేసుకుని ఉండండని శాలిని వెళ్లిపోతుంది.
విరాట్ అబద్దం
విరాట్ టెన్షన్ చూసి చంద్ర ఇంకా రాలేదా? అని శ్యామల అడుగుతుంది. తను ఇందాకే వచ్చేసిందని విరాట్ అబద్దం చెప్తాడు. చాకు ఎక్కడుందని వెతికిన శ్యామల చంద్ర అంటూ బెడ్ రూమ్ డోర్ కొడుతుంది. ఎలా మేనేజ్ చేయాలో తెలియక విరాట్ టెన్షన్ పడతాడు. బెడ్ మీద రెండు దిండ్లు పెట్టి తలనొప్పి అని పడుకుందని విరాట్ చెప్తాడు.
శాలిని ప్లాన్
కిచెన్ లోకి వెళ్లిన శ్యామల శాలినిని పిలిచి చాకు కనిపించడం లేదని వెతికి ఇవ్వమంటుంది. చాకు ఇచ్చిన శాలిని ఇంట్లో ఉన్నవాళ్లు బయట తిరుగుతున్నారని అంటుంది. అప్పుడు చంద్ర తలనొప్పి అని పడుకుందని కామాక్షి చెప్పడంతో రూమ్ లోకి వెళ్లి చూసి బావ డ్రామా ఆడుతున్నాడు. క్రాంతి ముందు యాక్ట్ చేస్తున్నారని బయట పెట్టేందుకు ఇదే ఛాన్స్ అని శాలిని అనుకుంటుంది. కానీ క్రాంతి ఇంట్లో ఉండడు.
చంద్ర కంగారు
{{/usCountry}}కిచెన్ లోకి వెళ్లిన శ్యామల శాలినిని పిలిచి చాకు కనిపించడం లేదని వెతికి ఇవ్వమంటుంది. చాకు ఇచ్చిన శాలిని ఇంట్లో ఉన్నవాళ్లు బయట తిరుగుతున్నారని అంటుంది. అప్పుడు చంద్ర తలనొప్పి అని పడుకుందని కామాక్షి చెప్పడంతో రూమ్ లోకి వెళ్లి చూసి బావ డ్రామా ఆడుతున్నాడు. క్రాంతి ముందు యాక్ట్ చేస్తున్నారని బయట పెట్టేందుకు ఇదే ఛాన్స్ అని శాలిని అనుకుంటుంది. కానీ క్రాంతి ఇంట్లో ఉండడు.
చంద్ర కంగారు
{{/usCountry}}చంద్రకు విరాట్ ఫోన్ చేసి ఎప్పుడొస్తున్నావ్ చంద్ర? ఇక్కడ నేను బుక్ అయిపోయేలా ఉన్నా. దిండ్లు పెట్టి పడుకున్నావని మేనేజ్ చేస్తున్నానని విరాట్ అంటాడు. శాలినికి నేను బయట ఉన్నానని తెలుసు. నువ్వు నాకు సపోర్ట్ గా ఉన్న విషయం క్రాంతి ముందు బయటపెట్టాలని చూస్తుందని చంద్ర అంటుంది. క్రాంతి వచ్చేలోపు నువ్వు ఇంటికి రావాలని విరాట్ చెప్తాడు. చంద్ర కంగారుగా బయల్దేరుతుంది.
రెడ్ హ్యాండెడ్ గా
డిన్నర్ కు నాన్ వెజ్ కావాలని శ్రుతితో అంటాడు రాజ్. నేను ఇక్కడితో ఉండిపోతా వచ్చే డబ్బులతో నువ్వు, మీ అమ్మ హ్యాపీగా ఉండండని శ్రుతి అంటుంది. విరాట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని శాలిని ప్లాన్ వేస్తుంది. రఘురాం ట్యాబ్లెట్స్ ను శాలిని దాచేస్తుంది. అప్పుడే క్రాంతి కూడా వస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.