నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో చంద్రకళను రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామనే ప్లాన్ తో రెడీగా ఉంటుంది శాలిని. ట్యాబ్లెట్స్ కోసం అందరూ వెతుకుతారు. మెడిసిన్స్ అన్నీ చంద్రనే చూసుకుంటుంది కదా, ఆవిడనే ఇవ్వమంటే సరిపోతుందని కామాక్షి చెప్తుంది. మామయ్యకు టైమ్ కు మెడిసిన్ ఇవ్వాలని శాలిని కూడా అంటుంది.
నాటకాలు ఆడుతున్నారా?

అన్నయ్యకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలని మీ భార్యను రమ్మను అని విరాట్ కు చెప్తుంది శ్యామల. తలనొప్పితో పడుకుందని విరాట్ చెప్తాడు. ఆమెను నేను లేపుతానని శ్యామల పైకి వెళ్తుంది. అప్పుడే ఆటోలో ఇంటికి వస్తుంది చంద్రకళ. బెడ్ రూమ్ లోకి వెళ్లి వచ్చిన శ్యామల నాటకాలు ఆడుతున్నావా విరాట్? గదిలో చంద్రకళ లేదని అంటుంది.
చంద్ర ట్విస్ట్
విరాట్ లోపలికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఆ చంద్రకళ ఇంటికి రాలేదు కదా అని శ్యామల సీరియస్ అవుతుంది. అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చిన చంద్ర ఎందుకు ఇంత గోల చేస్తున్నారు? తలనొప్పి అని చెప్పినా కాసేపు కూడా పడుకోనివ్వరా? అని అంటుంది. మామయ్యకు మెడిసిన్ ఇచ్చి డిన్నర్ పెడతానని చెప్పిన చంద్ర శాలిని వైపు చూస్తుంది.
విరాట్ సీరియస్
తప్పించుకున్నామని విరాట్ తో చంద్ర అంటుంది. కానీ విరాట్ సీరియస్ అవుతాడు. రెండు మూడు గంటల్లో వస్తానని చెప్పి వెళ్లావు. కానీ ఫోన్ చేసేదాకా రాలేదు. నీ వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చంద్ర. మళ్లీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. ఏం చెప్పాలో తెలియదు. నాకు టార్చర్ గా ఉంది. మన గురించి అసలు ఆలోచించవని విరాట్ ఫైర్ అవుతాడు.
పాపను మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ఇంట్లోవాళ్లను మేనేజ్ చేయడం అంతే ముఖ్యం. మనం డ్రామా ఆడుతున్న విషయం క్రాంతి ముందు బయటపెట్టేందుకు శాలిని ప్రయత్నిస్తుంది. నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఎదుటివాళ్లు తప్పు పట్టే అవకాశం నువ్వే ఇస్తున్నావని విరాట్ కోపంతో వెళ్లిపోతాడు.
ట్యాబ్లెట్స్ దాచిపెట్టానని
{{/usCountry}}పాపను మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ఇంట్లోవాళ్లను మేనేజ్ చేయడం అంతే ముఖ్యం. మనం డ్రామా ఆడుతున్న విషయం క్రాంతి ముందు బయటపెట్టేందుకు శాలిని ప్రయత్నిస్తుంది. నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఎదుటివాళ్లు తప్పు పట్టే అవకాశం నువ్వే ఇస్తున్నావని విరాట్ కోపంతో వెళ్లిపోతాడు.
ట్యాబ్లెట్స్ దాచిపెట్టానని
{{/usCountry}}పండగ పూట మా అత్తయ్య ఒక్కరే ఉంటారు కదా ఆవిడతో కలిసి ఉంటే సంతోషపడుతుందని శ్రుతి చెప్తుంది. శ్రుతి, రాజ్ వెళ్లిపోతారు. మీ డ్రామా బయటపడుతుందని చాలా టెన్షన్ పడినట్లున్నారు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం కోసం మామయ్య ట్యాబ్లెట్స్ నేనే దాచిపెట్టా. లక్ బాగుండి సేవ్ అయ్యారని చంద్రతో శాలిని అంటుంది.
చంద్ర కన్నీళ్లు
బావ నువ్వు కోపంగా ఉంటే ఏదోలా ఉంది. త్వరగా వచ్చేయాలని ట్రై చేశా. ఐస్ క్రీమ్ తినేదాకా తనతో ఉండాలని మారాం చేయడంతో తప్పలేదు. నువ్వు సీరియస్ అయితే ఎలాగో ఉంది బావ. నువ్వు కూడా తప్పు పడితే ఎలా అని చంద్ర కన్నీళ్లు కారుస్తుంది. అన్నిసార్లు టైమ్ మనకు అనుకూలంగా ఉండదని చెప్తున్నానని విరాట్ అంటాడు. క్షమించమని విరాట్ కాళ్లమీద పడుతుంది చంద్ర.
ఇంకెప్పుడు ఇలా చేయనని చంద్ర అంటే అలాగేనని విరాట్ చెప్తాడు. చంద్రను కూల్ చేయాలని పూలు కొంటాడు విరాట్. రఘురాం విరాట్ ను ఆపి చేతుల్లో ఏమున్నాయని అడుగుతాడు. మందు కొడుతున్నావా? అని అడుగుతాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.