...
...
Next Story

నిన్ను కోరి జనవరి 2 ఎపిసోడ్: విరాట్ తల్లిదండ్రుల పెళ్లి రోజు- పెద్ద షాక్ ఇచ్చిన రఘురాం- జగదీశ్వరి కన్నీళ్లు-చంద్ర అబద్ధం

నిన్ను కోరి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌లో విరాట్ తల్లిదండ్రులు జగదీశ్వరి, రఘురాం పెళ్లి రోజు వేడులను చాలా గ్రాండ్‌గా చేయాలని సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తారు. కానీ, రఘురాం మాత్రం పెద్ద షాక్ ఇస్తాడు. దాంతో జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చీర మార్చుకోవడంలో నిలదీయడంతో చంద్రకళ అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది.

Published on: Jan 3, 2026, 08:50:15 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను తల్లి అనుకుని తేజు మాట్లాడుతుంది. నిన్ను కాపాడుకోవడం కోసమే దూరంగా వెళ్లిపోయాను అని చంద్రకళ చెబుతుంది. తేజుకు చంద్రకళ అన్నం తినిపిస్తుంది. తర్వాత కిందకు హాల్లోకి వస్తుంది చంద్రకళ. అర్జున్ వచ్చి ఎందుకు అలా చెప్పారని అడుగుతాడు. ఇప్పుడు పాపకు నిజం చెబితే తట్టుకోలేదు. పాప ప్రాణాలు ముఖ్యం అని చంద్రకళ చెబుతుంది.

నిన్ను కోరి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌

మంచి జరిపించడం కోసం

కానీ, ఇక్కడితో ఇది అయిపోయేదు కాదు. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు అని అర్జున్ అంటాడు. మంచి జరిపించడం కోసం ఆ దేవుడు నాతో అలా చెప్పించాడు అని చంద్రకళ అంటుంది. దాంతో చంద్రకళకు అర్జున్ చేతులెత్తి మొక్కుతాడు. ప్లాంట్ కోసం ల్యాండ్ గురించి శాలినితో క్రాంతి మాట్లాడుతాడు. ప్లాంట్‌కు పర్మిషన్ కావాలి కదా. మినిస్టర్‌కు ట్రై చేస్తే దొరకట్లేదని శాలిని అంటే అన్నయ్యను అడుగుతానని క్రాంతి అంటాడు.

అప్పుడే విరాట్ వస్తే అడుగుతాడు క్రాంతి. నేనే నిన్ను మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. రేపే తీసుకెళ్తాను విరాట్ అంటాడు. ఇంతలో శ్యామల వచ్చి రేపు మీ అమ్మనాన్నల పెళ్లిరా అని గుర్తు చేస్తుంది. వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్‌గా చేయాలని శ్యామల అంటుంది. మరోవైపు చంద్రకళను ఇంటికి ఎలా వెళ్తారు. తేజు వెళ్లనివ్వదు అని అర్జున్ అంటాడు.

అమెరికాలో పని చేస్తున్న అని తెలుసు కాబట్టి సాయంత్రం ఆఫీస్‌కు వెళ్తున్నట్లు ఇంటికి వెళ్తాను. ఉదయం అక్కడ ఆఫీస్ అని చెప్పి ఇక్కడకి వస్తానంటుంది చంద్రకళ. దాంతో మెచ్చుకుంటాడు అర్జున్. విరాట్ కాల్ చేశాడని అర్జంట్‌గా వెళ్లాలంటుంది చంద్రకళ. ఇంతలో తేజు వచ్చి ఆడుకుందాం అంటుంది. ఆఫీస్‌కు వెళ్లాలని చెబుతుంది చంద్రకళ.

చీర కట్టుకుని వెళ్లు

ఇంతలో చంద్రకళ వచ్చి వింటుంది. సెలబ్రేషన్స్ అదిరిపోవాలి అని అంటుంది. నువ్వు చెడగొట్టకుండా ఉంటే చాలు అని విరాట్ అంటాడు. పొద్దున వేరే చీర కట్టుకుని వెళ్లావ్ కదా. చీర మారిపోయిందేంటీ అని శ్యామల నిలదీస్తుంది. ఆఫీస్‌లో అని చంద్రకళ అబద్ధం చెబుతుంది. ఆఫీస్‌లో మార్చుకోవడం ఏంటీ అని కామాక్షి అంటుంది.

మీ మాటల్లో ఎంత పెడర్థం ఉందో అర్థం చేసుకోగలను. పచ్చళ్లు ప్యాక్ చేస్తుంటే మీద పడింది. దాంతో మార్చుకున్నాను. మా సర్వెంట్స్ ఇలా జరుగుతుందని ఎక్స్‌ట్రాగా తెచ్చుకుంటారు అని చంద్రకళ చెబుతుంది. వదిన తను చెప్పింది నిజమే అనిపిస్తుందా. నాకు అయితే పెద్ద అబద్ధం అనిపిస్తుందని కామాక్షి అంటుంది. పచ్చడి అని చెప్పిందిగా వదిలేయ్ అని జగదీశ్వరి అంటుంది.

షాక్ ఇచ్చిన రఘురాం

మరోవైపు జాలి రాజ్ తల్లి ఒళ్లంత పుండు పుండు అయిపోయిందనుకుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. దాంతో శ్రుతి చెప్పిన పనులన్నింటి గురించి చెబుతుంది. అత్తతో శ్రుతి పనులు చేయిస్తుంది. అదంతా విని రాజ్ షాక్ అవుతాడు.

విరాట్ వాళ్లు పెళ్లి రోజు వేడుకలతో తండ్రికి సర్‌ప్రైజ్ ఇద్దామని చూస్తే పెళ్లి రోజు ఎవరిది, అసలు ఏం గుర్తు రావట్లేదని రఘురాం పెద్ద షాక్ ఇస్తాడు. దాంతో జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks