...
...
Next Story

Ninnu Kori March 11 Episode: శ్రుతికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్.. మాయ గతం విని విరాట్ ఫ్యామిలీ సంచలన నిర్ణయం!

Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో శ్రుతి గల్లాపెట్టె కొల్లగొట్టకుండా రాజ్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు మాయ తన స్టోరీతో అందరినీ బాధపెడుతుంది. మాయ గురించి విరాట్ ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకుంటుంది.

Published on: Mar 11, 2026, 07:48:23 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. జల రాజ్ ట్రావెల్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తాడు. మొదటి పేమెంట్ తన భార్య చేతుల మీదుగా జరగాలని రాజ్ కోరుకుంటాడు. ఆఫీస్ చెయిర్ లో శ్రుతిని కూర్చోబెడతాడు. రూ.20 వేలను ఆన్ లైన్ పేమెంట్ చేయమని కస్టమర్ ను కోరతాడు. నా షేర్ నాకు కావాలని శ్రుతి అడుగుతుంది.

శ్రుతి షాక్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఆ మనీ అమ్మ అకౌంట్లో పడింది. ఆ అకౌంట్ కు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లాంటివి ఏమీ లేవు. డబ్బులు తీయాలంటే బ్యాంక్ కు వెళ్లి అమ్మ సంతకం చేయాల్సిందేనని రాజ్ చెప్పడంతో శ్రుతి షాక్ అవుతుంది. మరోవైపు మాయను విరాట్ కాపాడటంపై ఫ్యామిలీ ప్రశ్నలు వేస్తుంది. శ్రుతి డ్రెస్ వేసుకుని మాయ బయటకు వస్తుంది.

మాయ గతం

మాయకు తన ఫ్యామిలీని విరాట్ పరిచయం చేస్తాడు. మాయ నీకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ నీకు మేమున్నామని రఘురాం అడుగుతాడు. మాయ ఏడుస్తూ తన గురించి చెప్తుంది. భర్త బిజినెస్ మ్యాన్ అని, కోట్లు సంపాదిస్తున్న రాక్షసుడు అని మాయ చెప్తుంది. క్యాంపస్ సెలక్షన్ లో నాకు జాబ్ వచ్చింది. ఆఫీస్ లో పనిచేసే అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత నా స్టార్టప్ ఐడియాను తీసుకుని నన్ను ఇంటికే పరిమితం చేశాడని మాయ చెప్తుంది.

చనిపోవాలని

నన్ను ఇంట్లో నుంచి బయటకు రాకుండా టార్చర్ చేశాడు. తప్పించుకుని బయటకు వచ్చినా అతని పలుకుబడితో ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. హైదరాబాద్ లో కూడా నాకు జాబ్ రాకుండా చేశాడు. అతణ్ని ఎదుర్కొనే శక్తి లేక చనిపోవాలని అనుకున్నానని మాయ అంటుంది. వాడిని ఊరికే వదలకూడదు, ఎవరు వాడు అని విరాట్, చంద్రకళ అడుగుతారు.

మాయను ఇంటికి తీసుకొచ్చి తొందరపడ్డానేమో చంద్ర. నీకు ఇబ్బంది అవుతుందని విరాట్ అంటాడు. మాయ ఇక్కడే ఉండటం బెటర్. నీ డిసిషన్ తప్పేమీ కాదు. మాయ నీ ఫ్రెండ్ బావ. నాకు ఏ ఇబ్బంది లేదని చంద్ర చెప్తుంది. మాయ లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని చంద్ర అంటుంది. మరోవైపు రాజ్ కు సరోజా దిష్టి తీస్తుంది. శ్రుతిని, కామాక్షిని కంట్రోల్ లో ఉండమని సరోజా చెప్తుంది.

క్రాంతి ఫైర్

మాయను కాస్త చూసుకోమ్మని శ్యామలకు విరాట్ చెప్తాడు. ఇప్పుడు మాయను కూడా మరో కూతురు అనుకుంటానని శ్యామల అంటుంది. టూ డేస్ తర్వాత ల్యాండ్ ఓనర్ ను కలిసేందుకు బెంగళూరు వెళ్తానని క్రాంతితో విరాట్ చెప్తాడు. సిటీ మేయర్ తో మాట్లాడతానని శాలిని అంటే క్రాంతి ఫైర్ అవుతాడు. అలాంటి మనిషిని ఎంత దూరం పెడితే అంత మంచిదని క్రాంతి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks