నిన్ను కోరి మార్చి 4 ఎపిసోడ్: విరాట్, చంద్ర మూడు రాత్రులు.. తల్లితో శాలిని.. జల్ రాజ్ మోసాన్ని బయటపెట్టిన శ్రుతి
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 4 ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. విరాట్, చంద్ర రొమాన్స్ లో మునిగిపోతారు. తల్లితో కలిసి శాలిని మళ్లీ ప్లాన్ వేయాలని చూస్తుంది. రాజ్ మోసాన్ని బయటపెట్టిన శ్రుతి.. జగదీశ్వరిని రూ.10 లక్షలు ఇవ్వకుండా ఆపుతుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 4 ఎపిసోడ్ లో.. శాలిని నిజంగా క్రూరమైందే అయితే ఇప్పటికే ఈ ఇంట్లో వాళ్ల ప్రాణాలు తీసేది. ఎందుకు ఇన్ని మాటలు పడుతుంది? శాలిని, క్రాంతిని కలపాలని విరాట్ తో చంద్రకళ అంటుంది. అందరి గురించి ఆలోచిస్తావ్ కానీ నా గురించి మాత్రం పట్టించుకోవని విరాట్ అంటాడు.

విరాట్, చంద్ర రొమాన్స్
నేనేమో దసరా బుల్లోడిలా రెడీ అయ్యా. నువ్వు నన్ను అబ్జర్వ్ చేశావా? అని చంద్రకళను విరాట్ అడుగుతాడు. లుంగీ కట్టావేంటీ? అని చంద్ర అడుగుతుంది. మూడ్ కు తగ్గట్లు క్యాస్టూమ్స్ ఉంటాయి. పద్ధతిగా మూడు రాత్రులు జరగాల్సిందేనని లైట్ ఆఫ్ చేసిన విరాట్.. చంద్రకళను దగ్గరకు తీసుకుంటాడు. వీళ్లు రొమాన్స్ లో మునిగిపోతారు.
శ్రుతి ఎంట్రీ
శాలిని పట్ల క్రాంతి తీరుపై రఘురాం, జగదీశ్వరి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఒక కొడుకు కాపురం నిలబడిందని సంతోషించేలోపు ఒక కొడుకు కాపురం కూలిపోయిందని జగదీశ్వరి అంటుంది. అప్పుడే శ్రుతి వచ్చి మామయ్య ఎలా ఉన్నారని అడుగుతుంది. బాగానే ఉన్నా కానీ నిన్న నీ భర్తను చూస్తే బాధేసిందని రఘురాం అంటాడు. గుడిలో జల్ రాజ్ కూలీ పని చేసిన విషయాన్ని శ్రుతికి చెప్తారు.
రాజ్ కు డబ్బులు
మామయ్య మీరు నమ్మొద్దు. అతను పెద్ద మోసగాడని శ్రుతి అంటుంది. ఆ అబ్బాయిని సరైన దారిలో నడిచేలా చేసి నీ జీవితం నిలబెట్టడం మా బాధ్యత. అందుకే ఏదైనా బిజినెస్ కోసం పెట్టుబడి సాయం చేద్దామనుకుంటున్నామని రఘురాం చెప్తాడు. జల్ రాజ్ కు కాల్ చేసి ఇంటికి రమ్మని జగదీశ్వరి చెప్తుంది. డబ్బు కోసం రాజ్ వేసిన స్కెచ్ ఇదేనని కామాక్షి, శ్రుతి మాట్లాడుకుంటారు. రాజ్ చేతికి డబ్బు అందకుండా చేయాలని తల్లీకూతుళ్లు అనుకుంటారు.
శాలిని కుట్ర
మరోవైపు మర్డర్ ప్లాన్ చేయొద్దని చెప్పా కదా అని తల్లి సునందపై శాలిని సీరియస్ అవుతుంది. నేను ప్లాన్ చేయలేదని సునంద అంటుంది. గుడిలో జరిగిన ప్రమాదం గురించి తల్లికి శాలిని చెప్తుంది. నన్ను ఎవరూ నమ్మడం లేదు. క్రాంతి అయితే టార్చర్ పెడుతున్నాడని శాలిని అంటుంది. అయితే ఇక్కడికి వచ్చేయ్, మన ఇంటి నుంచే వ్యూహాలు అమలు చేద్దామని సునంద చెప్తుంది.
నేను బయటకు రావడం జరిగితే అది క్రాంతితోనే. క్రాంతిని ఆ కుటుంబానికి దూరం చేయాలి. వాళ్లను మోసంతో దెబ్బకొట్టాలి. నేను ఆ ఇంట్లోని ఉండి నమ్మిస్తూనే ఉండాలని తల్లికి శాలిని చెప్తుంది.
రూ.10 లక్షలు
రఘురాం ఇంటికి రాజ్ వస్తాడు. నిన్న టెంపుల్ లో నీకు జరిగిన అవమానం చూశాక మాకు నిద్ర పట్టలేదు. కుటుంబం కోసం కష్టపడాలని నువ్వు చేసిన ప్రయత్నం మాకు నచ్చింది. నీకు బిజినెస్ ఏదైనా పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నామని రఘురాం, జగదీశ్వరి చెప్తారు. నాలుగు కార్లు కొని రెంట్ కు ఇస్తానని రాజ్ అంటాడు. జగదీశ్వరి రూ.10 లక్షల చెక్ ఇవ్వబోతుంది. అప్పుడే శ్రుతి వచ్చి ఆగమంటుంది.
డ్రామా
జల్ రాజ్ చెప్పడంతో యాక్టింగ్ చేసిన వ్యక్తిని శ్రుతి తీసుకొస్తుంది. నా దొంగ మొగుడు వేసిన దొంగ ప్లాన్ అమలు చేసిన వ్యక్తి అతను అని శ్రుతి నిజం చెప్పిస్తుంది. రాజ్ కూడా అక్కడి నుంచి పారిపోతాడు. శ్రుతికి వాడితో విడాకులు ఇప్పిద్దామని కామాక్షి అంటే, వెయిట్ చేసి చూద్దామని జగదీశ్వరి అంటుంది. జల్ రాజ్ ను సెట్ చేయాలని చంద్ర అనుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


