నిన్ను కోరి మార్చి 3 ఎపిసోడ్: గుడిలో దూసుకొచ్చిన ప్ర‌మాదం-ర‌ఘురాంను కాపాడిన శాలిని-శాలినిపై క్రాంతి డౌట్-విరాట్ అనుమానం

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో జల్ రాజ్ మారాడని రఘురాం అంటాడు. అప్పుడే దూసుకొస్తున్న ఓ వ్యాన్ ప్రమాదం నుంచి రఘురాంను శాలిని కాపాడుతుంది. ఇంటికి వెళ్లాక విషయం చెప్తే క్రాంతి నమ్మడు. శాలినిపై అనుమానపడతాడు. 

Published on: Mar 3, 2026, 07:34:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో.. కూలీగా పని చేస్తూ రఘురాం ఫ్యామిలీ ముందు రాజ్ డ్రామా ప్లే చేస్తాడు. శ్రుతిని ప్రేమగా చూసుకోవాలంటే సంపాదన పెరగాలి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే డబ్బులు లేవు. నేను ఇలా కూలీ పనికి వచ్చానని శ్రుతికి చెప్పొద్దని రాజ్ వెళ్లిపోతాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మోసం ఉందన్న కామాక్షి

నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇందులో ఏదో మోసం ఉందని రాజ్ గురించి కామాక్షి అంటుంది. జల్ రాజ్ లో మార్పు వచ్చింది. కష్టం విలువ తెలిసొచ్చిందని చంద్రకళ చెప్తుంది. అవును పిన్ని ఎన్ని ఎత్తులు వేసినా మన దగ్గర నుంచి డబ్బులు రావని తెలిసిపోయినట్లుంది. ఇంకా కష్టపడక తప్పదని తెలుసుకున్నాడని శాలిని అంటుంది. ఇప్పుడు అతణ్ని నమ్మొద్దని రఘురాంతో కామాక్షి చెప్తుంది.

మామయ్యను కాపాడిన శాలిని

కామాక్షి, రఘురాం కాసేపు వాగ్వాదం చేసుకుంటారు. ఆ సమయంలోనే ఓ సిమెంట్ వ్యాన్ కంట్రోల్ తప్పి రఘురాం వైపు దూసుకొస్తుంది. వెంటనే శాలిని మామయ్య అని రఘురాంను పక్కకు లాగేస్తుంది. రఘురాం, శాలినికి దెబ్బలు తగులుతాయి.

రాజ్ గెంతులు

మరోవైపు రాజ్ గెంతులు వేసుకుంటూ ఇంటికి వస్తాడు. గుడిలో వేసిన స్కెచ్ గురించి తల్లి సరోజాకు రాజ్ చెప్తాడు. శ్రుతి వచ్చి ఏదో దాస్తున్నారు కదా అని అడుగుతుంది. బిజినెస్ ప్లాన్ చేశానని రాజ్ చెప్తాడు. నాకొక పిజ్జా, మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టమని శ్రుతి అడుగుతుంది. రాజ్ ఓకే చెప్తాడు.

విరాట్ టెన్షన్

స్వశక్తితో ఎదగాలని అనుకుంటున్నా అన్నయ్య. శాలినితో వెళ్లడం ఇష్టం లేక గుడికి వెళ్లలేదు. కుక్క తోక వంకర అని విరాట్ తో క్రాంతి అంటుండగా అందరూ గుడి నుంచి ఇంటికి వస్తారు. తండ్రి గాయాలు చూసి విరాట్ టెన్షన్ పడతాడు. గుడిలో జరిగిన దాని గురించి చంద్ర చెప్తుంది. శాలిని లేకపోతే నా పని అయిపోయేదేనని రఘురాం అంటాడు.

క్రాంతి డౌట్

గాయమైందా, అయ్యేలా ప్లాన్ చేశావా? అని శాలినిపై క్రాంతి అనుమానం వ్యక్తం చేస్తాడు. కచ్చితంగా ఇది నీ ప్లానే అని నా డౌట్ అని క్రాంతి అంటాడు. ఈవిడకు సిమెంట్ వ్యాన్ కు సంబంధం ఎప్పటి నుంచో ఉంది కదా అని కామాక్షి కూడా డౌట్ పడుతుంది. అందరిని లేపేసేందుకు శాలిని ప్లాన్ చేసి ఉంటుంది. కాపాడినట్లు డ్రామా ఆడుతుందని క్రాంతి అంటాడు. క్రాంతిపై అందరు కోప్పడతారు.

ఆ రోజు రాత్రి కూడా శాలినితో కామాక్షి మాట్లాడుతుంది. శాడిస్ట్ మొగుడు అయితే జుట్టు పట్టుకుని నీ తల గోడకు కొట్టేవాడని కామాక్షి చెప్తుంది. ఆ సీన్ ను శాలిని ఊహించుకుంటుంది. ఆ సిమెంట్ వ్యాన్ శాలిని వాళ్లదా అని శ్యామల వచ్చి అడుగుతుంది. ఆ యాక్సిడెంట్ ప్లాన్ శాలినిదే అనే డౌట్ వస్తుందని చంద్రకళతో విరాట్ అంటాడు. శాలిని మారిందని చంద్ర చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More