నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 12 ఎపిసోడ్ లో.. కడుపుతో ఉన్న చంద్రకళ కోసం రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తారు. కామాక్షి తినడానికి వస్తుంది. కానీ ఇవన్నీ చంద్ర కోసమని శ్యామల, జగదీశ్వరి చెప్తారు. అందరు కలిసి భోజనం చేస్తారు. చంద్రకు పొలమారితే అందరూ కంగారు పడతారు.
మహారాణిలా చంద్ర

చంద్రకళను చూసి నాకు ఇలాంటి ఫ్యామిలీ ప్రేమ లేదు అని అనుకున్నా. తను లక్కీ అని ఫీల్ అయ్యానని మాయ అంటుంది. అందరు కలిసి భోంచేస్తారు. రాత్రి వెళ్లి తల్లి సునందను శాలిని కలుస్తుంది. ఎంతైనా మేనకోడలు కదా జగదీశ్వరి అలాగే చేస్తుందని సునంద అంటుంది. ఆ ఇంట్లో చంద్ర మహారాణిలా బతుకుతోంది. నేను బానిసలా సేవలు చేయాల్సి వస్తుందని శాలిని ఫ్రస్టేట్ అవుతుంది.
పగతో శాలిని
ఇవన్నీ చూస్తూ నాలో పగ ఎక్కువ అవుతుంది. వాళ్లను రాచి రంపానా పెట్టాలనే కసి పెరుగుతుంది. నా భర్త ఏమో అన్నావదినలు దైవంతో సమానమని అనుకుంటున్నాడని శాలిని అంటుంది. అప్పుడే శాలినికి శ్యామల కాల్ చేసి ఐస్ వేసి చెరుకు రసం తీసుకురమ్మని చెప్తుంది. దీంతో శాలినికి మరింత మండిపోతుంది.
మాయ థ్యాంక్స్
చంద్రకళను విరాట్ ఏ పని చేయనివ్వడు. ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. కడుపులో బిడ్డతో విరాట్ మాట్లాడతాడు. రొమాంటిక్ గా చంద్రకు విరాట్ ముద్దు పెట్టబోతుంటే విరాట్ అంటూ మాయ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నాకు జాబ్ కావాలని మాయ అడుగుతుంది.
విరాట్ నన్ను కాపాడాడు. మీ ఇంట్లో అందరికీ మంచి మనసు ఉంది. నాకు బతకాలని ఆశ కలిగింది. విరాట్ నువ్వు లేకపోతే నేను లేనని విరాట్ చేతిని మాయ పట్టుకుంటుంది. విరాట్ కూడా పట్టుకుంటాడు. అది చూసి చంద్రకు జెలసీ కలుగుతుంది.
పసిపిల్లాడి కోసం
{{/usCountry}}విరాట్ నన్ను కాపాడాడు. మీ ఇంట్లో అందరికీ మంచి మనసు ఉంది. నాకు బతకాలని ఆశ కలిగింది. విరాట్ నువ్వు లేకపోతే నేను లేనని విరాట్ చేతిని మాయ పట్టుకుంటుంది. విరాట్ కూడా పట్టుకుంటాడు. అది చూసి చంద్రకు జెలసీ కలుగుతుంది.
పసిపిల్లాడి కోసం
{{/usCountry}}మాయ వెళ్లిన తర్వాత చంద్ర కోప్పడుతుంది. ముద్దు మాయకు పెట్టు. కొత్త అమ్మాయి కనిపిస్తే చాలు మీ మగాళ్లు టచ్ చేసి మాట్లాడతారని చంద్ర దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. పొద్దున చంద్రకు నోట్లో పెట్టి మరీ శ్యామల తినిపిస్తుంది. ఈ ఇంట్లో పసిపిల్లాడు పారాడుతుంటే చూడాలన్నది మా అందరి కోరిక అని మాయకు జగదీశ్వరి చెప్తుంది.
సర్ ఫ్రైజ్ గిఫ్ట్
అప్పుడే క్రాంతితో చంద్రకళ గిఫ్ట్ తెప్పిస్తుంది. ఇది సర్ ప్రైజ్. ముందు మా ఆయనకు చూపించాలని చంద్ర చెప్తుంది. మీ ఫ్యామిలీని చూస్తుంటే హ్యాపీగా ఉంది. మీరు లక్కీ ఆంటీ అని జగదీశ్వరితో మాయ అంటుంది. మరోవైపు ట్రావెల్స్ ఆఫీస్ లో రాజ్ బిజీగా ఉంటాడు. అప్పుడే శ్రుతి రావడంతో సరోజా కౌంటర్లు వేస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.