నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 13 ఎపిసోడ్ లో.. ఆఫీస్ లో కస్టమర్ తో జల రాజ్ మాట్లాడుతుండగా అక్కడ ఉన్న స్కానర్ పై తన బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ను శ్రుతి అతికిస్తుంది. నా అకౌంట్ క్యూఆర్ కోడ్ అతికించేశాను, ఇక అమౌంట్ మొత్తం నాకే అని శ్రుతి అనుకుంటుంది.
చంద్ర సర్ ప్రైజ్

మరోవైపు విరాట్ కు చంద్రకళ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో చూద్దామని ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంటుంది. విరాట్ అప్పుడే వస్తాడు. వెళ్లు బాబు వెళ్లు సర్ ప్రైజ్ గదిలో రెడీగా ఉందని విరాట్ ను రూమ్ కు పంపిస్తారు. చంద్ర ఇచ్చిన ఫొటో ఫ్రేమ్ లో తన చిన్నప్పటి ఫొటో చూసి విరాట్ మురిసిపోతాడు.
రొమాంటిక్ గా విరాట్
నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను లైవ్ లో చూస్తా. నువ్వు లేనప్పుడు ఈ ఫొటో చూస్తా. కడుపుతో ఉన్నప్పుడు ఎవరినైతో ప్రేమతో చూస్తామో వాళ్ల పోలికలు వస్తాయి. నిద్ర పొయేటప్పుడు, లేచేటప్పుడు ఇదే ఫొటో చూస్తానని చంద్ర చెప్తుంది. ఫ్యామిలీ అంతా బయట నిలబడి చూస్తారు. చంద్రను విరాట్ దగ్గరకు లాక్కుంటాడు. ఇక ఆపేయండని ఫ్యామిలీ లోపలికి ఎంట్రీ ఇస్తుంది.
చంద్రకు ఏమైనా ఇచ్చారా?
చంద్రకు విరాట్ పై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఎన్ని నిందలు వేసినా విరాట్ కోసం అన్నీ భరించింది. ఆ ప్రేమను పొందటం విరాట్ అదృష్టమని జగదీశ్వరి చెప్తుంది. పుట్టబోయే బిడ్డ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని రఘురాం అంటాడు. బిడ్డ కోసం ఆలోచిస్తున్నారు కానీ తల్లి కోసం ఆలోచిస్తున్నారా? చంద్ర కోసం కనీసం బంగారు చైన్ అయినా చేయించారా? అని శ్యామల అడుగుతుంది.
శ్రుతి ప్లాన్
ఇక తల్లి అకౌంట్లో ఒక్క పేమెంట్ పడకపోయేసరికి రాజ్ కంగారు పడతాడు. అప్పుడే శ్రుతి వచ్చి సరోజా, రాజ్ ముఖాలను కామాక్షికి చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ మార్చేశానని శ్రుతి షాక్ అవుతుంది. శ్రుతి అకౌంట్లో డబ్బుల కోసం సరోజా, రాజ్ తగ్గి మాట్లాడతారు.
మర్చిపోయిన రఘురాం
{{/usCountry}}ఇక తల్లి అకౌంట్లో ఒక్క పేమెంట్ పడకపోయేసరికి రాజ్ కంగారు పడతాడు. అప్పుడే శ్రుతి వచ్చి సరోజా, రాజ్ ముఖాలను కామాక్షికి చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ మార్చేశానని శ్రుతి షాక్ అవుతుంది. శ్రుతి అకౌంట్లో డబ్బుల కోసం సరోజా, రాజ్ తగ్గి మాట్లాడతారు.
మర్చిపోయిన రఘురాం
{{/usCountry}}మాయ ఫ్లవర్ వాజ్ ను కింద పడేయడంతో సౌండ్ కు రఘురాం మళ్లీ గతం మర్చిపోతాడు. మాయను గుర్తుపట్టడు. మాయను దొంగ అని అంటాడు. 100కు కాల్ చేస్తానంటాడు. జగదీశ్వరి, చంద్రకళ వచ్చి రఘురాంకు గుర్తు చేస్తారు. మాయకు సారీ చెప్పి అసలు విషయాన్ని జగదీశ్వరి చెప్తుంది.
అంత ప్రాబ్లం పెట్టుకుని అంకుల్ ఎంత సరదాగా ఉంటారో కదా. ఒక్కొకరు ఒక్కోలా ఇన్ స్ఫైర్ చేస్తున్నారు కదా అక్క అని చంద్రకళతో మాయ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.