...
...
Next Story

నిన్ను కోరి మార్చి 23 ఎపిసోడ్: విరాట్‌కు ఘోర ప్రమాదం.. చంద్రకళకు పీడకల.. శాలిని మరో ప్లాన్.. మాయపై క్రాంతి సీరియస్

Ninnu Kori March 23rd Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో విరాట్ ను టార్గెట్ చేసిన శాలిని, సునంద మరో ప్లాన్ వేస్తారు. శాలినిపై అనుమానంతో మాయ ఫాలో అవుతుంది. విరాట్ కు యాక్సిడెంట్ జరిగిందని పీడ కల రావడంతో చంద్రకళ ఉలిక్కిపడుతుంది.

Published on: Mar 23, 2026, 07:30:18 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో.. బావకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? ల్యాండ్ వివాదంలో ఇప్పటికే బావపై ఎటాక్ కూడా జరిగింది. దీని వెనుక ఎవరెవరు ఇన్వాల్స్ అయ్యారో తెలియదు. వెంటనే వచ్చేయమను క్రాంతి అని శాలిని అంటుంది.

విరాట్ లో తెగింపు

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఇప్పుడు అన్నయ్య ల్యాండ్ వదులుకోవాలన్నది నీ ప్లాన్ కదా అని క్రాంతి అంటాడు. సమస్య గురించి మరీ ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడొద్దు. బావ నాతో ఎప్పటికప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. సమస్య నుంచి దూరంగా పారిపోతే ఎలా అని చెప్పాడని చంద్రకళ అంటుంది. విరాట్ లో ధైర్యం, తెగింపు ఉన్నాయి కాబట్టే బిజినెస్ ను అంత బాగా డెవలప్ చేయగలిగాడని జగదీశ్వరి అంటుంది.

సునందకు కాల్

విరాట్ తన గురించి ఆలోచించడం లేదని మాయ ఫీల్ అవుతుంది. తల్లి సునందకు శాలిని కాల్ చేస్తుంది. పురుషోత్తం గురించి సెర్చ్ చేస్తున్నాడు పిచ్చి బావ. పురుషోత్తం దొరకడు కదా. విరాట్ ను బెంగళూరు నుంచి తిరిగి వచ్చేయమని సింపతీ డ్రామా ఆడాను. కానీ ఎవరూ ఒప్పుకోలేదని తల్లికి శాలిని చెప్తుంది.

శాలినిపై అనుమానం

మరో ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని తల్లీకూతుళ్లు మాట్లాడుకుంటారు. ఇదంతా చూసిన మాయ, శాలినిపై అనుమానంతో ఆమెను ఫాలో అవుతూ వెళ్తుంది. పార్క్ లో ప్రాంక్ అని అడుకుందని హేమంత్ వచ్చి మాయకు అడ్డుపడతాడు. ఆ రోజు ఏందో ప్రాంక్ చేశా, నేను అర్జెంట్ గా వెళ్తున్నానని మాయ అంటుంది.

జల్ రాజ్ హెల్ప్

జల్ రాజ్, మాయ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. మాయ ఎక్కడికి వెళ్లిందని చంద్ర కంగారు పడుతుంది. అప్పుడే మాయను తీసుకుని జల్ రాజ్ వస్తాడు. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని, టైమ్ పాస్ కోసం బయటకు వెళ్లానని మాయ అబద్ధం చెప్తుంది. దారిలో ఈ అమ్మాయిని కొంతమంది వెధవలు ఏడిపిస్తుంటే నేను వెళ్లి కాపాడానని జల్ రాజ్ చెప్తాడు.

విరాట్ కు యాక్సిడెంట్

ఇలాంటి టైమ్ లో కొత్త టెన్షన్స్ క్రియేట్ చేయకు మాయ. మా వదినను టెన్షన్ పెట్టకు అని క్రాంతి సీరియస్ గా అంటాడు. ఇంకోసారి ఇలా చేయను సారీ అని మాయ చెప్తుంది. రాత్రి నిద్రలో చంద్రకళ ఉలిక్కిపడి లేస్తుంది. విరాట్ కు కారు యాక్సిడెంట్ అయినట్లు పీడకల రావడంతో కంగారు పడుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks