నిన్ను కోరి అక్టోబర్ 16 ఎపిసోడ్: శాలిని నిజస్వరూపం-లాగిపెట్టి కొట్టిన చంద్ర-మళ్లీ మామయ్యను చంపాలనుకున్న శాలిని
నిన్ను కోరి టుడే అక్టోబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో మామయ్యను తలపై కొట్టింది శాలిని అని చంద్ర తెలుసుకుంటుంది. శాలినిని లాగిపెట్టి కొడుతుంది. రిపోర్ట్స్ మారడానికి కారణం ఎవరో తెలుసుకుంటానని విరాట్ అంటాడు. మామయ్యను చంపడానికి ట్రై చేస్తుంది శాలిని.
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 16 ఎపిసోడ్ లో అన్నయ్యను కొట్టింది నువ్వే కదా అని శ్రుతిని అడుగుతుంది కామాక్షి. తల మీద కొట్టి చంద్రకళ బయటకు వచ్చి యాక్ట్ చేసిందేమోనని శ్రుతి అంటుంది. మామయ్యకు స్పృహ వచ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను కదమ్మా అని శ్రుతి విసుగ్గా వెళ్లిపోతుంది.

చంద్రకళ మీద డౌట్
మామయ్యను కొట్టారని తెలిసింది కానీ నా మీద డౌట్ రాలేదని శాలిని అనుకుంటుంది. చంద్రకళ మీద డౌట్ వచ్చింది కాబట్టి నేను సేఫ్. మామయ్యకు స్పృహ వచ్చేలోపు చంద్ర గడువు ముగిసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నా రాజ్యమే నడుస్తుందని శాలిని అనుకుంటుంది. అప్పుడే చంద్ర వచ్చి మామయ్యను కొట్టింది నువ్వే కదా అని డైరెక్ట్ గా అడుగుతుంది. అలాంటి అవసరం నీకు, శ్రుతికి మాత్రమే ఉందని చంద్ర అంటుంది.
పగ ముఖ్యం
నువ్వు మారిపోయావని నమ్మి నేను తప్పు చేశానని చంద్ర అంటుంది. నీకు తెలిస్తే పర్వాలేదు అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుంది. ఇంటి పరువు, నాకు క్రాంతికి ఉన్న రిలేషన్ కాపాడటం నీకు ముఖ్యం. నీ ప్రాబ్లెం నీ మంచితనం. నాకు పగ ముఖ్యం. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను మారిపోయావని ఎలా నమ్మావు చంద్ర. స్వార్థం కోసమే నటించా. మామయ్య స్పృహలోకి వచ్చి అందరికీ చెప్పేస్తానని అన్నారు. అందుకే కొట్టాల్సి వచ్చిందని శాలిని అంటుంది.
నిజం తెలుసుకోవాలని
వెంటనే శాలినిని లాగిపెట్టి కొడుతుంది చంద్ర. అప్పుడే క్రాంతి వస్తాడు. శాలిని మాట మారుస్తుంది. చంద్రకు సపోర్ట్ గా డ్రామా ఆడుతుంది శాలిని. నీ పాపం పండే రోజు తప్పకుండా వస్తుందని చంద్ర వెళ్లిపోతుంది. నాన్నను చంపాలనే ఆలోచన ఎవరికి ఉంటుందని క్రాంతిని విరాట్ అడుగుతాడు. వరదరాజులు చేసి రిపోర్ట్స్ మార్చేసి ఉంటారా? అని క్రాంతి డౌట్ పడతాడు. మనకు తెలియని శత్రువులు ఎవరో కనుక్కోవాలని అంటాడు. రేపు హాస్పిటల్ వెళ్లి నిజం తెలుసుకుంటానంటాడు విరాట్.
మామయ్యను చంపాలని
మరోవైపు అర్జున్ మందు తాగి బాధపడుతుంటాడు. ఆ పసి పాప ఏం చేసిందని ఇంత శిక్షా అని దేవుణ్ని ప్రశ్నిస్తాడు. ముందు నాకు భార్యను దూరం చేశావు. ఇప్పుడు కూతురిని దూరం చేసి ఏం సాధిస్తావు. తల్లిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నువ్వు చలనం లేని రాయివి అని బాధపడతాడు అర్జున్. ఇటు మామయ్యను చంపాలని అర్ధరాత్రి లేచి రఘురాం గదిలోకి వెళ్లుంది శాలిని. అది శ్యామల చూస్తుంది.
దిండుతో రఘురాం ఊపిరి తీసేందుకు శాలిని చూస్తుండగా శ్యామల వచ్చి లైట్ ఆన్ చేస్తుంది. మామయ్యకు మెడిసిన్ ఇవ్వడానికి వచ్చానని తడబడుతుంది శాలిని. నన్ను అనుమానిస్తున్నారా? అని డ్రామా ఆడుతుంది శాలిని. ఆయన దగ్గరకు ఎవరూ రావడానికి వీల్లేదని జగదీశ్వరి సీరియస్ గా చెప్తుంది. మరోవైపు తాగి తూలుతూ అర్జున్ ఇంటికి వెళ్తాడు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


