నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 23 ఎపిసోడ్ లో క్రాంతి, శాలిని మధ్య రిలేషన్ దెబ్బ తింటుందని తను బాధపడింది. ఈ విషయం తెలిస్తే శాలినిని పంపించేస్తావని, క్రాంతి ఒంటరివాడవుతాడని ఆలోచించింది. కుటుంబం కోసం ఆలోచించే చంద్రను సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు. క్రాంతి కావాలంటే నీ భార్యను అడగమని అంటాడు విరాట్.
శాలిని డ్రామా

ఇదంతా నిజమా అని శాలినిని క్రాంతి అడుగుతాడు. బావ నన్ను అపార్థం చేసుకున్నారని శాలిని అంటుంది. నాన్నగారిని చంపాలనుకున్నవా? అని అడిగితే అవును రిపోర్ట్స్ మార్పించింది నేనేనని శాలిని డ్రామా స్టార్ట్ చేస్తుంది. గర్భం అయినా నిజమా? కాదా అని జగదీశ్వరి కోప్పడగానే శాలిని ఏడుపు అందుకుంటుంది. విరాట్ ఏదో భార్య మాట విని ఇలా మాట్లాడుతున్నాడని కామాక్షి అంటుంది.
మొసలి కన్నీళ్లు
మీ భార్యను కాపాడటానికే రిపోర్ట్స్ మార్చానని శాలిని నాటకమాడుతుంది. ఆ రోజు గదికి వెళ్లి చంద్రకళ ఒక్కరే. కానీ చంద్ర అలా చేసిందని కాదు. విడాకుల వరకూ వెళ్లిన నా కాపురాన్ని చంద్రకళ నిలబెట్టింది. చంద్రను కాపాడటానికే అలా చేశా. కానీ నన్ను అనుమానించేలా చేశారు. మొత్తం నా ఉనికినే ఓ మోసంలా మార్చేశారని శాలిని మొసలి కన్నీళ్లు పెడుతుంది. ఇక జన్మలో నిన్ను అనుమానించను బిడ్డ మీద ఒట్టు అని క్రాంతి అంటాడు.
జగదీశ్వరి సీరియస్
నీలా నేను నీ భార్యను నిందించలేను అన్నయ్య. వెన్నుపోటు పొడిచావు అన్నయ్య. ఇంకొక్క మాట నా భార్య గురించి మాట్లాడితే బాగుండదని క్రాంతి సీరియస్ అవుతాడు. నీ భార్య మేకవన్నె పులి అనగానే విరాట్ గళ్ల పట్టుకుంటాడు క్రాంతి. నిజాన్ని బయటకు లాగుతానని విరాట్ కూడా తమ్ముడి కాలర్ పట్టుకుంటాడు. జగదీశ్వరి ఇద్దరిని విడదీసి అందరికీ వార్నింగ్ ఇస్తుంది. నా భర్త మాట్లాడితే నిజం తెలుస్తుందని అంటుంది.
మొత్తం చంద్ర మీదకు టర్న్ చేసి చెప్పగలిగాను. మామయ్య కోలుకునే లోపు నేను అనుకున్నది జరగాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే క్రాంతి వచ్చి శాలినికి సారీ చెప్తాడు. అన్నయ్య నీ గురించి ఆలోచించడం చాలా హర్ట్ చేసింది. ఆ మాటలు పడ్డ నీకు ఎంత బాధ ఉందోనని క్రాంతి అంటుంది. మనసులో ఏం పెట్టుకోకు, చంద్ర మీద ద్వేషం పెంచుకోకు అని క్రాంతిని మానిప్యులేట్ చేస్తుంది శాలిని.
గాడ్ దగ్గరకు
{{/usCountry}}మొత్తం చంద్ర మీదకు టర్న్ చేసి చెప్పగలిగాను. మామయ్య కోలుకునే లోపు నేను అనుకున్నది జరగాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే క్రాంతి వచ్చి శాలినికి సారీ చెప్తాడు. అన్నయ్య నీ గురించి ఆలోచించడం చాలా హర్ట్ చేసింది. ఆ మాటలు పడ్డ నీకు ఎంత బాధ ఉందోనని క్రాంతి అంటుంది. మనసులో ఏం పెట్టుకోకు, చంద్ర మీద ద్వేషం పెంచుకోకు అని క్రాంతిని మానిప్యులేట్ చేస్తుంది శాలిని.
గాడ్ దగ్గరకు
{{/usCountry}}తేజు దగ్గరకు అర్జున్ వెళ్తాడు. దెబ్బ చూసి ఏమైందని అడుగుతుంది తేజు. చిన్న యాక్సిడెంట్ అని చెప్పిన అర్జున్ ఈ రోజు రాత్రి ఇక్కడే పడుకుంటానని చెప్తాడు. తొందర్లోనే నిన్ను వదిలేసి గాడ్ దగ్గరకు వెళ్లిపోతానని కాబట్టి మళ్లీ ఛాన్స్ ఉండదని ఈ రోజు వచ్చావు కదా. చచ్చిపోతానని నాకు బాధలేదు. కానీ అమ్మను చూడాలని ఉందని తేజు అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.