...
...
Next Story

నిన్ను కోరి అక్టోబర్ 29 ఎపిసోడ్: శాలిని హిప్నటైజ్‌కు విరాట్ ప్లాన్‌- వంద బిందెల‌తో చంద్ర‌కళ అభిషేకం

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో శాలినిని హిప్నటైజ్ చేయించి నిజాలు రాబట్టాలని విరాట్ అనుకుంటాడు. కానీ శాలిని తెలివిగా సమాధానాలు చెప్తుంది. మరోవైపు చంద్రకళ పూజ స్టార్ట్ చేస్తుంది. వంద బిందెలతో అభిషేకం చేస్తుంది.

Published on: Oct 29, 2025, 07:58:11 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో ఇవన్నీ చూస్తుంటే నాకే ఆయన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోందని జగదీశ్వరి బాధ పడుతుంది. ఈ గొడవలు పక్కనపెట్టి ముందు ఎవరి పనులు వాళ్లు చేసుకోండి. శాలినికి టెస్టులు చేయిస్తాన్నవావు కదా క్రాంతి. నాలుగు రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని శ్యామల చెప్తుంది.

డాక్టర్ కు విరాట్ కాల్

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

డాక్టర్ కు విరాట్ కాల్ చేస్తాడు. డాక్టర్ ను ఓ ఫేవర్ ఆడుగుతాడు. హాస్పిటల్ వెళ్లి డాక్టర్ ను కలుస్తాడు. సైక్రియార్టిస్ట్ ను కలుస్తాడు విరాట్. శాలినిని అడగాల్సిన ప్రశ్నలను డాక్టర్ కు ఇస్తాడు విరాట్. ఇది సీరియస్ మ్యాటర్ అని డాక్టర్ అంటే, చాలా సీరియస్ అని విరాట్ చెప్తాడు. మా నాన్న ప్రాణాలకే ప్రమాదం ఉందని, హెల్ప్ చేయమని అడుగుతాడు.

హిప్నటైజ్ చేయాలని

లేడీ డాక్టర్ శాలినికి సైక్రియార్టిస్ట్ ను కలవమని చెప్తుంది. హిప్నటైజ్ థెరపీతో నాన్నను కొట్టింది శాలిని అని చెప్పించాలనుకుంటాడు విరాట్. మరోవైపు పూజకు రెడీ అవుతుంది చంద్రకళ. కాపురాన్ని నిలబెట్టుకోవాలని, కుటుంబాన్ని కాపాడుకోవాలని పూజలు చేస్తున్నావు. నీకు సపోర్ట్ గా నిలుస్తానని స్వామిజీ చెప్తాడు. శివలింగానికి వంద సార్లు కోనేరులోని నీటిని బిందెతో తీసుకొచ్చి అభిషేకం చేయాలని చెప్తాడు. పొరపాటు జరిగితే మళ్లీ మొదటి నుంచి చేయాలంటాడు. చంద్రకళ అభిషేకం ప్రారంభిస్తుంది.

చంద్రకళ అభిషేకం

శాలిని, క్రాంతిని సైక్రియార్టిస్ట్ ప్రశ్నలు అడుగుతాడు. క్రాంతిని పక్కకు తీసుకెళ్లమని డాక్టర్ కు చెప్తాడు విరాట్. వెంటనే శాలినిని హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు డాక్టర్. మరోవైపు అడుగులు తడబడుతున్నా సరే చంద్రకళ వంద బిందెలతో అభిషేకం పూర్తి చేస్తుంది. ఇంకోవైపు విరాట్ ను లోపలికి పిలుస్తాడు డాక్టర్. శాలినిని హిప్నటైజ్ చేసి మాట్లాడతాడు.

క్రాంతి సోల్ మేట్

వినాయక చవితి రోజు ఏం జరిగిందో చెప్పమని డాక్టర్ అడుగుతాడు. ఆ రోజు మామయ్యకు చలనం వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని శాలిని చెప్తుంది. ఆ రోజు మీ మామయ్య తలమీద కొట్టింది మీరే కదా అని డాక్టర్ అడుగుతాడు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks