...
...
Next Story

Ninnu Kori September 10 Episode: నిన్ను కోరి- శాలినికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మదన్- మారిన విరాట్ రూపం- చంద్రకు బావ షాక్

Ninnu Kori Serial September 10th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 10వ ఎపిసోడ్‌‌లో విరాట్ కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని జగదీశ్వరి, రఘురామ్ అనుకుంటారు. అప్పుడే విరాట్ గొంతుతో మదన్ కాల్ చేసి తను క్షేమంగా ఉన్నట్లు చెబుతాడు. ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్ అయి విరాట్ రూపం మారుతుంది.

Published on: Sep 10, 2026, 09:16:59 IST
Advertisement

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువుతో పోరాడుతున్న విరాట్‌ను కాపాడుకోవడానికి చంద్రకళ పడుతున్న ఆరాటం, ఇంట్లో వారిని ఆందోళన నుంచి రక్షించేందుకు మదన్ ఆడుతున్న నాటకం, నిజం తెలుసుకోవడానికి శాలిని పన్నుతున్న కుట్రలు కథనాన్ని సీట్‌ఎడ్జ్ థ్రిల్లర్‌గా మార్చేశాయి.

విరాట్ గదిలో విలపించిన చంద్ర

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 10 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 10 ఎపిసోడ్

విరాట్ దూరమయ్యాడనే చేదు నిజం చంద్రకళను నిలువెల్లా దహిస్తుంటుంది. తన గదిలోకి అడుగుపెట్టగానే గతంలో విరాట్ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ప్రేమగా "అందమైన బావ" అని పొగడటం, దానికి విరాట్ సరదాగా "నాకన్నా అందమైన వాళ్లు నీకు దొరకరులే" అని నవ్వడం గుర్తుకొస్తాయి.

ఇకపై తన భర్త ఆ నవ్వుల రూపంలో కనిపించడనే చేదు నిజాన్ని తలుచుకుని చంద్రకళ గదిలోనే గుండె పగిలేలా రోదిస్తుంది. ఆ వేదనలో ఉన్నప్పుడే మదన్ నుంచి కాల్ వస్తుంది. సర్జరీకి, హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు అత్యవసరమని మదన్ చెప్పగా.. "నువ్వు కంగారుపడకు, రేపు ఉదయానికల్లా డబ్బులు సర్దుబాటు చేసి తెస్తాను" అని చంద్రకళ అంటుంది.

మదన్ గొంతు మార్పిడి మాయాజాలం

ఆ రాత్రంతా విరాట్ జ్ఞాపకాలతో కుమిలిపోతూనే గడుపుతుంది చంద్రకళ. మరుసటి రోజు ఉదయానికి విరాట్ రాకపోవడంతో ఇంట్లో పరిస్థితి చేయిదాటిపోతుంది. జగదీశ్వరి, రఘురామ్‌లు కంగారుతో పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటారు. ఏం చేయాలో పాలుపోక చంద్రకళ మౌనంగా ఉండిపోతుంది.

సరిగ్గా పోలీసులకు చెబుదామనుకునే టైమ్‌లో జగదీశ్వరికి విరాట్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో పక్కనే ఉన్న శాలిని షాక్‌కు గురవుతుంది. మదన్ సమయస్ఫూర్తితో విరాట్ గొంతులా మార్చి మాట్లాడుతాడు. "నా గురించి కంగారు పడకండి. మాయను వెతుక్కుంటూ స్టేట్ దాటి వచ్చాను, ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంది. ఆమెను తీసుకుని ఇంటికి వస్తాను" అని మదన్ నాటకం ఆడుతాడు.

శాలినికి మైండ్ బ్లాక్

జగదీశ్వరి, రఘురామ్‌ల భయం తీరినా, పక్కనే ఉన్న శాలినికి మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. "వీడు నిజంగానే బతికున్నాడా? అసలు ఏ హాస్పిటల్‌లో ఉన్నాడు?" అనే తీవ్ర అనుమానంతో శాలిని రగిలిపోతుంది.

ప్రమాద స్థలంలో విచారణ – హాస్పిటల్ బాట పట్టిన శాలిని

నిజానిజాలు తేల్చుకోవడానికి శాలిని నేరుగా యాక్సిడెంట్ స్పాట్‌కు చేరుకుంటుంది. అక్కడ నుజ్జునుజ్జయి పడివున్న విరాట్ కారును చూసి లోపల రాక్షస ఆనందం పొందుతుంది. చుట్టుపక్కల వారిని మాటల్లో పెట్టి, తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించారని తెలుసుకుంటుంది. విరాట్ నిజంగా చనిపోయాడా లేదా ఇంకా ఊపిరితోనే ఉన్నాడా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే ఆ హాస్పిటల్‌కు బయలుదేరుతుంది శాలిని.

అదే సమయంలో ఆస్పత్రిలో మదన్ మాస్టర్ ప్లాన్ అమలవుతుంది. డాక్టర్లతో మాట్లాడి సర్జరీ విషయాన్ని అత్యంత సీక్రెట్‌గా ఉంచుతాడు. ఎవరికీ సందేహం రాకుండా ఆస్పత్రి రికార్డుల్లో విరాట్ పేరును మారుస్తారు. శాలిని ఆస్పత్రికి వచ్చి రిసెప్షన్‌లో విరాట్ పేరుతో విచారిస్తుంది.

శాలినికి అయోమయం

"ఆ యాక్సిడెంట్ బాధితుడెవరో తెలియదు కానీ, విరాట్ అనే పేరుతో ఎవరూ అడ్మిట్ కాలేదు" అని రిసెప్షనిస్ట్ శాలినికి తెగేసి చెప్తుంది. దాంతో శాలిని తీవ్ర అయోమయానికి గురవుతుంది. రిసెప్షనిస్ట్ మాటలు నమ్మని శాలిని నేరుగా వార్డుల వైపు వెళ్తుంది.

సరిగ్గా అదే కారిడార్‌లో చంద్రకళ తాను తెచ్చిన డబ్బు మదన్‌కు అప్పగిస్తుంది. కన్నీళ్లతో రెండు చేతులెత్తి డాక్టర్‌కు దండం పెడుతూ "ఎలాగైనా నా భర్తను కాపాడండి డాక్టర్ " అని కన్నీళ్లతో వేడుకుంటుంది. శాలిని సరిగ్గా ఆ దిశగానే నడుచుకుంటూ వస్తుంది.

శాలినికి చంద్రకళ కనిపిస్తుందేమో అన్న ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. అయితే సరిగ్గా అదే క్షణంలో ఒక స్ట్రెచర్, నర్సులు అడ్డుగా వెళ్లడంతో శాలిని కంటికి చంద్రకళ, మదన్‌లు కనిపించకుండా పోతారు.

చంద్రకళకు విరాట్ షాక్

తర్వాత విరాట్‌కు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. విరాట్‌ను తీసుకొస్తారు. సర్జరీ సక్సెస్ అయిందని డాక్టర్స్ చెప్పడంతో చంద్రకళ తెగ సంబరపడిపోతుంది. విరాట్ మొహానికి ఉన్న బ్యాండేజ్ తీస్తారు. విరాట్ రూపం మారిపోతుంది. వేరే కొత్త వ్యక్తి ఉంటాడు.

విరాట్ దగ్గరికి బావ అంటూ చంద్రకళ సంతోషంగా వెళ్తుంటే.. ఎవరు నువ్వు అని అడుగుతాడు. దాంతో చంద్రకళ షాక్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks