Ninnu kori September 18 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అత్యంత నాటకీయ మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విరాట్ (సామ్రాట్) జ్ఞాపకశక్తి కోల్పోవడంతో ఇంటి సభ్యుల ప్రవర్తన, మరోవైపు ఊరి జనాల రాకతో కథలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మూడు నెలల గడువు

కనిపించకుండా పోయిన విరాట్ కోసం జగదీశ్వరి బాధపడుతుంది. అయితే తాను ఎలాగైనా విరాట్ ను తీసుకొస్తానని అత్త జగదీశ్వరికి చంద్ర చెప్తుంది. అయితే అందుకు జగదీశ్వరి మూడు నెలల గడువు ఇస్తుంది. మూడు నెలల తరువాత ఎట్టి పరిస్థిలోనూ ఇంటికి రావాలి అని చెబుతుంది.
సామ్రాట్ పై శ్రీజ ప్రేమ
మరోవైపు దాక్షాయణి నివాసంలో సామ్రాట్ ముఖంపై ఉన్న విరాట్‌పై శ్రీజ అతిగా ప్రేమ కురిపిస్తుంది. అతనికి కాఫీ ఇస్తుంది. దీంతో విరాట్ కు కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో నీలగిరి, గిరిజలు ఎంట్రీ ఇస్తారు.
"శ్రీజను పెళ్లి చేసుకునే సమయానికే నువ్వు కనపడకుండా పోయావు" అని చెప్పడంతో విరాట్ షాక్ అవుతాడు. అయితే విరాట్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్.. అతడికి చంద్ర, మదన్ కేర్‌టేకర్లుగా ఉండాలని సూచిస్తాడు.
శ్రీజ వార్నింగ్
చంద్ర తన భార్యే అనే సంగతి మర్చిపోయిన విరాట్.. చంద్రను చూసి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతాడు. విరాట్ కూడా చంద్రపై ప్రత్యేక నమ్మకం చూపిస్తాడు."నువ్వు నా కోసం వచ్చావు, లేకపోతే నేను ఏమైపోయేవాడినో" అని ఆందోళన వ్యక్తం చేస్తాడు. చంద్ర, మదన్ వల్ల సామ్రాట్‌కు మేలు జరుగుతోందని భావించిన దాక్షాయణి.. వాళ్లను ఇంట్లోనే ఉండుమంటుంది.
కానీ మరోవైపు సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ పై శ్రీజకు ప్రేమ ఉంటుంది. అందుకే ఆమె చంద్రకు వార్నింగ్ ఇస్తుంది. "నా కాబోయే భర్తతో చనువుగా ఉండొద్దు" అంటూ శ్రీజ చంద్రను హెచ్చరించడం కొత్త వివాదానికి దారితీసేలా ఉంది.
దేవుడిలా సామ్రాట్
{{/usCountry}}కానీ మరోవైపు సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ పై శ్రీజకు ప్రేమ ఉంటుంది. అందుకే ఆమె చంద్రకు వార్నింగ్ ఇస్తుంది. "నా కాబోయే భర్తతో చనువుగా ఉండొద్దు" అంటూ శ్రీజ చంద్రను హెచ్చరించడం కొత్త వివాదానికి దారితీసేలా ఉంది.
దేవుడిలా సామ్రాట్
{{/usCountry}}మరోవైపు సామ్రాట్ (విరాట్)ను చూడటానికి ఊరి రైతులు, ప్రజలు గుంపుగా తరలివస్తారు. వారిలో ఒక వృద్ధుడు.. "మా భూములను ఆక్రమించుకోకుండా అండగా నిలిచావు, నువ్వు దేవుడివి బాబూ" అంటూ సామ్రాట్ పై ప్రశంసలు కురిపిస్తాడు. అయితే గతం గుర్తులేని విరాట్ ఈ మాటలకు ఎమోషనల్ అవుతాడు.
ఇది చూసిన చంద్ర.. "ఇంత మంచి మనిషిని ఆరోజు దారుణంగా చంపాలనుకున్న ఆ అసలు శత్రువు ఎవరు?" అని ఆలోచనలో పడుతుంది.
తమ్ముడికి చెప్పుకోవాలని
తనకు గతం గుర్తులేనందున సమస్యలన్నీ తన తమ్ముడికి చెప్పుకోవాలని విరాట్ చెప్తుంది. దీంతో నీలగిరి, గిరిజలలో అసహనం వ్యక్తమవుతుంది. పరిస్థితిని గమనించిన దాక్షాయణి విరాట్‌కు ఎక్కువ స్ట్రెస్ మంచిది కాదని చెప్పి ఊరి జనాలను పంపించివేస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో సామ్రాట్ గతం ఎప్పుడు బయటపడుతుంది, శ్రీజ కుట్రలను చంద్ర ఎలా తిప్పికొడుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది.