Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వీట్‌లో మత్తుమందు కలిపి మదన్ తినేలా చేస్తారు కామాక్షి, శ్రుతి. ఆ తర్వాత మదన్ వాష్‌రూమ్ నుంచి రాగానే దుప్పటి కప్పి తమ ప్లాన్ అమలు చేస్తారు కామాక్షి, శ్రుతి.
మదన్ కిడ్నాప్

ఎనర్జీ కోసం గ్లూకోజ్ అని చెప్పి మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి అతడిని స్పృహ తప్పేలా చేశారు. నిశ్చితార్థ ముహూర్తం దాటిపోయే వరకు అతడిని దుప్పటి మూట కట్టి స్టోర్ రూమ్‌లో దాచాలని నిర్ణయించుకుంటారు తల్లీకూతుళ్లు. ఇంతలో తలపై దెబ్బ తగిలి స్పృహలోకి వచ్చిన మందర అక్కడికి వచ్చి, తన జ్యూస్‌లో మత్తు మందు కలపడం, ఉంగరాలు దొంగిలించడం చూడటం గుర్తు చేసుకుంటుంది.
అందరిముందు ఇదే చెప్పి తన తలపై కామాక్షి, శ్రుతిలే కొట్టి చేశారని ఆరోపిస్తుంది మందర. అయితే శ్రుతి చాకచక్యంగా స్పందిస్తూ, గతంలో "భర్త వదిలేసిన వాళ్లు శుభకార్యం పనులు చేయకూడదు" అని మందర అన్న మాటలనే గుర్తుచేసి ఆమెను అక్కడ నుంచి పంపించేసింది. ఆ తర్వాత కామాక్షి, శ్రుతి ఇద్దరూ కలిసి మదన్‌ను స్టోర్ రూమ్‌లోకి లాక్కెళ్లి డోర్ లాక్ చేసి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.
ఆగిపోయిన నిశ్చితార్థం - విరాట్ రచ్చ
మదన్ కనిపించడు. తాళ్లతో కట్టేసి మదన్‌ను కిడ్నాప్ చేస్తారు శ్రుతి, కామాక్షి. నిశ్చితార్థ ముహూర్తానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో పంతులుగారితో సహా ఇంట్లోని వారంతా తీవ్ర కంగారు పడ్డారు. ఎవరూ స్టోర్ రూమ్ వైపు వెళ్లకుండా కామాక్షి అత్యంత చాకచక్యంగా అందరినీ డైవర్ట్ చేస్తుంటుంది. ఇక శ్రుతి తల్లికి తోడుగా నిలుస్తుంది.
విరాట్, రఘురామ్‌లు ఇల్లంతా వెతికినా మదన్ కనిపించడు. దాంతో "నా భయానికే మదన్ పారిపోయాడు" అని విరాట్ అందరి ముందు అంటాడు. ముహూర్తం సమయం దాటిపోవడంతో పంతులుగారు సంభావన తీసుకుని, ఇక నెల రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో తమ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మాయ, శాలిని, మందరలు తీవ్రంగా నిరాశ చెందుతారు.
{{/usCountry}}విరాట్, రఘురామ్‌లు ఇల్లంతా వెతికినా మదన్ కనిపించడు. దాంతో "నా భయానికే మదన్ పారిపోయాడు" అని విరాట్ అందరి ముందు అంటాడు. ముహూర్తం సమయం దాటిపోవడంతో పంతులుగారు సంభావన తీసుకుని, ఇక నెల రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో తమ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మాయ, శాలిని, మందరలు తీవ్రంగా నిరాశ చెందుతారు.
{{/usCountry}}చంద్రకళ నిశ్చితార్థం ఆగిపోయిందని, తనకు అన్యాయం జరిగిందని కావాలనే పైకి ఎడుస్తూ లోలోపల మాత్రం సంతోషిస్తుంది. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసిన కామాక్షి, శ్రుతికి మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటుంది చంద్రకళ. విరాట్ వచ్చిన అతిథులందరినీ పంపించేసి ఆనందంతో డాన్స్ చేస్తాడు.
బయటపడ్డ నిజం - విరాట్ స్ట్రాంగ్ కౌంటర్
కొద్దిసేపటికి స్టోర్ రూమ్‌లో బంధించిన మదన్ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వింటారు. స్టోర్ రూమ్ నుంచే కేకలు వినిపిస్తున్నాయని వెళ్లి మదన్‌ను బయటకు తీసుకొస్తారు. కామాక్షి, శ్రుతిలే తనకు మత్తు మందు ఇచ్చి బంధించారని మదన్ నిజం చెప్పేస్తాడు. అందరిముందు కామాక్షి, శ్రుతి దొరికిపోవడంతో విరాట్‌పై నింద వేస్తారు.
విరాట్ బెదిరించడం వల్లే తాము ఇలా చేశామని కామాక్షి, శ్రుతి అంటారు. దానికి విరాట్‌ను తప్పుబడతారు చంద్రకళ, మదన్. అయితే విరాట్ "నేను ఎదురుగా వచ్చి నరికేస్తాను తప్ప ఇలాంటి వెన్నుపోటు పనులు చేయను" అని మాస్ కౌంటర్ ఇస్తాడు విరాట్. అలాగే "దమ్ముంటే ఇప్పుడు చేసుకో ఎంగేజ్‌మెంట్" అని చంద్రకళకు సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విరాట్.
డబ్బు గుంజమన్న పాకెట్ పవన్
మరోవైపు నిశ్చితార్థం ఆగిపోవడంతో ఈ గ్యాప్‌లో ఇంట్లో ఎవరినైనా బురిడీ కొట్టించి వీలైనంత డబ్బు గుంజమని మదన్‌కు ఫోన్ చేసి సలహా ఇస్తాడు పాకెట్ పవన్. మరోవైపు డాక్టర్‌ను క్రాంతి కలుస్తాడు. జగదీశ్వరి చికిత్సకు 'స్టెమ్ సెల్' ఉపయోగపడుతుందని క్రాంతికి డాక్టర్ చెబుతాడు.
మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్‌తో జెనెటిక్ కాంపాటబిలిటీ టెస్ట్ చేసి, మ్యాచ్ పర్సంటేజ్ బాగుంటే చికిత్స ప్రారంభించవచ్చని డాక్టర్ వివరిస్తాడు. ఈ టెస్ట్‌కు మాయ ఒప్పుకోగా, మ్యాచ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చి టెస్ట్ సక్సెస్ అవ్వాలని, జగదీశ్వరి త్వరగా కోలుకోవాలని చంద్రకళ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.