...
...
Next Story

Ninnu Kori September 8 Episode: నిన్ను కోరి- కోమాలోకి విరాట్, ప్లాస్టిక్ సర్జరీ- జీవచ్ఛవంలా చంద్రకళ- క్రాంతి వార్నింగ్

Ninnu Kori Serial September 8th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 8వ ఎపిసోడ్‌‌లో ఘోరమైన ట్విస్ట్ ఎదురైంది. విరాట్‌కు యాక్సిడెంట్ అయి రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. చివరికి కోమాలోకి వెళ్లిన విరాట్ బతికే అవకాశాలు తక్కువ అని, ప్లాస్టిక్ సర్జరీ చేసిన పూర్తి ముఖం రాదని చెబుతారు.

Published on: Sep 8, 2026, 05:31:37 IST
Advertisement

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. మాయ ప్రయాణిస్తున్న ఆటోను పట్టుకోవాలనే తాపత్రయంతో విరాట్ తన కారులో వేగంగా వెంబడిస్తాడు. అసలు ఇదంతా మాయ ఎందుకు చేస్తుందని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు విరాట్.

రక్తపు మడుగులో విరాట్

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్

సరిగ్గా మాయను చేరుకునే సమయానికి, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక భారీ లారీ విరాట్ కారును చాలా బలంగా ఢీకొడుతుంది. ఈ ఘోర ప్రమాదంలో విరాట్ కారు నుజ్జునుజ్జు అవుతుంది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న విరాట్‌కు తీవ్రంగా గాయాలు అవుతాయి. ఒంటినిండా గాయాలతో, రక్తపు మడుగులో విరాట్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు.

అదే సమయంలో విరాట్‌కు భార్య చంద్రకళ నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ చంద్రకళ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ప్రాణాలను అరచేతిలో పట్టుకున్న విరాట్ ఎలాగైనా చంద్రకళకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తాడు.

నిజం చెప్పేలోపే స్పృహతప్పిన విరాట్

"ఆ కడుపులో ఉన్నది నీ బిడ్డే" అని చంద్రకళతో విరాట్ అంటుంటాడు. కానీ, ఆ మాటలు సరిగా చంద్రకళకు అర్థం కావు. ఏమంటున్నారండీ... నాకు సరిగా అర్థం కావట్లేదు అని చంద్రకళ అంటుంది. మళ్లీ చెప్పేందుకు విరాట్ ప్రయత్నిస్తాడు.

కానీ, ఆ మాట నోటి దాకా రాకముందే స్పృహతప్పి పడిపోతాడు విరాట్. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫోన్ తీసుకుని చంద్రకళకు అసలు విషయాన్ని తెలియజేస్తారు. ఇతనెవరమ్మా, ఇక్కడ పెద్ద యాక్సిటెండ్ అయింది, హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని చంద్రకళకు చెబుతారు. దాంతో చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

గుండె పగిలేలా ఏడ్చిన చంద్ర

డాక్టర్‌తో ఎలాగైన విరాట్‌ను బతికించమని, ఎంత ఖర్చు అయిన పర్వాలేదని, స్పెషలిస్టులను తీసుకురమ్మని చంద్రకళ అంటుంది. రక్తం చాలా పోయింది, కొన్ని టెస్టులు చేస్తే తప్పా పరిస్థితి ఏంటనేది చెప్పలేమని డాక్టర్ అంటాడు. అనంతరం విరాట్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

కోమాలోకి విరాట్.. బతికే అవకాశాలు తక్కువ

విరాట్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు చంద్రకళ వాళ్లను కలుస్తారు. విరాట్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అతను కోమాలోకి వెళ్లాడని డాక్టర్లు వెల్లడిస్తారు. దాంతో చంద్రకళ నిర్ఘాంతపోతుంది. అంతేకాకుండా విరాట్ ముఖం పూర్తిగా దెబ్బతిని గుర్తుపట్టలేని స్థితిలో ఉందని, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెబుతాడు.

దాంతో చంద్రకళ గుండె మరింత ముక్కలవుతుంది. ఒకవేళ విరాట్ కోలుకున్నా, పాత ముఖం రాదని, ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే శరణ్యమని డాక్టర్ చెబుతాడు. దాంతో చంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. హాస్పిటల్‌లోనే కుప్పకూలిపోయిన చంద్రకళ జీవచ్ఛంలా అవుతుంది.

శాలిని పక్కా స్కెచ్.. క్రాంతి వార్నింగ్

మరోవైపు ఇంట్లో విరాట్, మాయ ఇద్దరూ కనిపించకపోవడంతో కామాక్షి, శ్రుతి ఇద్దరూ కలిసి రకరకాల ప్రచారాలు మొదలుపెడతారు. విరాట్, మాయ ఇద్దరు కలసి పారిపోయారని తల్లికూతుళ్లు కామాక్షి, శ్రుతి అనుకుంటారు. ఆ మాటలు విన్న క్రాంతి కోపంతో ఊగిపోతాడు. తల్లికూతుళ్లు ఇద్దరిని వారిస్తాడు.

తన అన్నయ్య విరాట్ అలాంటివాడు కాదని వారిస్తాడు క్రాంతి. మరోవైపు విరాట్‌కు ఈ యాక్సిడెంట్ చేయించింది శాలిని అని రివీల్ అవుతుంది. విరాట్ యాక్సిడెంట్ వీడియోను శాలినికి రౌడీ పంపిస్తాడు. అది చూసిన శాలిని సైకోలా ఆనందిస్తుంటుంది.

అండర్‌గ్రౌండ్‌లోకి రౌడీలు

రౌడీలకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించిన శాలిని వారిని ఎవరికి చిక్కకుండా ఉండేందుకు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లమంటుంది. దాంతో వాళ్లు అలాగే అంటారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe