...
...
Next Story

Niro Glimpse: అమ్మాయి ఎద మీద కవిత- గ్లింప్స్‌తో నీరో మూవీ ర‌చ్చ- డిజిట‌ల్‌గా వ‌దిన ర‌ష్మిక‌ మందన్న-స్టేజీపై మ‌రిది ఆనంద్

Niro Glimpse: డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో హీరోయిన్.. ఇలా అందరూ కొత్తవాళ్లతో రాబోతున్న తెలుగు మూవీ ‘నీరో’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ను ఇవాళ రిలీజ్ చేశారు. హీరోయిన్ ఎద మీద హీరో కవిత రాస్తున్న సీన్ తో ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Published on: Nov 28, 2026, 20:41:41 IST
Advertisement

Niro Glimpse: ఫేమస్ తెలుగు లిరిసిస్ట్ కల్యాణ చక్రవర్తి డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న మూవీ ‘నీరో’. ఈ మూవీ కోసం అందరూ కొత్తవాళ్లు ఒక్క చోట చేరారు. కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరోహీరోయిన్లతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇవాళ (నవంబర్ 28) రిలీజైంది.

నీరో గ్లింప్స్

అమ్మాయి ఎద మీద కవిత- గ్లింప్స్‌తో నీరో మూవీ ర‌చ్చ- డిజిట‌ల్‌గా వ‌దిన ర‌ష్మిక‌ మందన్న-స్టేజీపై మ‌రిది ఆనంద్ (x/iamRashmika)
అమ్మాయి ఎద మీద కవిత- గ్లింప్స్‌తో నీరో మూవీ ర‌చ్చ- డిజిట‌ల్‌గా వ‌దిన ర‌ష్మిక‌ మందన్న-స్టేజీపై మ‌రిది ఆనంద్ (x/iamRashmika)

నీరో గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఓ సీనే అందుకు కారణం. తగలబడిపోతున్న భవనంలో ఊయలపై పడుకొని ఉన్న హీరోయిన్ ఎదపై హీరో కవిత రాయడం మామూలుగా లేదు.

‘‘ప్రేమంటే.. షాజహాన్ కట్టిన తాజ్ మహల్ కాదు.. తాజ్ మహల్ కట్టిన షాజహాన్’’ అని అమ్మాయి ఎద మీద హీరో రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

డిజిటల్ గా వదిన రష్మిక మందన్న

నీరో మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను డిజిటల్ గా వదిన రష్మిక మందన్న రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్ కు ఏమో మరిది ఆనంద్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇంకా దిల్ రాజు, బోయపాటి శ్రీనివాస్ తదితరులు కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ అయి కొత్త టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అందరూ కొత్తవాళ్లే

ఇక ఈ నీరో సినిమాతో అరవింద్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అర్చన్ అయ్యర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇంకా ఈ మూవీలో హారిక నారాయణ్, సీనియర్ నటుడు శివాజీ, రఘు కుంచె తదితరులు నటిస్తున్నారు.

గ్లింప్స్ రియాక్షన్ వైరల్

నీరో గ్లింప్స్ పై సోషల్ మీడియాలో రియాక్షన్స్ వైరల్ గా మారాయి. ఇదెక్కడి కొత్త కాన్సెప్ట్ మామ, కొత్త డైరెక్టర్ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది, కొత్త హీరోకు ఇంట్రడక్షన్ ట్రైలర్ మామూలుగా లేదు, ఎదపై కవిత ఎంటి భయ్యా? అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మొత్తానికి నీరో మూవీ అయితే ఫస్ట్ గ్లింప్స్ తో సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా నుంచి మిగతా అప్డేట్స్ ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks