Alias Rukmini NIthiin: హీరో నితిన్ (Nithiin) ఎప్పుడూ తనదైన స్టైల్, ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈసారి నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రాబోతున్నారు. నాని సొంత బ్యానర్ 'యునానిమస్ ప్రొడక్షన్స్' లో నితిన్ హీరోగా దర్శకుడు మురళీ కాంత్ దేవాసోత్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'అలియాస్ రుక్మిణి'.
కుర్రాడిలా నితిన్

అలియాస్ రుక్మిణి మూవీ నుంచి ఇవాళ (నవంబర్ 7) హీరో నితిన్ కు సంబంధించిన ఓ క్రియేటివ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నితిన్ పదో తరగతి మ్యాథ్స్ మాస్టర్ 'కృష్ణ' అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్యారెక్టర్ కు సంబంధించిన యంగర్ లుక్ ను ఇవాళ మేకర్స్ పరిచయం చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ లుక్ లో నితిన్ పూర్తిగా గడ్డం తీసేసి, కేవలం మీసాతో యంగ్ కుర్రాడిలా మారిపోయాడు. తన కమ్ బ్యాక్ కోసం ఈ సినిమాపై నితిన్ ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాడో ఈ మేకోవర్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు దశాబ్దం క్రితం తన పాత సినిమాల్లో ఎలా ఉండేవాడో.. అచ్చు గుద్దినట్లు అలానే ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.
టైమ్ మెషిన్ లో వెళ్లొచ్చారా?
ఈ సరికొత్త యంగర్ లుక్ కు సంబంధించిన వీడియోలో ఒక క్యూట్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ క్యారెక్టర్ గెటప్ తో ఉన్న నితిన్.. సడెన్ గా వెళ్లి అలియాస్ రుక్మిణి హీరోయిన్ ఆఫియా సయ్యద్ కు సర్ ప్రైజ్ ఇస్తారు. నితిన్ ను అలా ఆ రూపంలో చూడగానే హీరోయిన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది.
"ఏంటి అలా మారిపోయారు? టైమ్ మెషిన్ లోకి ఏమైనా వెళ్లొచ్చారా?" అంటూ ఆమె షాక్ అవ్వడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
{{/usCountry}}"ఏంటి అలా మారిపోయారు? టైమ్ మెషిన్ లోకి ఏమైనా వెళ్లొచ్చారా?" అంటూ ఆమె షాక్ అవ్వడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
{{/usCountry}}ప్రస్తుతం నితిన్ కొత్త లుక్ కు సంబంధించిన ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ లుక్ ను తెగ షేర్ చేస్తున్నారు. "మన మాస్ మాస్టారు మళ్లీ కుర్రాడైపోయాడు" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 'బేబీ' మూవీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
బౌండరీస్ లేని బోల్డ్ అండ్ ఎమోషనల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాని జడ్జిమెంట్, మురళీ కాంత్ టేకింగ్ పక్కాగా వర్కవుట్ అవుతాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ కృష్ణ మాస్టారు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.