Niti Taylor On Ex Boyfriend In Alliance OTT Show:

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే సెలబ్రిటీల జీవితాల వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. వెండితెరపై లేదా బుల్లితెరపై ఎంతో సంతోషంగా కనిపించే నటీమణులు.. తమ వ్యక్తిగత జీవితంలో ఎంతటి నరకాన్ని అనుభవిస్తారో తెలిపే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
హిందీలో స్టార్ ఇమేజ్
తాజాగా హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోయిన్ నీతి టేలర్ తన జీవితంలోని అత్యంత భయంకరమైన రోజులను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తను ఒక క్రూరమైన, హింసాత్మక రిలేషన్‌షిప్‌లో ఉండిపోయానని, ఆ సమయంలో తన మాజీ ప్రియుడు పెట్టిన టార్చర్ వర్ణనాతీతమని వెల్లడించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సరికొత్త రియాలిటీ గేమ్ షో 'అలయన్స్' (Alliance) లో నీతి టేలర్ ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ ఓటీటీ షోలో భాగంగా తోటి కంటెస్టెంట్లు మినీ మాథుర్, రూహీ దోసాని, దెల్బార్ ఆర్యలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన పాత లవ్ స్టోరీలోని చేదు నిజాలను పంచుకున్నారు. ఆ నరకం నుంచి తను ఎలా బయటపడిందో వివరించారు.
పుట్టినరోజు నాడే నరకం చూపించాడు!
ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నీతి టేలర్ తన శరీరంపై ఆ కాలంలో పడిన గాయాన్ని కూడా చూపించారు. "నా మాజీ ప్రియుడు ఒకసారి నన్ను సిగరెట్‌తో కాల్చాడు. అతను తీవ్రమైన హింసా ప్రవృత్తి ఉన్న సైకో. అతని పుట్టినరోజు నాడే ఒక రాత్రి పిచ్చివాడిలా ప్రవర్తించాడు. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దాంతో ఇక చాలు అనుకుని అతనికి గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను" అని నీతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ వయసులో మనుషులను అంచనా వేయడం చేతకాక మోసపోయానని ఆమె అన్నారు. "అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. మానసికంగా ఎదగని వయసు కావడం వల్ల అవతలి వ్యక్తి బుద్ధిని సరిగ్గా గ్రహించలేకపోయాను. అతను నిజంగానే ఒక ఉన్మాది" అని నీతి టేలర్ పేర్కొన్నారు.
వైవాహిక జీవితంపై వస్తున్న రూమర్లు
{{/usCountry}}ఆ వయసులో మనుషులను అంచనా వేయడం చేతకాక మోసపోయానని ఆమె అన్నారు. "అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. మానసికంగా ఎదగని వయసు కావడం వల్ల అవతలి వ్యక్తి బుద్ధిని సరిగ్గా గ్రహించలేకపోయాను. అతను నిజంగానే ఒక ఉన్మాది" అని నీతి టేలర్ పేర్కొన్నారు.
వైవాహిక జీవితంపై వస్తున్న రూమర్లు
{{/usCountry}}నీతి టేలర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె 2019 ఆగస్టులో పరిక్షిత్ బవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఏడాది తర్వాత అంటే 2020 ఆగస్టు 13న వీరి వివాహం జరిగింది. అయితే 2024 లో వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. వీటిపై నీతి చాలా కాలం పాటు మౌనంగా ఉన్నారు.
"మనం స్పందించకుండా మౌనంగా ఉండటమే అన్నింటికీ సమాధానం. అక్కడ ఏమీ జరగనప్పుడు, ప్రతి విషయానికి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు" అని తాజాగా ఈ ఊహాగానాలపై స్పందిస్తూ నీతి టేలర్ క్లారిటీ ఇచ్చారు.
బుల్లితెరపై స్టార్ స్టేటస్
కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన నీతి టేలర్.. 2009లో వచ్చిన 'ప్యార్ కా బంధన్' సీరియల్ ద్వారా టెలివిజన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన 'కైసీ యే యారియాన్' సీరియల్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో నందిని మూర్తి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
పార్థ్ సమథాన్‌తో ఆమె కెమిస్ట్రీ బుల్లితెరపై సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచి, నీతిని ప్రతి ఇంట్లో ఒక మెంబర్‌లా మార్చేసింది. 'గులామ్', 'ఇష్క్‌బాజ్', 'ఝలక్ దిఖ్లా జా 10' వంటి పాపులర్ షోలలో నటించిన నీతి.. చివరగా 2023 లో 'బడే అచ్చే లాగ్తే హై 2' సీరియల్‌లో కనిపించారు.
తెలుగులో హీరోయిన్‌గా
అలాగే, నీతి టేలర్ తెలుగులో 2012లో మేము వయసుకు వచ్చాం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో రాహుల్ రవీంద్రన్ హీరోగా పెళ్లి పుస్తకం, 2014లో లవ్ డాట్ కామ్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది.