రేపు కాదు.. ఆ రోజే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

రేపు (ఫిబ్రవరి 2) ఉదయ్ పుర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరగబోతుందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి రేపు జరగడం లేదన్నది లేటెస్ట్ అప్ డేట్. 

Published on: Feb 1, 2026, 17:48:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి రేపే (ఫిబ్రవరి 2).. ఉదయ్ పుర్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. వీడియోలు బయటకొచ్చాయి.. ఇలా ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ గా మారాయి. సోమవారం రష్మిక, విజయ్ పెళ్లి జరుగుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి నిజంగానే పుకార్లు అని తేలింది. రష్మిక, విజయ్ పెళ్లి డేట్ రేపు కాదనేది లేటెస్ట్ అప్ డేట్.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (instagram-thedeverakonda)
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (instagram-thedeverakonda)

రష్మిక, విజయ్ పెళ్లి

గత కొంతకాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారు. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేకున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే వీళ్ల పెళ్లి డేట్ విషయంలో మాత్రం రూమర్లు బలంగా వినిపించాయి. ఫిబ్రవరి 2న ఉదయ్ పుర్ లో వీళ్ల వెడ్డింగ్ ఘనంగా జరగబోతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

వెడ్డింగ్ డేట్

అయితే రష్మిక, విజయ్ పెళ్లి డేట్ ఫిబ్రవరి 2 కాదు ఫిబ్రవరి 26 అన్నది లేటెస్ట్ గా వచ్చిన సమాచారం. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేసింది.

‘‘విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న జరగబోతుందని మా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుంది. ఫిబ్రవరి 2న వీళ్ల వివాహం జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. కానీ అవి కరెక్ట్ కాదు. అందుకే ఈ సమాచారం’’ అని ఫిల్మ్ ఫేర్ ఎక్స్ లో పోస్టు చేసింది.

ఫిల్మ్ ఫేర్ ఎక్స్ పోస్టు (x/filmfare)
ఫిల్మ్ ఫేర్ ఎక్స్ పోస్టు (x/filmfare)

రష్మిక, విజయ్ లవ్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడో మూవీ చేస్తున్నారు. వీళ్లు జంటగా కలిసి చేసిన ఫస్ట్ మూవీ గీత గోవిందం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ మొదలైంది.

ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. ఈ సినిమాతో రష్మిక, విజయ్ ప్రేమ మరింత ముదిరింది. ఆ తర్వాత ఈ జంట తరచుగా కలిసి బయట కనిపించింది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం, వెకేషన్లకు వెళ్లడంతో వీళ్ల రిలేషన్ షిప్ పై ఊహాగానాలు పెరిగాయి.

పెళ్లి వరకు

రష్మిక, విజయ్ గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఫిబ్రవరి లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పడు ఈ జంట ముచ్చటగా తమ మూడో సినిమా రణబాలిలో కలిసి నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ ను రీసెంట్ గా రివీల్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More