O Na Ramayya Song Lyrics: తెలంగాణ జానపద పాటలకు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. సినిమా సాంగ్స్ కంటే ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో కోట్ల కొద్ది వ్యూస్ కొల్లగొడుతున్నాయి. అలాంటిదే ఈ ‘ఓ నా రామయ్య’ సాంగ్ కూడా. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన ఈ పాట ఇంటర్నెట్ ను మామూలుగా షేక్ చేయడం లేదు.
ఓ నా రామయ్య సాంగ్ లిరిక్స్

జానపదం ప్లస్ భక్తి కలగలిపి ఈ ఓ నా రామయ్య సాంగ్ సాగుతుంది. హుషారైన బీట్ కు తగ్గట్లు నర్సన్న వాయిస్ మ్యాజిక్ చేసింది. ఈ పాటను బూతం రమేష్ రాశారు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రైవేట్ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.
పల్లవి
ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య
అది ఎండి కోలా ఓ నా రామయ్య.. 2
బాయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ
అది బంగరు కోలా ఓ నా సీతమ్మ.. 2
కట్టరా కాలు గజ్జె
కొట్టరా డప్పు దరువు
వెయ్యరా కాలు అడుగు సిర్రతో చిటికెర
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర
రావయ్యా జంగమా ఆహా లింగమా.. 2
చరణం 1
బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య
అది ముక్తి భజన ఓ నా రామయ్య.. 2
సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ
అది గజ్జెల భజన ఓ నా సీతమ్మ.. 2
{{/usCountry}}అది గజ్జెల భజన ఓ నా సీతమ్మ.. 2
{{/usCountry}}పట్టరా భజనలు
కొట్టరా చిడతలు
వెయ్యరా అడుగులు
భక్తితో చిందులు
బలే బలే బలే బలే బలే బలే హా
హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర
లేవయ్యా శంకరా మా భోలా శంకర.. 2
చరణం 2
పెద్దలు ఏసేటి కోల పరమేశ్వర కోలా ఓ నా రామయ్య
పరమాత్మ కోలా ఓ నా రామయ్య.. 2
బాలలు యేసేటి కోల భగవంతుని కోలా ఓ నా సీతమ్మ
భలే భక్తి కోలా ఓ నా సీతమ్మ.. 2
కొట్టరా కోలాటం
అల్లరా జడలల్లిక
వెయ్యరా జడ కొప్పు
సీతమ్మ సిక్కు రా
అరే అరే అరే అరే
రామా రామా మూర్తి రామమూర్తి లెగుమా ఓహో శ్రీ రామ
రావయ్యా లక్ష్మణా ఆహా జై రామ.. 2
చరణం 3
భక్తుల్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య
అది భక్తుల భజన ఓ నా రామయ్య.. 2
వీరుల్లేసే భజన అది వీర భజన ఓ నా సీతమ్మ
విశ్వమంత భజన ఓ నా సీతమ్మ.. 2
పూజలే చేయాలే
పుణ్యమే జరగాలే
పాపమే పోవాలే
దోషమే తొలగాలే
ఆడే డే డే డే
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర
రావయ్యా జంగమ ఆ ఆహా లింగమా.. 2