...
...
Next Story

OTT: ఓటీటీలోకి నయా మిస్టరీ థ్రిల్లర్- గృహిణి అదృశ్యం, డిటెక్టివ్‌లుగా మారే కాలనీవాసులు- ఆక్టోపస్ చేతుల్లా ట్విస్టులు!

OTT Mystery Thriller Octopus Trailer Released: ఓటీటీలోకి రానున్న ఉత్కంఠభరితమైన మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అశ్విన్ కుమార్, అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో జయచంద్ర హష్మీ తెరకెక్కించిన ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 15, 2026, 19:45:07 IST
Advertisement

OTT Mystery Thriller Octopus Trailer Released: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా బలమైన కథనం ఉంటే చాలు మన ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో 'సుడల్', 'విలంగు' వంటి తమిళ థ్రిల్లర్ సిరీస్‌లు తెలుగు నాట కూడా భారీ ఆదరణ దక్కించుకున్నాయి.

ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్

ఓటీటీలోకి నయా మిస్టరీ థ్రిల్లర్- గృహిణి అదృశ్యం, డిటెక్టివ్‌లుగా మారే కాలనీవాసులు- ఆక్టోపస్ చేతుల్లా ట్విస్టులు!
ఓటీటీలోకి నయా మిస్టరీ థ్రిల్లర్- గృహిణి అదృశ్యం, డిటెక్టివ్‌లుగా మారే కాలనీవాసులు- ఆక్టోపస్ చేతుల్లా ట్విస్టులు!

ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ 'ఆక్టోపస్' (Octopus) ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 27 నుంచి ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆక్టోపస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

డిటెక్టివ్‌లుగా మారిన సాధారణ కాలనీ వాసులు

జయచంద్ర హష్మీ రచన, దర్శకత్వంలో రూపొందిన 'ఆక్టోపస్' ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండే ఒక సాధారణ నివాస ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కాలనీలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతుంది. కొత్తగా ఆ కాలనీలోకి అడుగుపెట్టిన వరుణ్, నిఖిత దంపతుల్లో నిఖిత అకస్మాత్తుగా మాయమవడంతో ఆ ప్రాంతంలో కలకలం మొదలవుతుంది.

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతారు. కానీ, ఇక్కడ ఆ కాలనీ వాసులే స్వయంగా రంగంలోకి దిగి ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ అనుభవం లేని సామాన్య ప్రజలు.. తమ పరిశీలన శక్తి, స్థానిక పరిచయాల ఆధారంగా ఆధారాలను సేకరిస్తూ డిటెక్టివ్‌లుగా మారిపోతారు. చుట్టుపక్కల ఉండే కాలనీ వాసులే ఫ్యామిలీగా మారి చేసే విచారణలో అడుగడుగునా ఊహించని మలుపులు ఎదురవుతాయి.

ఉత్కంఠతో పాటు వినోదం కూడా!

ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఒకవైపు భయాన్ని, ఉత్కంఠను కలిగిస్తూనే మరోవైపు సున్నితమైన హాస్యాన్ని కూడా పంచుతాయి. సాధారణ వ్యక్తులు ఒక అసాధారణ రహస్యంతో ముడిపడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు.

మొత్తం ఏడు ఎపిసోడ్లుగా (U/A 16+ రేటింగ్) ఈ ఓటీటీ సిరీస్‌ను తీర్చిదిద్దారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో కాలనీలు, అపార్ట్‌మెంట్లలో ప్రజలు పరిమిత వాతావరణంలో జీవించిన తీరును చూసి ఈ కథ రాసుకున్నట్లు దర్శకుడు వెల్లడించారు. "ఒక సాధారణ గృహిణి అదృశ్యం చుట్టూ మొదలైన కథ, ఆక్టోపస్ చేతుల్లా ఊహించని మలుపులు తిరుగుతూ విస్తరిస్తుంది" అని దర్శకుడు జయచంద్ర హష్మీ పేర్కొన్నారు.

బలమైన తారాగణం, సాంకేతిక బృందం

ఈ సిరీస్‌లో అశ్విన్ కుమార్, అర్చన రవిచంద్రన్, సిద్ధు కుమరేశన్, వినోద్ కిషన్, కలైవాణి భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. రొమాంటిక్ పాత్రలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ కుమార్ ఇందులో విభిన్నమైన కోణంలో కనిపించనున్నారు. ఆయనకు తోడుగా అర్చన రవిచంద్రన్ కీలక పాత్రలో మెరిశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కన్నా ఆర్ సినిమాటోగ్రఫీ అందించగా, దీపన్ చక్రవర్తి సంగీతం సమకూర్చారు. రామ్ పాండియన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. శరవణ అభిరామన్ ఆర్ట్ డైరెక్టర్‌గా, గాయత్రి బి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సురేష్ బాబు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

జీ5 ఓటీటీలో ఆక్టోపస్

ముత్తుకుమార్ ఆర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, కె. రాజారామన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, చొక్కలింగం ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. బాబు కలరిస్ట్‌గా, లైట్స్ ఆన్ మీడియా సౌండ్ మిక్సింగ్, డబ్బింగ్ పనులు పూర్తి చేయగా, గణేష్ శివ ట్రైలర్ ఎడిటర్‌గా పనిచేశారు.

నవంబర్ 2026 ఓటీటీ లైనప్‌లో భాగంగా జీ5 ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తోంది. జీ5లో ఆక్టోపస్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఒక సాధారణ కాలనీలో మొదలైన ఆ యువతి అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజాన్ని డిటెక్టివ్‌లుగా మారిన కాలనీ వాసులు కనిపెట్టారా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks