...
...
Next Story

OG Peddi Chiranjeevi: పెద్ది సెట్స్‌లో ఒరిజినల్ పెద్ది మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో చూశారా?

OG Peddi Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'పెద్ది' సెట్స్ నుంచి ఒక ఆసక్తికరమైన వీడియో బయటకు వచ్చింది. 'ఒరిజినల్ పెద్ది' అంటూ రామ్ చరణే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ థ్రోబ్యాక్ వీడియో వైరల్ అవుతోంది.

Published on: May 8, 2026, 18:14:57 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OG Peddi Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం 'పెద్ది' (Peddi). ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక అదిరిపోయే థ్రోబ్యాక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒరిజినల్ పెద్ది చిరంజీవిని చూడొచ్చు.

ఒరిజినల్ పెద్ది స్టైల్ ఇదే

OG Peddi Chiranjeevi: పెద్ది సెట్స్‌లో ఒరిజినల్ పెద్ది మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో చూశారా?
OG Peddi Chiranjeevi: పెద్ది సెట్స్‌లో ఒరిజినల్ పెద్ది మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో చూశారా?

ఇన్‌స్టాగ్రామ్ లో రామ్ చరణ్ అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేశారు. "ఒరిజినల్ పెద్ది ఆన్ ద సెట్స్ ఆఫ్ పెద్ది" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ థ్రోబ్యాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పెద్ది సెట్స్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం చూడొచ్చు.

అతనితోపాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా, ఇతరులతో కలిసి సరదాగా గడపడం చూడొచ్చు. చిరు తనదైన స్టైల్లో జోకులు వేస్తూ నవ్వించారు. వీడియో చివర్లో చరణ్, సుకుమార్, బుచ్చి బాబు అందరూ తమ కండలు చూపిస్తుంటే చిరంజీవి ఫొటో తీయడం చూడొచ్చు. తన కంటే బుచ్చి బాబు కండలే బాగున్నాయని చరణ్ జోక్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద చరణ్ ర్యాంపేజ్..

ఇక పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. ఇక్కడ అప్పుడే లక్ష డాలర్ల మార్క్ దాటేసింది. గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఓజీ' ($82,681), ఎన్టీఆర్ 'దేవర' ($75,727), అల్లు అర్జున్ 'పుష్ప 2' ($52,393), ప్రభాస్ 'సలార్' ($40,324) వంటి భారీ చిత్రాలు మొదటి 24 గంటల్లో సాధించిన వసూళ్లను, పెద్ది కేవలం 4 గంటల్లోనే అధిగమించడం విశేషం. మెగా పవర్ స్టార్ మేనియా ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలే నిదర్శనం.

భారీ స్థాయిలో విడుదల.. 950కిపైగా ప్రీమియర్ షోలు

అమెరికాతో పాటు సింగపూర్, శ్రీలంక వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 3వ తేదీనే అక్కడ గ్రాండ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి.

నేషనల్ వైడ్ ప్రమోషన్స్.. ఫైనల్ ఎడిట్ సిద్ధం

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫైనల్ ఎడిట్ లాక్ చేసినట్లు సమాచారం. సినిమా అవుట్ పుట్ పట్ల చిత్ర బృందం అత్యంత ధీమాగా ఉంది. ఇక ప్రమోషన్ల విషయంలోనూ తగ్గేదే లేదన్నట్లుగా టీమ్ వ్యవహరిస్తోంది. త్వరలోనే జాతీయ స్థాయిలో భారీ ఈవెంట్లతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

"పెద్ది బాక్సాఫీస్ సునామీ ఇప్పుడే మొదలైంది. కేవలం నాలుగు గంటల్లోనే 100K డాలర్ల మార్కును అందుకోవడం అనేది రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం" అని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను ఉత్తరాంధ్ర నేపథ్యంలో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఒక సామాన్యుడు క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా శారీరక మార్పులు చేసుకున్నారు. గడ్డం, జుట్టు పెంచి పక్కా లోకల్ కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks