తరుణ్ భాస్కర్.. యూత్ సినిమాలను అందించే డైరెక్టర్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు తరుణ్. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్. ఇవాళ (జనవరి 23) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఓం శాంతి శాంతి శాంతి: ట్రైలర్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఓం శాంతి శాంతి శాంతి:. ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఫుల్ నవ్విస్తోంది ఈ ట్రైలర్. ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఏమో ఏఆర్ సజీవ్. సృజన్, ఆదిత్య, వివేక్, అనూప్, సాధిక్, నవీన్ నిర్మిస్తున్నారు. జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది మలయాళం సూపర్ హిట్ మూవీ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్.
నవ్వించేలా
ట్రైలర్ ను బట్టి చూస్తే ఓం శాంతి శాంతి శాంతి: సినిమాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వీళ్ల పెళ్లి చూపుల సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చేపల పేర్లతోనే సీన్లు సాగుతాయి. హీరో, హీరోయిన్ కు పెళ్లి తర్వాత ట్రైలర్ కాస్త ఊపందుకుంది.
భార్యను కొట్టడం
ప్రతి చిన్న విషయానికి హీరో క్యారెక్టర్ ఏమో భార్యను కొడుతుంటాడు. సిగరేట్ తాగుతూ, మందు కొడుతూ కనిపిస్తాడు. మధ్యలో రిప్ అంటే రిచ్ ఇన్ పర్సనాలిటీ అనే డైలాగ్ నవ్విస్తుంది. ఇంట్లో పనులన్నీ చేస్తూ హీరోయిన్ రోజులు గడిపేస్తుంది. కానీ ఆమెను హీరో కొడుతుండటంతో నెక్ట్స్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ కలుగుతుంది.
సీన్ రివర్స్
భర్త చేతిలో దెబ్బలు తిని విసుగెత్తి పోయిన భార్య ఒక్కసారిగా రెచ్చిపోతుంది. భర్త మీదకు పడిపోతుంది. కొట్టబోతున్న చేతిని ఆపి, ఆమె కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దీంతో సీన్ రివర్స్ అవుతుంది. భార్యకు భయపడతాడు భర్త. ప్రశాంతత కోసం ధ్యానం చేస్తుండటంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.
రిలీజ్ డేట్
{{/usCountry}}భర్త చేతిలో దెబ్బలు తిని విసుగెత్తి పోయిన భార్య ఒక్కసారిగా రెచ్చిపోతుంది. భర్త మీదకు పడిపోతుంది. కొట్టబోతున్న చేతిని ఆపి, ఆమె కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దీంతో సీన్ రివర్స్ అవుతుంది. భార్యకు భయపడతాడు భర్త. ప్రశాంతత కోసం ధ్యానం చేస్తుండటంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.
రిలీజ్ డేట్
{{/usCountry}}ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ఇదే నెలలో థియేటర్లకు రాబోతుంది. జనవరి 30న రిలీజ్ కానుంది. మరోవైపు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో కార్తీక్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అయినా మూవీలో ఆ క్యారెక్టర్ ఉంటుందని తరుణ్ భాస్కర్ క్లారిటీనిచ్చాడు.