తెలుగు బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసింది. ఈ వారం కొత్త సినిమాలు ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో ముఖ్యంగా ‘ఓం శాంతి శాంతి శాంతి:’ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. భార్యాభర్తల మధ్య లవ్, ఫైట్స్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు (జనవరి 30) రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్లు పడ్డాయి. మరి ఈ ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో చూద్దాం.
ఓం శాంతి శాంతి శాంతి: ట్విటర్ రివ్యూ

ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రీమియర్లు చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు. మెజారిటీ శాతం ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కెమిస్ట్రీ బాగుందని, మూవీ హిట్ అని తమ అభిప్రాయాలు పేర్కొంటున్నారు. మలయాళ సినిమా జయ జయ జయ జయ హేకు రీమేక్ గా తెరకెక్కినప్పటికీ ఓం శాంతి శాంతి శాంతి: ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని పేర్కొంటున్నారు.
ఆ ఫైట్ సీన్
ఓం శాంతి శాంతి శాంతి: సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా భార్యాభర్తలుగా నటించారు. ఎప్పుడూ భర్త చేతిలో దెబ్బలు తినే భార్య ఒక్కసారిగా తిరగబడితే ఎలా ఉంటుందనేది బాగా వర్కౌట్ అయింది. ‘‘మూవీ అంతా ఫుల్ గా నవ్వుకున్నాం. తరుణ్, ఈషా మధ్య ఫైట్ సీన్ అయితే కేక. బ్రహ్మాజీ వన్ లైనర్స్ అయితే మ్యాడ్ అసలు. పూర్తిగా ఎంజాయ్ చేశాం. ఓవరాల్ గా 4/5’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
నాయుడు గారు
‘‘నాయుడుగారు హిట్ కొట్టేశారండీ. రేటింగ్ 3.5/5’’ అని మరో యూజర్ పోస్టు పెట్టాడు. ఓం శాంతి శాంతి శాంతి: సినిమాలో తరుణ్ భాస్కర్ ఏమో ఓంకార్ నాయుడు క్యారెక్టర్ లో, ఈషా రెబ్బా ప్రశాంతిగా నటించారు.
{{/usCountry}}‘‘నాయుడుగారు హిట్ కొట్టేశారండీ. రేటింగ్ 3.5/5’’ అని మరో యూజర్ పోస్టు పెట్టాడు. ఓం శాంతి శాంతి శాంతి: సినిమాలో తరుణ్ భాస్కర్ ఏమో ఓంకార్ నాయుడు క్యారెక్టర్ లో, ఈషా రెబ్బా ప్రశాంతిగా నటించారు.
{{/usCountry}}తెలుగు సినిమాగా
‘‘తెలుగులో రీమేక్ అనగానే “ఇది ఎలా చేస్తారు?” అని కాస్త భయం ఉంటుంది. కానీ సినిమా అయిపోయాక ఆ భయం పూర్తిగా పోయింది. ఇది రీమేక్ అన్న విషయాన్నే మన మైండ్ నుంచి తీసేసేలా, కంప్లీట్ తెలుగు సినిమాగా తీర్చిదిద్దారు. దర్శకుడు సజీవ్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది.
తరుణ్ భాస్కర్ ను ఇప్పటివరకు తెలంగాణ యాసలోనే ఎక్కువగా చూసాం. కానీ ఇప్పుడు గోదావరి యాసలో చూడటం చాలా ఫ్రెష్‌గా ఉంది. యాసను భలే పట్టేశాడు. నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈషా.. ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే, ఇది మీ కెరీర్‌లో ఇంకో మెట్టు. నిజ జీవితంలో చాలా మంది అమ్మాయిలు మీ పాత్రలాగే మగాళ్ల వల్ల నలిగిపోతున్నారు. కోర్ట్ సీన్‌లో అమ్మాయికి ఏం కావాలో చెప్పే ఆ 3 మాటలు.. నిజంగా అవే అమ్మాయిలు కోరేది. ఆ సీన్ హార్ట్‌ని తాకుతుంది.
బ్రహ్మాజీ గారు.. “మామ మాట ముత్యాల మూట” మీరు కనిపించే ప్రతి సీన్‌లో థియేటర్ అంతా నవ్వులే. టైమింగ్, డైలాగ్ డెలివరీ పర్‌ఫెక్ట్’’ అని మరో యూజర్ ఎక్స్ లో వివరంగా తన రివ్యూ రాసుకొచ్చారు.