One Night Only: సెక్స్ కంటే పిజ్జా బెటర్‌గా ఉంది- రాత్రిలో మారిపోయే జీవితాలు- బూతులు, ముద్దులతో వన్ నైట్ ఓన్లీ ట్రైలర్!

One Night Only Trailer Released: 'ఈజీ ఏ', 'ఎనీవన్ బట్ యూ' చిత్రాల దర్శకుడు విల్ గ్లక్ తెరకెక్కించిన తాజా రొమాంటిక్ కామెడీ డ్రామా 'వన్ నైట్ ఓన్లీ'. నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో మనుషుల మధ్య తగ్గుతున్న నిజమైన సంబంధాలు, డేటింగ్ ప్రపంచంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.

Published on: Aug 6, 2026, 15:06:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

One Night Only Trailer Released: మొబైల్ స్క్రీన్లకే పరిమితమవుతున్న నేటి తరం ప్రేమలు, డేటింగ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా (వార్నర్ బ్రోస్ డిస్కవరీ) ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

సెక్స్ కంటే పిజ్జా బెటర్‌గా ఉంది- రాత్రిలో మారిపోయే జీవితాలు- బూతులు, ముద్దులతో వన్ నైట్ ఓన్లీ ట్రైలర్!
సెక్స్ కంటే పిజ్జా బెటర్‌గా ఉంది- రాత్రిలో మారిపోయే జీవితాలు- బూతులు, ముద్దులతో వన్ నైట్ ఓన్లీ ట్రైలర్!

ఆస్కార్ నామినీ మోనికా బార్బరో

'ఈజీ ఏ', 'ఎనీవన్ బట్ యూ' వంటి సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు విల్ గ్లక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆస్కార్ నామినీ మోనికా బార్బరో, బాఫ్టా నామినీ కాలమ్ టర్నర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు 'వన్ నైట్ ఓన్లీ' అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఒకే రాత్రిలో మారే జీవితాలు.. న్యూయార్క్ నేపథ్యంలో కథ

న్యూయార్క్ నగరం నేపథ్యంలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రేమలో విఫలమైన ఓవెన్ (కాలమ్ టర్నర్), జీవితంలో నిజమైన ప్రేమ కోసం ఎదురుచూసే ఆలీ (మోనికా బార్బరో) అనే ఇద్దరు అపరిచితుల చుట్టూ ఈ డ్రామా నడుస్తుంది.

చుట్టూ ఉన్న ప్రపంచమంతా తాత్కాలిక అనుబంధాల వెనుక పరిగెడుతుంటే, వీరిద్దరి మధ్య అనూహ్యంగా ఒక నిజమైన ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అయితే, అనుకోకుండా ఎదురయ్యే సరదా సంఘటనలు, గందరగోళాలు వీరిని విడదీసేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో రాత్రంతా నగరంలో సాగే వీరి ప్రయాణం, చివరకు వారికి ఏ వింత అనుభవాన్ని మిగిల్చిందనేదే అసలు కథ.

సెక్స్ కంటే పిజ్జా బెటర్

వన్ నైట్ ఓన్లీ సినిమా ట్రైలర్ అంతా బూతులు, ముద్దులతో రొమాంటిక్‌గా సాగింది. "నేను తిన్న పిజ్జాల్లో ఇదే బెస్ట్. సెక్స్ కంటే కూడా ఈ పిజ్జా చాలా బెటర్‌గా ఉంది" అని హీరోతో హీరోయిన్ చెప్పై డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రేరణనిచ్చిన అంశాలను దర్శకుడు విల్ గ్లక్ పంచుకున్నారు. నేటి సమాజంలో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల మధ్య దూరం ఎలా పెరుగుతోందో వివరించారు.

ఫోన్ స్క్రీన్ల నుంచి నిజ జీవితంలోకి.. దర్శకుడి వినూత్న ప్రయోగం

"ప్రస్తుతం మనం జీవిస్తున్న తీరును ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. చేతిలో ఉన్న ఫోన్లతో అందరితో కనెక్ట్ అవుతున్నాం. కానీ, నిజ జీవితంలో మాత్రం మనుషులకు చాలా దూరమవుతున్నాం. మనం రోజూ ఫోన్‌లో చేసే స్వైపింగ్, టెక్ట్సింగ్, మాట్లాడే విధానాన్ని ఒక 12 గంటల పాటు నేరుగా మనుషుల ముందే పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఇప్పటిలాగే ప్రవర్తిస్తామా లేక మారుతామా? అనే అంశాన్ని ఇందులో చర్చించాం" అని దర్శకుడు విల్ గ్లక్ వెల్లడించారు.

ఇది పూర్తిగా కాన్సెప్ట్ ఆధారితంగా సాగినప్పటికీ, సైన్స్ ఫిక్షన్ వాతావరణం రాకుండా సహజత్వానికి దగ్గరగా రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. మన ఇండియన్ థియేటర్లలోనూ ఈ సినిమా మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఒక కొత్త రకం అనుభూతిని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారీ తారాగణంతో మల్టీస్టారర్ సందడి

వన్ నైట్ ఓన్లీ చిత్రంలో మాయా హాక్, జూలియా ఫాక్స్, చార్లీ గిల్లెస్పీ, మిచెల్ హర్డ్, పాప్ సింగర్ కింగ్ ప్రిన్సెస్, క్వింటెస్సా స్విండెల్, ఆండ్రూ బర్నాప్, మైక్ బిర్బిగ్లియాతో పాటు హాలీవుడ్ దిగ్గజ నటులు మోలీ రింగ్‌వాల్డ్, లెవార్ బర్టన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రేమ, వినోదం,, రొమాన్స్, ఊహించని మలుపులతో కూడిన ఈ రోలర్‌కోస్టర్ రైడ్ వన్ నైట్ ఓన్లీ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More